ఇళయరాజా గారి ఇటీవలి హిట్ “ఎటో వెళ్ళిపోయింది మనసు” ఆడియోలో పాటలు కూడా బాగానే ఉన్నాఅందులో ఎక్కువగా ఈతరానికి తగినట్లుగా ఆర్కెస్ట్రేషన్ తో పాటలు కంపోజ్ చేయాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. కానీ ఈ “గుండెల్లో గోదారి” పాటలలో సినిమా కూడా 1985 లో కావడంతో అప్పట్లో తను ఇచ్చిన సంగీతం ఎలా ఉండేదో అలాగే కంపోజ్ చేశారు. నాకు ఈ పాటలు వినేకొద్దీ మరింతగా నచ్చేస్తున్నాయి. నాస్టాల్జిక్ ఎఫెక్ట్ ప్రధమ కారణం అంతగా నచ్చేయడానికి.
ఉదాహరణకి ఈ గుండెల్లో గోదారీ పాటనే తీస్కోండి ప్రారంభంలో ఒక బేస్ రిథమ్ ని తీస్కుని పాటంతా అక్కడక్కడ కొద్ది వేరియేషన్ తప్ప అదే రిధం కంటిన్యూ చేస్తారు. అది పాటకి ఒక కంటిన్యుటినీ ఇచ్చి పాటంతా కూడా మనసుకు అలా హత్తుకు పోయేలా చేస్తుంది. ఇతర సంగీత దర్శకులు చేసినాకూడా ఎక్కువగా ఇళయరాజా గారి పాటలలోనే ఇలాంటి బేస్ రిధమ్ బాగా అకట్టుకునేలా ఉంటుంది.
జాలరుల పాటల్లో వచ్చే పదాల ఆధారంగా కలిపిన హైలెస్సో.. తయ్యారె తయ్యారె లాంటి ప్రయోగాలతో వచ్చే బిట్స్ పాటకి మరింత అందాన్నిచ్చాయి. చంద్రబోస్ గారు కాస్త మనసుపెట్టి రాసినట్లున్నారు ఈ పాట సాహిత్యం. గురువులు నేర్పని పాఠాలను అలలే నేర్పిస్తాయి అంటూ భాగ్యాలను వెదికే వలలు గురించి రాయడమే కాక పడుచు జాలరులు అడుగడుగున ఎదురయ్యే సుడులకు ఎదురు నిలిచి ఎలా పోరాడతారో కళ్ళకు కట్టేసారు.
సాగ(హ)సాలు, నన్న(న్ను)నడుపుతుంది లాటి పదాలు అక్కడక్కడ అడ్డంపడినా ఇళయరాజా గారి స్వరం వైవిధ్యమైన నేపధ్యానికి చక్కగా అమరి మరింత అందాన్నించ్చింది. ఈ చక్కని పాట ఒకనిముషం వీడియో ప్రోమో క్రింది వీడియోలో చూడండి పూర్తిపాట ఆడియో రాగా లో ఇక్కడ వినవచ్చు.

చిత్రం : గుండెల్లొగోదారి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఇళయరాజా
ఏ.హే...తయ్యారె తయ్యారె తయ్య తయ్యారె తయ్యారె తయ్యా
హొయ్యా హొయ్యా.. హొయ్య హొయ్యా.. హొయ్యా హొయ్యా.. హొయ్య హొయ్యా..
హేఏ.. హేహే.. హేహే.. హేహే.. హే...
గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే..
వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే..
ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో
ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో
ఆ గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
అడుగడుగు అలజడులు సుడులు తిరుగు ఒడిలో..
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో..
అడుగడుగు అలజడులు సుడులు తిరుగు ఒడిలో..
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో..
తరగలుగ పెరిగెను తెగువే పడుచు వరవడిలో..
నురగలుగ కరిగెను దిగులే ఉరుకు ఉరవడిలో..
పౌరుషం పడవలా సాగువేళలో సాహసాలలో..
గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
హొయ్యారే..హొయ్యర హొయ్యా.. హొయ్యర హొయ్యారే..
ఒయ్యారే..ఒయ్యర ఒయ్యా.. ఒయ్యర ఒయ్యారే..
హొయ్యారే..హొయ్యర హొయ్యా.. హొయ్యర హొయ్యారే..
ఒయ్యారే..ఒయ్యర ఒయ్యా.. ఒయ్యర ఒయ్యారే..
ఏసెయ్యి ఏసెయ్యి ఏసెయ్యి ఏసెయ్యి
వంజరం వాలుగా వంజరం వాలుగా
బురదకొయ్య మట్టగిడస ఇలస సందువ
బురదకొయ్య మట్టగిడస ఇలస సందువ
పట్టెయ్యి పట్టెయ్యి చేపనే వడుపుగా..
ఏ తందాన తందాన తందనా తాననా
ఏటిలోన సాగిపోని బతుకే ఏటగా..
తందాన తందాన తందనా తాననా
ఎదురెవరూ అదుపెవరూ ఎగుడు దిగుడు కథలో
పులసలా ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో
ఎదురెవరూ అదుపెవరూ ఎగుడు దిగుడు కథలో
పులసలా ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో
గలగలల గీతం నాదే గెలుపు రాగంలో..
జలజలల సైన్యం నాదే చిలిపి రాజ్యంలో..
రాజునే నేనుగా నీటి కోటలో గాలి వాటులో..

హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో
ఆ గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ.

7 comments:
నాకూ బాగా నచ్చిందీపాట. రాజా వాయిస్ నాకూ చాలా ఇష్టం కానీ తెలుగు పాటలు పాడేటపుడు తమిళయాస రాకుండా జాగ్రత్త తీసుకుంటే బాగుండేది ;(
రిలీస్ అయ్యిన వెంటనే ఈ పాటలు వింటే జస్ట్ ఓకె అనుకున్నాను. వినగా, వినగా బాగున్నాయి వేణు గారు.
థాంక్స్ రాజ్. నిజమే వైవిధ్యంగా బాగుంటుంది కానీ యాస ఒకోసారి ఇబ్బంది పెడుతుంటుంది.
థాంక్స్ జలతారు వెన్నెల గారు. అవునండీ నాకు కూడా వినగా వినగా బాగా నచ్చాయి.
నాకీ సినిమా పాటలు దాదాపుగా అన్నీ నచ్చాయి. కానీ, 'ఎటో వెళ్ళిపోయింది మనసు' లో 'లాయి లాయి' పాటకి అమరినంత అందంగా ఇళయరాజా గొంతు ఈ పాటకి నప్పలేదనిపించింది ఎందుకో.. :-/
థాంక్స్ మధురా.. కరెక్ట్ గా చెప్పారు ఇళయరాజా గారి గొంతు మెలోడీ ట్యూన్స్ కి సూట్ అయినంతగా ఇతర ట్యూన్స్ కి నప్పదు అది ఒక కారణమైతే పానకంలో పుడకల్లా అడ్డంపడే తమిళయాస మరో కారణం అయి ఉండచ్చు :-)
నాకు ఈ సినిమాలో టైటిల్ సాంగ్ మంచిగా అన్పిచింది..కాని మీరు అన్నట్లు మన తెలుగు వారికి కొచెం ఇబ్బందిగానే ఉంటుంది...మొత్తం మీద మీరు రివ్యూ ఇచ్చిన యాస మాత్రం బావుంది.....
థాంక్స్ కార్తీక్ గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.