ఆదివారం, ఆగస్టు 16, 2020

శతమానంభవతి...

శతమానం భవతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
 

చిత్రం : శతమానంభవతి (2017)
సంగీతం : మిక్కీ జె మేయర్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : విజయ్ ఏసుదాస్, చిత్ర 

వధువేమొ.. అలమేలు
వరుడట.. శ్రీవారు
మనువాడి.. కలిసారు
చెలిమి కలిమి ఒకరికొకరు.. 
ఈ జంటను దీవించగ
దేవతలందరి నోట 
పలికేను చల్లని మాట
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ

మీసకట్టు కుంకుమ బొట్టూ
కంచి పట్టు పంచె కట్టూ
అల్లుకుంది అనుబంధము
మమతలు ముడివేస్తూ
తను.. తన.. తాళి బొట్టూ
ఆమె.. తన.. ఆయువు పట్టూ
ఏకమైంది దాంపత్యము 
ఏడడుగులు వేస్తూ
నాలొ సగం నీవంటు
నీలొ సగం నేనంటూ
జనమలు జతపడు వలపుగ 
ఇరుమనసులకొక తలపుగ 
కలగలిసిన ఒక తనువుకు

శతమానం భవతీ
శతమానం భవతీ

అందగాడు అందరివాడూ
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు 
నచ్చిన చెలికాడూ
పంచదార నవ్వుల వాడూ
పాతికేళ్ల పండుగ వీడూ
తాతయ్యకు నానమ్మకు 
నమ్మిన చేదోడు
ఉగ్గుపాలే గోదారై
ఊపిరి గాలే గోదారై
గల గల పరుగుల 
కలలుగ అలలెగసిన
తనవయసుకు 
నలుపెరుగని 
పసి మనసుకు

శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
 
 
 

2 comments:

బ్యూటిఫుల్ సాంగ్..యెప్పుడు విన్నా మనసుకి చాలా హాయిగా ఉంటుంది..

అవునండీ..థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.