మంగళవారం, అక్టోబర్ 13, 2020

పూసింది పూసింది...

సీతారామయ్య గారి మనవరాలు సినిమాలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. చిత్ర గారు శ్రద్ధగా తెలుగు నేర్చుకోవడానికి బాలు గారి అల్లరే కారణమట తెలుసా. ఆవిడ "ఒక వార్త ఆలోచించి చెప్తా" అంటే "వార్త అనకూడదమ్మా వీలైతే ఒక ఈనాడు అను లేదా ఒక మాట అను" అనే స్పాంటేనియస్ ఛలోక్తి బాలుగారికి మాత్రమే సొంతం. ఆ గమ్మత్తైన విశేషాలు మీరూ ఈ వీడియో తర్వాత చూడండి.   

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

హహ..పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే.... విరబూసే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
 

 

2 comments:

మెలోడియస్ సాంగ్..

హండ్రెడ్ పర్సెంట్.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.