గురువారం, ఆగస్టు 27, 2020

లాహిరి లాహిరి లాహిరి లో...

లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ఉన్నికృష్ణన్, సునీత 

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ 
ఒ ఓ ఔ.. అం అహా..
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ 
ఒ ఓ ఔ అం అహా
అను అక్షరాలే తోడుగా
పడమర ఎరుగని సూర్యుడు నాన్న 
పున్నమి జాబిలి మా అమ్మ
ముచ్చట తీరా ముగ్గురు అన్నల 
ముద్దుల చెల్లిగ పెరిగిన మన కథ

లాహిరి లాహిరి లాహిరి లో
మన అందరి గుండెల సందడిలో  
లాహిరి లాహిరి లాహిరి లో 
మన అందరి గుండెల సందడిలో 

చందురున్నే దారంకట్టి 
దించుకుందాం ఎంచక్కా
దీపమల్లే పెట్టడానికి
ఓ తారలన్నీ హారంకట్టి 
తెచ్చుకుందాం సరదాగా
బొమ్మరింటి తోరణానికి

పండగ సందళ్ళే 
నిండిన మా ఇల్లే 
రంగుల హరివిల్లే
కోవెల గంటల్లే 
కోయిల పాటల్లే 
సరదాల అల్లరే
కళ్ళలో కాంతులే దీపావళి
కల్లలు ఎల్లలు కనివిని ఎరుగని

లాహిరి లాహిరి లాహిరి లో 
చిరునవ్వుల మువ్వల సవ్వడిలో
లాహిరి లాహిరి లాహిరి లో 
చిరునవ్వుల మువ్వల సవ్వడిలో

ఏం వయస్సో ఏమోగాని 
చెప్పకుండా వస్తుంది
తేనెటీగ ముల్లు మాదిరి
ఓ.. ఏం మనస్సో ఏమోగాని 
గుర్తుచేస్తూ ఉంటుంది
నిప్పులాంటి ఈడు అల్లరి

ఒంటరి వేళల్లో 
తుంటరి ఊహల్తో
వేధిస్తూ ఉంటుంది
తోచిన దారుల్లో 
దూసుకు పోతుంటే
ఆపేదెలా మరీ
ఎవ్వరో ఎక్కడో ఉన్నారని
గువ్వలా గాలిలో ఎగిరిన మది కథ

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ 
ఒ ఓ ఔ అం అహా
అని ఆగనంటూ సాగదా
మనసును చిలిపిగ పిలిచిన ప్రేమ
వయసుని తరిమిన ఆ ప్రేమ
కోరిన జంటను చేరేదాక 
ఒక క్షణమైనా నిలువని పరుగుల

లాహిరి లాహిరి లాహిరి లో 
తొలివలపులు పలికిన సరిగమలో 
లాహిరి లాహిరి లాహిరి లో 
తొలివలపులు పలికిన సరిగమలో 
 
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.