శుక్రవారం, జనవరి 13, 2012

దేవస్థానం.. దేవస్థానం..

ఈ పాటలు నాకు వినేకొద్దీ మరీ మరీ నచ్చుతున్నాయ్.. అసలు నేను వింటున్నది కొత్త సినిమా పాటలేనా అనిపిస్తుంది.  ఏడాదికో ఆల్బం ఇలాంటిది వచ్చినా మనసుకు హాయిగా అనిపిస్తుందేమో. ఈ రోజు పరిచయం చేయనున్నపాట బాలు పాడిన దేవస్థానం అన్న టైటిల్ సాంగ్. బాలుగారికి ఇలాంటి పాట ఇస్తే ఎంత బాగా పాడేస్తారో తెలిసిందే కదా పైస్థాయిలో చాలా చక్కగా పాడారు దేవస్థానం అన్న ఒక్కమాటని ఆయన ఒకోసారి ఒకోవిధంగా పలకడం చాలాబాగుంటుంది. దేవస్థానం గొప్పతనాన్ని వివరిస్తూ స్వరవీణాపాణి గారు రాసిన సాహిత్యం కూడా చాలా బాగుంది. పల్లవి మూడుసార్లు రిపీట్ అయినపుడు దేవస్థానంతో ప్రాస కుదిరేలా భక్తిస్థానం.. శక్తిస్థానం.. లాంటి పదాలు వాడి రాసిన మూడులైన్లు కూడా చాలానచ్చాయి. చరణాలు కూడా చాలా బాగా కుదిరాయి. ఈ పాటను ఇక్కడ వినండి.

చిత్రం : దేవస్థానం
సాహిత్యం : స్వరవీణాపాణి
సంగీతం : స్వరవీణాపాణి
గానం : బాలు, చిత్ర, సాయివీణ

శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం.
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
ఓం నా మహా.. మహా.. మహా..
శివా యాహ.. యహ.. యహా.. 
ఓం నా మహా.. మహా.. మహా..
శివా యాహ.. యహ.. యహా.. 
బీజాక్షరాల వాణి వరమాల
పంచక్షరాల శూలి జపమాల
నిరంతరం తరం తరం శుభకరమే..
దేవస్థానం.. దేవస్థానం..
భక్తి స్థానం.. శక్తి స్థానం.. ముక్తి స్థానం.. దేవస్థానం...

మోక్షమార్గ ద్వారం మహిమలమంత్రస్థానం..
సూక్ష్మ ఙ్ఞాన ధామం సృష్టికి భోధ స్థానం..
సకలాగమాంతరార్ధం భువి పుణ్యకోటి తీర్ధం..
సకలాగమాంతరార్ధం భువి పుణ్యకోటి తీర్ధం..
జీవో దేవోస్సనాతనస్థానం..

దేవస్థానం... దేవస్థానం..
వేదస్థానం.. నాదస్థానం.. మోదస్థానం.. దేవస్థానం.

విశ్వాంతరాలలో మార్మిక యోగ స్థానం..
హృదయాంతరాలలో ధార్మిక ధ్యాన స్థానం..
ఇహలోక సౌఖ్యమొసగే లౌకిక లక్ష్య స్థానం..
ఇహలోక సౌఖ్యమొసగే లౌకిక లక్ష్య స్థానం..
ధర్మో రక్షతి రక్షిత శ్రీ స్థానం..
 
దేవస్థానం... దేవస్థానం..
పుణ్య స్థానం.. భవ్యస్థానం.. దివ్యస్థానం.. దేవస్థానం.

10 comments:

బావుంది వేణు గారు , నేను ఇదే వినడం ఈ సినిమా పాటలు !

పాటని పరిచయం చేసినందుకు థాంక్స్ వేణుగారు.
కానీ ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడారా? నాకెందుకో శ్రీకృష్ణ గొంతులాగా అనిపిస్తోంది :O

శ్రావ్య నెనర్లు, ఆల్బంలో దదాపు అన్ని పాటలు చాలా నచ్చేశాయి నాకు.
మెహెక్ గారు నెనర్లు, ఎవరు అడుగుతారా అని ఎదురు చూస్తున్నానండీ.. మీరు గమనించింది కరెక్టే, ఎందుకు జరిగిందో కానీ ఆడియోలో బాలుగారు పాడిన పాట రిలీజ్ చేశారు ట్రైలర్ లో మాత్రం శ్రీకృష్ణ పాడిన పాట ఉంది. సినిమాలో ఎవరి వర్షన్ ఉందోమరి. పోస్ట్ లో ఆడియో లింక్ కూడా ఇచ్చాను మీరోసారి అది విని చూడండి.

శాంతాకారం అంటూ హెచ్చు స్థాయిలో గద్దించినట్టు, తరిమినట్టు పాడటం, అది బాలు కానివ్వండి, ఏసుదాసు కానివ్వండి, నాకెందుకో నచ్చలేదండి. విబేధించినందుకు వ్యాఖ్య తొలగించుకోగలరు, సెనగలు సారీ నెనరులు.

హహహ అజ్ఞాత గారూ సెనగలు..నెనరులు :-))
భాషను గమనించుకుంటూ గౌరవంగా విబేధించినంత వరకూ వ్యాఖ్యలు ఉంచడానికి నాకు ఏవిధమైన అభ్యంతరం లేదండీ.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు నెనర్లు.
మీరనేది శాంతాకారం గురించేనా లేక దేవస్థానం అని రాయబోయి శాంతాకారం అని రాశారా.. ఎందుకంటే శాంతాకారం అన్నమాటలు బాగానే పాడారు పాటలో దేవస్థానం దగ్గర హెచ్చు స్థాయిలో పాడినది వాస్తవమే కానీ అది ఎలివేట్ చేస్తూ గొప్ప అని గర్వంగా చెప్పుకుంటున్నట్లు అనిపించింది. వాస్తవానికి అలా పాడటమే నన్ను ఈ పాటలో ఎక్కువ ఆకర్షించింది.

ఈ సినిమాలో ఆ రెండు హరికథల గురించీ వెయిటింగ్ ఇక్కడ :))

హహహ శంకర్ గారు :-) ఈ రోజు ఇంకో గంటలో ఒక హరికథ రాబోతుంది :-)

ఆడియో లింక్ ఇప్పుడే విన్నాను వేణు గారు. నిజంగా చెవులకు పట్టిన తుప్పు వదలిపోయింది.
బాలు గారు తప్ప పాట ఎవరు పాడినా అలాంటి ఫీలింగ్ రాదు.
సినిమాలో బాలుగారి పాటే ఉండాలి, ఉండితీరాలి :))

హహహ బాగా చెప్పారు మెహక్ గారూ :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.