సోమవారం, ఆగస్టు 03, 2020

అందాల చిన్ని దేవత...

రాఖీ పండుగ సందర్బంగా అన్న చెల్లెళ్ళకు అక్క తమ్ముళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తూ శివరామరాజు చిత్రంలోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

చిత్రం : శివరామరాజు (2002)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్  
సాహిత్యం : విజయ్ చిర్రావూరి
గానం : శంకర్ మహదేవన్, సుజాత  

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి
కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది
స్వచ్చమైన ప్రేమే పందిరల్లె అల్లుకుంది
స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నకన్న మెత్తనైన గంగకన్న స్వచ్ఛమైన
ప్రేమబంధమంటె మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు
కలత పెరుగు గుండెలో మాకు
అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమీడ నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
 
శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము
కలిసీ మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు 
 
2 comments:

యాప్ట్ సాంగ్ ఫర్ రక్షాబంధన్..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.