మంగళవారం, జులై 02, 2013

నీ జతగా నేనుండాలీ..

ఎవడు సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ఈ మెలొడీ బాగుంది మీరు విన్నారా? ముఖ్యంగా మొదటి చరణంలో కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ ఉన్నా రాలేదే అని దెబ్బలాడే ప్రేయసితో కల్లోకి రావాలంటే నువు నిద్రపోవాలిగదా అని రెప్పలబైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోకపోగా తిడతావే అని చెప్పే సమాధానం చాలాచక్కగా ఉంది :) చరణం చివరిలైన్లు స్వరపరచడంలో దేవీశ్రీప్రసాద్ ఎందుకో తడబడ్డాడనిపించినా మొత్తం పాట వినడానికి బాగుంది శ్రేయఘోషల్ కార్తీక్ ల స్వరాలు ఈ చక్కని డ్యూయట్ కి నిండుదనాన్ని చేర్చాయ్. ఆడియో లింక్స్ నాకు ఎక్కడా దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి. షార్ట్ ప్రొమో ఇక్కడ క్లిక్ చేసి చూడచ్చు. పూర్తి పాట ఇక్కడ కింద ఇచ్చిన వీడియోలో వినవచ్చు.

 

చిత్రం : ఎవడు
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : శ్రేయాఘోషల్, కార్తీక్

నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..
నీ నీడై నేనడవాలి.. నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..

నాకే తెలియని నను చూపించి.. నీకై పుట్టాననిపించి..
నీదాకా నను రప్పించావే..
నీ సంతోషం నాకందించి.. నా పేరుకి అర్ధం మార్చీ..
నేనంటే నువ్వనిపించావే..

||నీ జతగా||

కల్లోకొస్తావనుకున్నా.. తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా..
రాలేదే ?  జాడైనా లేదే ?
రెప్పల బైటే నేనున్నా.. అవి మూస్తే వద్దామనుకున్నా..
పడుకోవే ? పైగా తిడతావే ?
లొకంలో లేనట్టె.. మైకం లో నేనుంటే..
వదిలేస్తావ నన్నిలా..
నీ లోకం నాకంటె.. యింకేందో వుందంటే..
నమ్మే మాటలా

||నీ జతగా||

తెలిసీ తెలియక వాలిందీ..
నీ నడుమొంపుల్లో నలిగిందీ నా చూపూ.. ఏం చేస్తాం చెప్పూ..
తోచని తొందర పుడుతోంది..
తెగ తుంటరిగా నను నెడుతోందీ నీ వైపూ.. నీదే ఆ తప్పూ
నువ్వంటే నువ్వంటూ.. ఏవేవో అనుకుంటూ..
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ.. దూరాన్నే తరిమేస్తూ..
ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..
నీ నీడై నేనడవాలి.. నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..

4 comments:

ఏమైంది DSP కి?? ఇంత చక్కని పాటకి ట్యూన్ చెయ్యడానికి ఇంతతదబడ్డాడేంటి!! మంచి సాహిత్యమున్న పాటలకి చాలా బాగా చేస్తాడుగా ఎప్పుడూ!!
ఈ పాటలో సాహిత్యాన్ని పాడు చేసాడనిపిస్తోంది. సాహిత్యం లో వచ్చే అర్థం ట్యూన్ లో రాలేదు ! pch disappointed!

ఈ మధ్య చాలా సినిమాలు ఒప్పుకుంటున్నాడు సౌమ్యా, దేవీశ్రీకి మొదటినుండీ ఉన్నప్ర్రాబ్లమే సినిమాలెక్కువ చేసే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతుంటుంది.

Sri garu song link dorikinda andi. lekapote idigo.

http://www.youtube.com/watch?v=4s-5UYPUwsM

Thanks శ్రీ గారు. ఆడియో లింక్ అంటే నా ఉద్దేశ్యంలో యూట్యూబ్ లో కాకుండా మ్యూజిక్ సైట్స్ లో ఉండే లింక్ అని అండీ.. కొందరికి యూట్యూబ్ యాక్సెస్ ఉండదని అలా ఇస్తుంటాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.