శుక్రవారం, జనవరి 06, 2012

తెల్లారింది లెగండో..

సిరివెన్నెల గారు పాడిన అతి కొన్ని పాటలలో ఇది ఒకటి నాకు చాలా ఇష్టమైన పాట. కళ్ళు అనే సినిమాలోనిది, నలుగురు గుడ్డివాళ్ల గురించి సినిమా అని తప్ప ఈ సినిమా గురించి నాకు ఇంకే వివరాలు గుర్తులేవు. పాట మాత్రం చాలా బాగుంటుంది రచయితే పాడటం వలననేమో కొన్ని పదాల పలుకు విరుపు యాస అంతా చక్కగా స్పష్టంగా ఉండి ఆకట్టుకుంటుంది. చమటబొట్టు చమురుతో సూరీణ్ణి వెలిగిద్దాం.. వేకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు చేసి లాంటి లైన్స్ చాలా బాగుంటాయి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. వీడియో దొరకలేదు కేవలం ఆడియో మాత్రం ఉన్న వీడియో లింక్ ఇక్కడ. 
చిత్రం : కళ్ళు (1988)
సంగీతం : SPB
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సిరివెన్నెల

తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో...

తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో

తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో

పాములాంటి చీకటి పడగ దించి పోయింది
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి
చావు లాటి రాతిరి సూరు దాటి పోయింది
భయం నేదు భయం నేదు సాపలు ట్టేయండి
ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది
ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి సూపు లెగర నీయండి

తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో

చురుకు తగ్గిపోయిందీ చందురుడి కంటికి
చులకనై పోయిందీ లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చి పోయిందీ అల్లుకున్న పాపం
మసక బారి పోయిందా సూసేకన్ను
ముసురు కోదా మైకం మన్నూ మిన్ను
కాలం కట్టిన గంతలు దీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి

తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో

ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదై పోదా కమ్ముకున్న నీడ
ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల పీడ
చమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ శత్తుల కత్తులు దూసి
రేతిరి మత్తును ముక్కలు సేసి

తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో

7 comments:

ఈ పాట సిరివెన్నెల గారు పాడిందని ఇప్పుడే తెలిసి౦దండీ..ఈ బ్లాగు మీదని కూడా...

ఈ పాట post చెసినందుకు ధన్యవాదాలు.
సిరివెన్నెలగారు స్వయంగా పాడిన పాట ఇది ఒక్కటే అనుకున్నాను. వేరే ఏ పాటలు పాడారో చెప్పి పుణ్యం సంపాదించుకోండి :).

ఈ పాట post చెసినందుకు ధన్యవాదాలు.
సిరివెన్నెలగారు స్వయంగా పాడిన పాట ఇది ఒక్కటే అనుకున్నాను. వేరే ఏ పాటలు పాడారో చెప్పి పుణ్యం సంపాదించుకోండి :).

నాకు ఎంతో ఇష్టమయిన పాట ఇది. పోస్ట్ చేసినందికు నెనర్లు, వేణు :-)

జ్యోతిర్మయి గారు నెనర్లు..
Myth ya గారు నెనర్లు, గాయం సినిమా లోని “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” పాటకూడా సిరివెన్నెల గారు పాడారండీ.. ఇంకా సినిమాల్లో పాడినవి గుర్తులేవు కానీ పర్సనల్ వీడియోలో ఆయన పాడుతుండగా రికార్డ్ చేసిన “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..” అన్నపాట చాలా ఫేమస్. ఇది సినిమాలో వేరే సింగర్ పాడారు.
భాస్కర్ నెనర్లు...

చాలా బాగుంది పాట. ఇది సిరివెన్నెల పాడారని తెలీదు నాకు. ఆయన పాడిన పాటని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ...

ధన్యవాదాలు గీతిక గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.