బుధవారం, ఆగస్టు 19, 2020

ప్రతి రోజు పండుగ రోజే...

దృశ్యం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : దృశ్యం (2014)
సంగీతం : శర్రత్
సాహిత్యం : చంద్రబోస్  
గానం : కార్తీక్ 
 
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాల 
మెరుపులు మొదలైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే

ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే

ఇంటి పేరు ఉల్లాసమే
సొంత వూరు సంతోషమే
కంటి నిండుగా కలలుండగా
చేరదంట కన్నీరే
అల్లరంత మా సంపదే
చెల్లదంట ఏ ఆపదే
తుళ్లి తుళ్లి పొంగెనంట ఆటాపాటా
అల్లిబిల్లి ఆకాశంలో 
అమ్మ నాన్న అక్క చెల్లి
మల్లెపూల మబ్బులైతే

ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే

ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
 
అందమైన మా స్నేహమే
అల్లుకున్న ఓ హారమే
సుడిగాలికి చెడు జ్వాలకి
తెగిపోదు ఈ దారమే
గుడిలోని ఆ దైవమే 
అడిగేను ఆతిథ్యమే
గుమ్మంలోనే వాలేనంట 
దేవాలయం
చిన్ని చిన్ని కోపాలన్నీ
చిర్రుబుర్రు తాపాలన్నీ
వచ్చిపోయి ఉరుమైతే

ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే

ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే 
 

2 comments:

ఈ మూవీ ఐపోయినా చాలా సేపు హాంట్ చేస్తూనే ఉంది..నైస్ సాంగ్..

అవునండీ మంచి సినిమా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.