మంగళవారం, జనవరి 17, 2012

స్నేహమా.. స్వర విలాసమా..

ఈ పాటలు అన్నిటికీ సాహిత్యం యూనీకోడీకరించి బ్లాగ్ లో పెట్టుకుందామనుకుంటున్న దగ్గరనుండీ నన్ను బాగా భయపెట్టిన పాట ఈ పాట. భయపడినట్లుగానే చరణం ముందు వచ్చే స్వరములు గ్రహించి టైప్ చేయడం ఎంత ప్రయత్నించినా నా వల్లకాలేదు సరిగా రావడంలేదు తప్పులు తడకలు ఎందుకు ఇవ్వడం అని వాటిని వదిలేశాను. అవి పక్కనపెట్టినా చరణం చివరలో గుక్కతిప్పుకోకుండా పాడిన రెండులైన్లే గ్రహించి టైప్ చేయడానికి నాలుగైదు సార్లు వినాల్సి వచ్చింది. ఎక్కడైనా తప్పులు ఉంటే కామెంట్స్ లో తెలియ చేయవలసిందిగా ప్రార్ధన.

ఈ ఆల్బం మొత్తంలోకి అద్భుతమైన పాటగా చెప్పుకోవచ్చేమో ఈ పాటను శ్రీకృష్ణ కూడా చాలా అద్భుతంగా పాడాడు.. సంగీత సాహిత్యాలలో స్వర విన్యాసం పదవిన్యాసం స్పష్టంగా గమనించవచ్చు. కానీ మొదటి చరణం ముందు వచ్చే స్వరాలు నాకు కొంచెం “నా పాట పంచామృతం” అన్నపాటలో వాటిలా అనిపించాయి బహుశా ఒకే రాగమో తాళమో ఏదో అయి ఉండచ్చు నాకు తెలియదు. ఈ ఆల్బంలో నేను ఎక్కువసార్లు విన్నపాట కూడా ఇదే చిత్రీకరణ సైతం ఇదే స్తాయిలో ఉండి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్బంలో ఇది మూడవపాటైనప్పటికీ save the best for last అన్న సూక్తిననుసరించి దీనిని చివర ఇస్తున్నాను. మీరుకూడా ఈ పాట ఇక్కడ విని ఆస్వాదించండి. ఇంతటితో ఈ దేవస్థానం సినిమా పాటలు సమాప్తం.


చిత్రం : దేవస్థానం
సంగీతం : స్వరవీణాపాణి
సాహిత్యం : స్వరవీణాపాణి
గానం : శ్రీకృష్ణ

స్నేహమా..ఆఅ.ఆ
స్నేహమా.. స్వర విలాసమా..
పద విహారమా.. శృతిగ నవరస భరితమ..
రాగమా భావ భాగమా.. జీవనాదమా..
లయగ ఇరువురి కలయిక..
మరి మరి మురియగ..
మమమదాద మమమనీన్ని దపమగ
మ గ రీ సా ని సనిదపమగరి.. 
మరి మరి మురియగ స్వర సంగమం..
అవని మురియ అక్షర సంగమం..
అవని మురియ అక్షర సంగమం..

శివకేశవ సారూప్య భావనమే.. మైత్రి భంధమై మెరిసినదీ..
జీవాత్మ పరమాత్మ సంగమం.. అద్వైత ఆనంద అనుభవం..
జీవాత్మ పరమాత్మ సంగమం.. అద్వైత ఆనంద అనుభవం..
ఓం భూర్భువ సువః మంత్రము మహోజ్వలిత మహా శక్తి యంత్రము..
అణువణువునుగని చెలిమమరినదని అరమరికెరుగనిదని మరి తెలుపగ తర తమ తలపుల తలుపులు బిగియగ ముడిబడి కుడిఎడమలు ఇటు నిలబడ కడవరకిక కలగల సిరి కరముల..

సంగమమే.. శుభ సంగమమే..      
మరి మరి మురియగ...
మమమదాద మమమనీన్ని దపమగ
మ గ రీ సా ని సనిదపమగరి.. 
మరి మరి మురియగ స్వర సంగమం..

గతజన్మల సంస్కార పరిమళమూ.. ఈ జన్మకు ఫలదాయకమూ..
మందార మకరంద మధుగిరీ.. మధురాతి మధుర నవ పదఝరీ..
మందార మకరంద మధుగిరి.. మధురాతి మధుర నవ పదఝరీ..
ప్రభాకర స్సుధాకరుల చెలిమిగ గ్రహాలొసగె శుభాశీస్సు విరివిగ
కరముని బలముగ కులములు మతములు ఇల నిలవనివని వెలుగులు తెలుపగ తరగని సిరులకు పదకవితలగని వరములు వరదగ వరసగ కురియగ వడి వడి నడకల కదలెడు పదముల..

సంగమమే శుభ సంగమమే
మరి మరి మురియగ
మమమదాద మమమనీన్ని దపమగ
మ గ రీ సా ని సనిదపమగరి.. 
మరి మరి మురియగ స్వర సంగమం..
అవని మురియ అక్షర సంగమం..
అవని మురియ అక్షర సంగమం..

6 comments:

గ్రేట్ జాబ్ వేణుగారు!!! ఇంత మంచి పాటలని పరిచయం చెయ్యడమేగాక ఇంత కష్టమైన సాహిత్యాన్ని టైప్ చేసి పోస్ట్ చేసినందుకు హాట్సాఫ్ :D
పాట విషయానికి వస్తే శ్రీకృష్ణ చాలా బాగా పాడాడు, కానీ బాలుగారైతే మరింత బాగా వుండేది ఏమో అని ఒక చిన్న (బయాసడ్?) ఫీలింగ్...
మూవీలో ఏ కారక్టర్ కి వుందో మరి ఈ పాట.
నాక్కూడా చరణంకి ముందువచ్చే మ్యూజిక్(1:20) మీరు చెప్పినట్టు నా పాట పంచామృతం పాటలా అనిపించింది. దానితో పాటు చాలా చోట్ల 180 మూవీలోని "నిన్నలేని వింతలే చూపెనే" పాట చాలా సార్లు గుర్తు వచ్చింది, ఎందుకో మరి ...ఈపాట ఇదివరకు విని ఉండకపోతే తప్పక వినండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా :)

ధన్యవాదాలు మెహక్ గారు. హహహ బాలుగారైతే మరింత బాగుండేదనడంలో సందేహం లేదు కానీ ఇతని కొత్త స్వరంలో వినడం కూడా నాకు నచ్చిందండీ..
"నిన్నలేని వింతలే" పాట విన్నానండీ నాకు ఏమీ సారూప్యత కనిపించలేదు. బహుశా అది గ్రహించగలిగేంత సంగీత పరిఙ్ఞానం నాకు లేదేమో :-)

Congrats Venu garu :))
http://sailajachandu.blogspot.com/2012/01/blog-post_20.html

మా ధనాధన్ రావు ఇంత గొప్పవాడయి పోయాడా !
ఇద్దరు అఖండులుని పట్టి దర్శకం చేసేంతగా !

చీర్స్
జిలేబి.

ధన్యవాదాలు మెహక్ గారు :-)

ధన్యవాదాలు జిలేబి గారు, మీరు జనార్ధన్ మహర్షిగారి గురించే మాట్లాడుతున్నారనుకుంటున్నాను.
ఈ సినిమా జనార్ధనమహర్షిగారు రాసిన గుడి అనే నవల ఆధారంగా నిర్మించారని విన్నాను. తన రచన కనుక తనే అన్నీ అయి నిర్మిస్తుండి ఉండవచ్చు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.