బుధవారం, అక్టోబర్ 21, 2020

నిను చూడక నేనుండలేను...

ఓ పి నయ్యర్ గారి గురించి తెలియని సంగీతాభిమానులు ఎవరుంటారు. అంతటి వారు తెలుగులో చేసిన ఏకైక చిత్రం నీరాజనం. అందులోని ఓ కమ్మని పాటను ఈ రోజు తలచుకుంటూ బాలు గారు వీరి గురించి వీరు ఒక మ్యుజిషియన్ కి ఇచ్చిన ప్రాముఖ్యత గురించి చెప్పిన కబుర్లు ఈ వీడియో తర్వాత వినండి.
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
 
 
చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ పి నయ్యర్,
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : బాలు, జానకి

ఆఆఆఆఅహాహాహా
ఆఆఆఆఅహాహాహా
ఓహో ఓహో ఓహో 

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను

ఓహోహో..ఆహాహా..
ఆహాహా..ఓహోహో..
ఆహాహా.. ఓహోహో..
ఓహోహో..ఆహాహా..

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

ఓహోహో..ఆహాహా..
ఆహాహా..ఓహోహో 
ఓహాహా..ఆహోహో..
ఆహాహా..ఓహోహో..

నీ జత గూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
 
 


2 comments:



నిను చూడక నేనుండగ
లన యే హరివిల్లు బూయ! లలనా కదలా
డిన చిరుగాలి చరణపు శృ
తిని వినిపించె సఖియా మది తొణికెనమ్మీ


జిలేబి

థ్యాంక్స్ జిలేబి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.