జనార్ధన మహర్షి దర్శకత్వంలో బాలు, విశ్వనాథ్, ఆమని కలిసి నటించిన నూతన చిత్రం దేవస్థానం. పలు కమర్షియల్ సినిమాల నడుమ మొన్న డిశంబర్ పదహారున ఈ సినిమా పాటలు విడుదలైనా నా దృష్టికి కాస్త ఆలశ్యంగా వచ్చాయనే చెప్పాలి. కానీ విన్న వెంటనే దదాపు అన్ని పాటలు అమితంగా నచ్చేశాయి. సంక్రాంతి సంధర్భంగా ఈరోజునుండి ఓ వారంపాటు సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ స్వరవీణాపాణి రచించి స్వరపరిచిన ఈ సినిమా పాటల సాహిత్యాన్ని రోజుకొకటి చొప్పున ఈ బ్లాగులో అందిస్తాను.
ఈ ఆల్బంలో మొదటి పాట చిత్రగారు పాడిన “పలుకు తెలుపు తల్లివే” అన్నపాట. సరస్వతీ దేవి ప్రార్ధనలా అనిపించే ఈ గీతాన్ని స్వరవీణాపాణి స్వయంగా రాసి స్వరపరిచారు. వినగానే ఆకట్టుకునే పాట చిత్ర గారి స్వరంలో మరింత నచ్చేస్తుంది దీనిని హంసధ్వని రాగంలో స్వరపరిచారుట. పాట గురించి నేను వర్ణించడంకన్నా మీరే విని ఆస్వాదించండి. ఆడియో చిత్ర గారి స్వరంలో ఇక్కడ, ఇదే పాటను బాలుగారి స్వరంలో ఇక్కడ వినవచ్చు.
ఈ పాటల గురించి ఒక చిన్న విఙ్ఞప్తి ఒకప్పుడు 80-90 లలో ఎన్నో మధురమైన చిత్రాల పాటలను అందించిన లియో రికార్డ్స్ ఈ చిత్రం ఆడియోను మనకందచేసింది. ఇటువంటి సంగీత సాహిత్య ప్రధానమైన ఆడియోలను ప్రోత్సహించడం ఆధునిక చిత్రాలలో ఇవి కరువౌతున్నాయని బాధపడుతూ ఇలాంటి పాటలను మిస్ అవుతున్న మనందరి కర్తవ్యం కనుక ఇక్కడ పాట విన్నాకూడా దయచేసి మీకు సాధ్యమైతే ఈ సినిమా క్యాసెట్/సిడి కొని పాటలను ప్రోత్సహించండి.
చిత్రం : దేవస్థానం
సంగీతం : స్వరవీణాపాణి
సాహిత్యం : స్వరవీణాపాణి
గానం : చిత్ర, బాలు
ఓం....
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
మదాలసా.. సుధారసాంశువల్లివే..
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
స్వరాంతరాంతరాల నాద రూపిణీ..
పద ధిమిధిమిధ్ది శబ్ద శాసనీ..
శృతి భరితా ఆఆ... లయ చరితా...ఆఆ
శృతిభరితామృత మృదు పద కమల సుధారావాహినీ..
లయ చరితాన్విత పద ద్వయ త్రయ గతి శాస్త్రాన్వేషిణీ..
శుభకరణీ... వాణీ... కళ్యాణీ...
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
సంగీతం : స్వరవీణాపాణి
సాహిత్యం : స్వరవీణాపాణి
గానం : చిత్ర, బాలు
ఓం....
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
మదాలసా.. సుధారసాంశువల్లివే..
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
స్వరాంతరాంతరాల నాద రూపిణీ..
పద ధిమిధిమిధ్ది శబ్ద శాసనీ..
శృతి భరితా ఆఆ... లయ చరితా...ఆఆ
శృతిభరితామృత మృదు పద కమల సుధారావాహినీ..
లయ చరితాన్విత పద ద్వయ త్రయ గతి శాస్త్రాన్వేషిణీ..
శుభకరణీ... వాణీ... కళ్యాణీ...
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
ప్రభాస మానస కలకళా వాదినీ..
విశిష్ట సత్య నిష్ట ధర్మ పాలినీ..
స్వర లహరీ ఈఈ.. జయవిజయీ ఈఈ..
స్వర లహరీ సరిగమపదనిస పథ రమ్యగామినీ..
జయవిజయీభవ వికసిత స్మిత వదనాంతర్యామిని.
వాగ్జనినీ.. బ్రాహ్మీ.. వరదాయీ...
పలుకు తెలుపు తల్లివే..
పదాల జిలుగులల్లవే..
8 comments:
naakkoo vinagaane nachchindandee ee song..
చాలా బాగుందండీ పాట.
మంచి పాటను వినిపించారు.
ధన్యవాదాలు..
రాజ్ ఽ శ్రీలలిత గారు నెనర్లు.
ఈ పాటలు చాలాబావున్నాయి. పరిచయంచేసి వినిపించినందుకు నెనర్లు.
ధన్యవాదాల నాగేస్రావ్ గారు.
chaalaa baagundi :-)
ee paaTa gurinchi nEnu kooDa oka bulli blaagu vraaSaanu, kaani telugu lO chaduvutunTE chaalaa haayigaa anipinchindi :)
Thanks Tejo Karthik గారు. ఈ పాట హంసద్వని రాగంలో స్వరపరచినదని మీ బ్లాగ్ లో చూశాకే తెలిసింది. అందుకే మీ పోస్ట్ లింక్ కూడా ఇచ్చాను ఈ టపాలో ఆ విషయం చెప్పినదగ్గర :-)
Oh, nEnu gamaninchalEdu adi :-)
dhanyuDanu!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.