మొన్న శుక్రవారం విడుదలైన గుండెల్లో గోదారి సినిమా పాటలు ఎపుడో నాలుగునెలల క్రితమే విడుదలైనా నాకు వినే అవకాశం దొరకలేదు. ఈ మధ్యనే వినడం మొదలు పెట్టిన ఈ పాటలు వింటున్నపుడు కొన్నిటిలో సినిమా సెటప్ కి తగినట్లుగా ఎనభైలలో ఇళయరాజా పాటలు విన్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాట నాకు విన్నవెంటనే బాగా నచ్చేసింది. అనంత శ్రీరాం సాహిత్యం అందించిన ఈ పాటను భవతారిణి చాలా చక్కగా పాడింది. చిత్రీకరణ మంచు లక్ష్మి సందీప్ లపై తీసినట్లున్నారు. అటాచ్ చేసిన వీడియోలో పాటలోని కొంత భాగం చూడవచ్చు. పూర్తిపాట ఆడియో రాగాలో ఇక్కడ వినండి.
చిత్రం : గుండెల్లో గోదారి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : భవతారిణి
నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఎమౌతావో నాకు నువ్వు, ఎమౌతానని నీకైనా నేను?
అందించావు ఈ కొలువు, నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను.
నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఆ వరిపైరు పరుపెయ్యాలా గాలులు జోల పాడాల
ఆ హరివిల్లు మన ఉయ్యాలా నిన్నే నేనూ ఊపాలా
ఈ చెమ్మచెక్క చూసి వేగుచుక్కలే ఆ నింగి నుంచి దూకీ..
నా కళ్ళగంతలేసి కంటిలోపలా నీ నవ్వుల్నే చూపాలా
ఊహలు ఎన్నో నాకున్నా
మరిచేనే నన్నేనేను నీ ఊసే వింటే.. నీ ఊసే వింటే..
నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఎమవుతావో నాకు నువ్వు, ఎమౌతానని నీకైనా నేను?
అందించావు ఈ కొలువు, నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను.
నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
మారిన ప్రాయం కోరినవన్నీ దొరికే తీరం నువ్వేరా
ఏమిటి న్యాయం నేనొక్కదాన్నే ఆశల భారం మోయ్యాలా
నీ వెచ్చనైన సాయం ఇచ్చి చూడమందీ వెన్నెల్లో గోదారి..
ఆ వంద ఏళ్ళ నెయ్యం పుచ్చుకోమందీ గుండెలోన దూరి.
ఆయువు ఉన్నా లేకున్నా..
క్షణమైనా చాలంటాను నీతోడై ఉంటే .. నీతోడై ఉంటే..
నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఎమవుతావో నాకు నువ్వు, ఎమౌతానని నీకైనా నేను?
అందించావు ఈ కొలువు, నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను.
నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
2 comments:
మా ఇంట్లో అందరం వినీ వినీ అరగ్గోట్టేసాం ..ఈ పాట నాకు చాలా ఇష్టం.ఇళయరాజా పాటలుకదా...మా సాయి కి ఈ పాటలు చాలా ఇష్టం .తమిళం పాట కూడా పాడేస్తాడు.
థాంక్స్ రాధిక గారు హహహ అంతేనండీ ఇళయరాజా పాట కదా :) ఈ మధ్య బొత్తిగా డిజప్పాయింట్ చేస్తున్నారని కొత్తవి వినడానికి కొంచెం భయపడుతున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.