ఆదివారం, ఆగస్టు 23, 2020

తందానే తందానే...

వినయవిధేయరామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినయవిధేయరామ (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి 
గానం : ఎం ఎల్ ఆర్ కార్తికేయన్ 

తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఏ తియ్యదనం మనసుపడి రాసిందో 
ఎంతో అందంగా ఈ తల రాతలనే
ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే

తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండగనే

ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే
మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టిన వాళ్ళో 
ఏ దిక్కున మొదలైనోళ్లో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలిపటాలో
ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే

ఈ ఇంటిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడూ అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడి విడిగా వీళ్ళు పదాలే 
ఒకటయ్యిన వాక్యమల్లె
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్ళు స్వరాలే 
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే

ఒకటే కలగంటాయంట వీళ్లందరి కళ్ళు
అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు
వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు 


2 comments:

మూవీ యెలా ఉన్నా..ఈ పాట బావుంటుంది..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.