ఆదివారం, మే 12, 2013

కథగా కల్పనగా కనిపించెను

ఈ సినిమా నేను అంతగా ఊహతెలియని వయసులో మొదటి సారి చూశాను అప్పట్లో శీనూ విజ్జీకి కథ చెప్పే సన్నివేశంలో వచ్చే భోజరాజు పాట ఒక్కటే నచ్చేది. కొంతకాలం తర్వాత విన్నపుడు ఈ కథగా కల్పనగా పాట మనసుకు హత్తుకుపోయింది. పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలా బాగుంటుంది. ఇళయరాజా గారి సంగీతం అలా స్మూత్ గా సాగుతూ మనసుకు జోలపాడేస్తుంది. బాలూ మహేంద్ర క్లాసిక్ ఈ సినిమా. ఈ పాట సినిమా థీంని చెప్పేస్తుంది. సినిమా చివర్లో వచ్చే విషాదచరణంలో చెప్పినట్లు కొందరు కొందరి జీవితాల్లోకి ఎందుకు వస్తారో ఎందుకు కాదని పోతారో స్పష్టమైన కారణాలు చెప్పలేము. 

ఈ మధురమైన పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. ఇక్కడ ఇచ్చిన వీడియోకన్నా మరింత స్పష్టమైన పాట వీడియో ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.



చిత్రం: వసంత కోకిల (1982)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని||2||
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

సినిమా చివరిలో వచ్చే మూడవ చరణం.. ఇక్కడ చూడండి..
 

ఎవరికి ఎవరో ఎదురవుతారూ..
మనసూ మనసూ ముడిపెడతారూ..
ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో..
బ్రతుకే రైలుగా సాగేనటా.. నీతో నువ్వే మిగిలేవటా..

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా.. ఆమని విరిసే తోటగా
లాలిజో జోలాలిజో ... లాలిజో జోలాలిజో

5 comments:

ఈ పాట ఇంతకు ముందు విన్నాను కాని చూడలేదు బాగుంది .

నాకు చాలా ఇష్టమైన పాట వేణు గారు.

థాంక్స్ మాల గారు. ఓహో చూడలేదాండీ.. నాకు వీడియో కూడా చాలా ఇష్టం, వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని చూపించిన తీరు నాకు భలే నచ్చుతుంది.

థాంక్స్ జ్యోతిర్మయి గారు. నేనూ తరచుగా వినే పాటల్లో ఒకటండీ.

Naaku jesudas garu padina tamilo song chala bagutundi..
http://www.youtube.com/watch?v=1WwWrzInpvc

థాంక్స్ శ్యామ్ గారు.. తమిళ్ పాట కూడా చాలా బాగుంటుందండీ జేసుదాస్ గారు కావడంతో ఇక చెప్పేదేముంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.