కొన్ని పాటలు వినడం తప్ప మనమేమీ వ్యాఖ్యానించలేము. ఇది అలాంటి పాటే ఆడియో ఇక్కడ వినండి.
చిత్రం: లవకుశ (1963)
సంగీతం: ఘంటసాల
రచన: సముద్రాల (జూనియర్)
గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
రచన: సముద్రాల (జూనియర్)
గానం: ఘంటసాల
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ.. సీతమ్మా..
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ.. సీతమ్మా..
సందేహించకుమమ్మా
ఒకే బాణము ఒకటే మాట.. ఒక్క భామకే రాముని ప్రేమ..
ఒకే బాణము ఒకటే మాట.. ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ...
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా..
సందేహించకుమమ్మా...
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు...
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను.. సీతమ్మా...
8 comments:
నిజ్జంగా వేణు...మీ పోస్ట్ చూసి..ఈ పాటకి ఏం విశ్లేషణ రాస్తారబ్బా...అసలు ఎలా విశ్లేషించగలం!! అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఏం రాసుంటారబ్బా అని చూసేసరికి....టింగురంగా మని "వినడం తప్ప మనమేమీ వ్యాఖ్యానించలేము" అని దెబ్బ కొట్టేసారు :))
నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి.
నాకూ ఇష్టం పాట వేణు జీ , థాంక్స్ వేణు గారు గుర్తు చేసినందుకు !
థాంక్స్ సౌమ్యా :-) హహహ నేనూ రాయాలని ప్రయత్నిస్తే ఏం రాయాలో తెలియలేదు.. ఏం రాసినా తక్కువే అనిపించింది, అందుకే అలా చెప్పాననమాట :)
థాంక్స్ శ్రావ్యా, నాకూ బాగా ఇష్టమైన పాట.
great song!
సీనియర్ సముద్రాల రచన, అద్భుతంగా హిందోళంలో స్వరపరిచి ఇంకా అద్భుతంగా పాడిన ఘంటసాల పాట. ఒక్క పాటలో, నాలుగు వాక్యాలలో వాల్మీకికి రాముని వ్యక్తిత్వం మీద నమ్మకాన్ని తెలియచెప్పే రసవత్తరమైన ఘట్టం.
చాలా థాంక్స్..వేణు గారు.. ఇంత మంచి పాటను..కాదు కాదు అమృత గీతాన్ని గుర్తు చేసినందుకు..... చాలా బాగా రాసారు..
తృష్ణ గారు, అజ్ఞాత గారు, కార్తీక గారు ధన్యవాదాలండి.
అవును దివాకర్ గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.