ఆదివారం, అక్టోబర్ 18, 2020

సువ్వి సువ్వి సువ్వాలమ్మా...

స్వాతిముత్యంలో పాటలన్నీ అద్భుతాలే. వాటిలోని సువ్వీ సువ్వీ పాట మరింత ప్రత్యేకం. ఈ పాటను స్వరాభిషేకం వేదిక పై బాలుగారితో సునీత పాడింది. ఈ పాట మధ్యలో వచ్చే ఆలాపన గుర్తుందా అది చాలామంది బాలుగారే పాడారనుకుంటారు కదా కానీ అది పాడింది బాలు గారు కాదట. మరి ఎవరు పాడారో ఈ ఎంబెడెడ్ వీడియోలో పాట తర్వాత బాలు గారి నోట వినండి.    
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం  : బాలు, జానకి  

ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
చాల బాగా పాడుతున్నారే
ఆ... పైషఢ్యం...
మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ

ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా
...ఆ... ఆ..... ఆ.........
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...

అండా దండా ఉండాలని 
కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని 
కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే 
నిను కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...
గుండే లేని మనిషల్లే 
నిను కొండా కోనల కొదిలేశాడా
 
అగ్గీ లోనా దూకి 
పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
 
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

చుట్టూ ఉన్నా చెట్టు చేమ 
తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ 
తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే 
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే 
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి 
నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు 
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు 
చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ..0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.