మంగళవారం, అక్టోబర్ 20, 2020

సన్నాజాజి కి గున్నా మావికి...

ముత్యాల పల్లకి సినిమాలో మల్లెమాల గారు వ్రాసిన ఈ అద్భుతమైన పాట ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇలాంటి అందమైన పాట రాసిన మల్లెమాల గారు ఏం బడికే వెళ్ళలేదు అని మీకు తెలుసా. వారి మంచి మనసు గురించి సత్యంగారితో వారి అనుబంధం గురించి బాలు గారు సరదాగా ఆయన సొంత ఊరైన నెల్లూరి యాసలో చెప్పిన బోలెడు కబుర్లు ఈ వీడియో తర్వాత వినండి.

ముందుకు వెళ్ళేముందు నాదో చిన్న కబురు చెప్పాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు నా పని కాస్త ఆలశ్యమైంది రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ పోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాట ఇంకా దాని తర్వాత బాలు గారి కబుర్లు వినగానే నా అలసట నిద్ర అన్నీ మాయమైపోవడమే కాక కొత్త హుషారొచ్చేసింది అనడంలొ ఏమాత్రం అతిశయోక్తి లేదు.  
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటా మంతీ లేని వేణువు పాట పాడిందీ.. 
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటా మంతీ లేని వేణువు పాట పాడిందీ.. 
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. 
గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. 
హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళలో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో..
పూచే వసంతాలు మా కళ్ళలో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో..
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటా మంతీ లేని వేణువు పాట పాడిందీ.. 
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.