గురువారం, మే 09, 2013

పుచ్చా పూవుల విచ్చే తావుల

తన అమ్మమ్మగారి ఊరైన కొల్లూరు(తెనాలి తాలూకా)లో మా కృష్ణవేణమ్మ అందాలకు ముగ్దుడై వేటూరి గారు రాసుకున్న ఈ అందమైన గీతాన్ని సినిమాలో కృష్ణానది లేకపోయినా సంధర్బానికి సమన్వయం చేసుకుంటూ గుణశేఖర్ చిత్రీకరించిన తీరు కూడా చూడ ముచ్చటగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పాట, విడుదలై ఇన్నాళ్ళయినా నేను తరచుగా వినే పాట, ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట ఇది.
ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినండి.

ఈ పాట గురించి వేటూరి వారు కొమ్మకొమ్మకో సన్నాయి శీర్షికలో రాసుకున్న మాటలు ఇక్కడ చూడండి. ఈ ఫైల్ స్కాన్డ్ కాపీ అందించినందుకు ఫణీంద్ర గారికి ధన్యవాదాలు.
 

చిత్రం : మనోహరం
సాహిత్యం : వేటూరి
సంగీతం : మణిశర్మ
గానం : పార్థసారధి, చిత్ర

పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలూ
అచ్చామీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

ముద్దా బంతులు ముని గోరింటలు మురిసే సంజెల్లో
పొద్దే ఎరుగని ముద్దే తరగని రస నారింజల్లో
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలకువ
వీణ మీటె సెలయేరూ చలి వేణువూదె చిరుగాలీ
కలువ కనులలోన కలవరింతలాయే
చలువ తనువులోన జలదరింతలాయే
ఓ..ఓ..ఓ..ఓ

పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ ఇసకల్లో
తెల్లా మబ్బులె వెల్లా వేసిన పిల్ల కాలువల్లో
వచ్చీనాయమ్మా వచ్చీనోయమ్మా
వచ్చీనాయమ్మా అలజడులొచ్చీనాయమ్మా

లేత పచ్చికల అణకువ నునులేత మచ్చికల కువకువ
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివ శివ
పట్టపగటి ఎండా పండు వెన్నెలాయే
నిట్టనిలువు తపనే నిలువనీయదాయె
ఓ..ఓ..ఓ..ఓ

ఓరా వాకిలి తీసీ తీయని దోరా వయసుల్లో
మాఘా మాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో
వచ్చీనోయమ్మా గిచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా వలపులు గిచ్చీనాయమ్మా

పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలూ
అచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనోయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

8 comments:

నాకు చాలా ఇష్టమైన పాట వేణూ. పాట మొత్తం ప్రతీ వాక్యం లోనూ తపన తన్మయత్వం అక్షర అక్షరానికీ కనిపిస్తూనే ఉంటాయి.
నేను కొమ్మకోమ్మకో సన్నాయి చదివాను గానీ ఇది అసలు గుర్తు లేదు. పంచుకున్నందుకు చాలా థాంక్స్ మీకూ, ఫణీంద్ర గారికి కూడా.

ఈ పాట తెలీదండి. సాహిత్యం చాలా బావుంది.Thanks for sharing.

వేటూరి వారి మాటలు మరోసారి చదివానండీ.Thanks for sharing.

పద్మవల్లి గారు, తృష్ణ గారు, శిశిర గారు ధన్యవాదాలండీ.

ఎంతబాగుందో పాట.....thanks for sharing.

ఈ పాట ఎన్ని సార్లు విన్నా బాగుంటుంది బోర్ కొట్టదు . బాగుందండి మీ వలన ఈ పాట గురించిన వివరాలన్నీ చదివాను.

చాలా మంచి పాట. థాంక్స్ వేణు గారు.

పద్మార్పిత గారు, రాధిక గారు, జ్యోతిర్మయి గారు ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.