శుక్రవారం, ఆగస్టు 14, 2020

గోలుమాలు రాజా గోలుమాలు..

హనుమాన్ జంక్షన్ సినిమాలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం : సురేష్ పీటర్స్   
సాహిత్యం : వేటూరి
గానం : మనో, ఎం.జి.శ్రీకుమార్, చిత్ర, సుజాత 

తేనెపట్టును పట్టబోతే 
దొంగ తేలు కుట్టిందంటే 
గోలుమాలు.. 
చక్కని చుక్కని పట్టబోయి 
లెక్కే లేక చిక్కే పడితే 
గోలుమాలు...... 
ఆఆఆ.... హొయ్... 

కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక 
తన వలపుల వలన పడక కల్లోకి రాక 
మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి
ఓ గోలుమాలు... ఆ... గోలుమాలు
చెదిరిన తొలి ఆశలు చెరిగిన చెలి బాసలూ 
మ గోలుమాలు ఆహా గోలుమాలు  
హే రాజా గోలుమాలు గోలుమాలు 

అమ్మాడి గుమ్మాడి ఆషాడం అల్లాడి 
వేటాడి వెంటాడి వేరు పడే నీ జోడి 
హనుమాను జంక్షన్లో హనీమూన్ ఫంక్షన్ లో 
జంబలకిడి రంభకు ముడిపడ్డావంటే 
గోలుమాలు హోఓఓఓఓఓఓ ... 
గోలుమాలు ఒఒఒఒఒఒఒఒఒ ...... 
గోలుమాలు హే..... 

కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక 
తన వలపుల వలన పడక కల్లోకి రాక 
మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి
ఓ గోలుమాలు... ఆ... గోలుమాలు
చెదిరిన తొలి ఆశలు చెరిగిన చెలి బాసలూ 
యమ గోలుమాలు.. గోలుమాలు 
హే రాజా గోలుమాలు గోలుమాలు 

శివుడి ధనుస్సు తుస్సు మనంగా 
సీతకు రాముడు కిస్సు అనంగా 
గజిబిజిమేళం గందరగోళం 
రాధా కృష్ణులు ప్లస్సు అవంగా 
భామే పామై బుస్సుమనంగా 
రుక్మిణి వేసెను కృష్ణుడి తాళం 
కుర్రదంటే కుంపటేనోయ్ 
గుత్తివంకాయ కూర కానేకాదోయ్ 
అంతే లేవోయ్ 
కాళ్ళ గజ్జా గంగాళమ్మ 
వేగుల చుక్క వెలగ మొగ్గ 
వెన్నెల్లో గొడుగంటిది ప్రేమ 
వీరి వీరి గుమ్మడిపండు 
విచ్చెను జాజి మల్లెల చెండు 
మబ్బుల్లో నీళ్లంటిది ప్రేమ 

గోలుమాలు రాజా గోలుమాలు 
 గోలుమాలు రాజా

పడుచుతనపు పరికిణికె పాదాలు ఆడా 
కళలు పండే కలయికలై కళ్యాణి పాడా 
ఎవరికెవరు సొంతమో 
వివరమసలు తెలియని 
ఈ గోలుమాలు గోలుమాలు 
మదనుడికే ఇది పండగ 
మతిచెడి నేనుండగా గోలుమాలు 
గోలుమాలు హే రాజా గోలుమాలు
 
జారు పైటలే జావళీలుగా 
చీర పాపలే చిందులేయగా 
కోరికలన్ని కొక్కొరోకోలంట 
అబల సోకులా జబర్దస్తీ లో 
తబలా గుండెలు తాళమేయ గా 
ఇద్దరి ప్రేమకు ముద్దుల దరువంట 
గోలుమాలు రాజా గోలుమాలు రాజా 
గోలుమాలు రాజా గోలుమాలు...

 

2 comments:

తమషా అయిన పాట..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.