శుక్రవారం, అక్టోబర్ 23, 2020

శివపూజకు చివురించిన...

స్వర్ణకమలం సినిమాలోని ఈ చక్కని పాట గురించి తెలియని వారు నచ్చని వారు ఉండరేమో. ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తూ ఈ పాటను తలచుకుందాం. ఎంబెడెడ్ వీడియోలో ఈ పాట గురించి, విశ్వనాథ్ గారు అండ్ సిరివెన్నెల గారి కాంబినేషన్ గురించి బాలు గారు పంచుకున్న విశేషాలు చూడండి.  
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల 

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....

తన వేళ్ళే సంకెళ్ళై కదల లేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కుల
ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా
ప్రతిరోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
చలిత చరణ జరితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాశం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో... 
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా

స్వధర్మే నిధనం శ్రేయహా
పరధర్మో భయావహా
  

2 comments:శివపూజకు చివురించిన
కవనంపు సిరిసిరిమువ్వ కాంతుల చిందిం
చి వరించి రావె పయనిం
చవె నెట్టి తలపుల నావ జ్వలిత కిరణమై


జిలేబి

థ్యాంక్స్ జిలేబి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.