శుక్రవారం, ఫిబ్రవరి 15, 2013

ఈ బ్లాగ్ పేరు మార్పు.

ఫ్రెండ్స్,

రేపటినుండి ఈ బ్లాగ్ పేరు మార్చాలని నిర్ణయించుకున్నాను. 

ఇప్పటి వరకూ "సరిగమల గలగలలు" అనే పేరున్న ఈ బ్లాగ్ ను రేపటినుండి "పాటతో నేను" అని మార్చబోతున్నాను కనుక ఇకపై అగ్రిగేటర్స్ లోనూ గూగుల్ లోను ఇతర లింక్స్ లోనూ ఈ బ్లాగ్ ఇదే పేరుతో కనిపిస్తుంది. ఐతే బ్లాగ్ అడ్రస్ (URL) మార్చకుండా పాతదే (sarigamalagalagalalu.blogspot.com) ఉంచడం వలన ఈ బ్లాగ్ కు లింక్ చేసి ఉన్న, బుక్ మార్క్ చేసుకున్న మిత్రులు ఏ విధమైన మార్పూ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం రేపటి నుండి మీ లింక్ లిస్ట్ లో "పాటతో నేను" అన్న పేరు కనిపిస్తే అది ఒకప్పటి 'సరిగమల గలగలలు' బ్లాగే అన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. 

ఇపుడీ పేరు మార్పిడికి పెద్దకారణాలు ఏవీ లేవు నా మెయిన్ బ్లాగ్ "నాతో నేను నాగురించి" కి అనుబంధంగా ఈ "పాటతో నేను" అన్న పేరు ఈ పాటల బ్లాగ్ లక్షణానికి దగ్గరగా మరింత బాగుంటుందని మారుస్తున్నాను అంతే. ఈ పేరు నేనీ బ్లాగ్ క్రియేట్ చేసినపుడు తట్టనందుకు నన్ను నేను తిట్టుకున్నా ఇప్పటికైనా ఈ ఐడియా వచ్చినందుకు మెచ్చుకుని ఇలా బ్లాగ్ టైటిల్ మారుస్తున్నాననమాట. కనుక గుర్తుంచుకోండి మిత్రులు రేపటినుండి "పాటతో నేను" అనే బ్లాగ్ కనిపిస్తే అది మీరు గత నాలుగేళ్ళగా ఆదరిస్తున్న 'సరిగమల గలగలలు' బ్లాగ్ మాత్రమే తప్ప కొత్తది కాదు :-)

6 comments:

అయ్యో...ఈ పేరు తట్టనందుకు తిట్టుకోవడమేమిటండీ? మీ గలగలలు అన్న పేరే సంగీత ప్రపంచంలోకి తీసుకుపోతుంది. సరే, నాతో నేను -పాటతో నేను ఇంకా బాగా కలిసింది కనుక, కొత్త పేరుతో మొదలయ్యే ప్రయాణానికి మళ్ళీ అభినందనలు. కొత్త కొత్త విషయాలన్నీ రాస్తూండండి.

సరిగమల గలగలలు అనే పేరు నాకు భలే నచ్చుతుంది వేణూ! సుశీల పాడిన పాట ఈ బ్లాగ్ చూస్తూనే మనసులోకి పరిగెత్తుకొస్తుంది.
కొత్త పేరు కూడా బాగానే ఉంది కానీ...............
సరే, పాట తో మీ అనుబంధాన్ని వివరించే కాన్సెప్ట్ తో మారుస్తున్నారు కాబట్టి....కానివ్వండి.

(బ్రాకెట్లో పాత పేరు ఉంచేయకూడదూ..ఏవిటో నా పిచ్చి)

థాంక్స్ సుజాత గారు, నేనూ ఆపాటలో నుండే తీసి పెట్టుకున్నానండీ.. బ్రాకెట్లో పెడితే మరీ లెంత్ ఎక్కువవుతుందేమో అని ఆలోచిస్తున్నా :-) మీరు డిజప్పాయింట్ అవకుండా ఓ చిట్కా ఆలోచించే ఉంచాలెండి :)

కొత్త పేరు బావుందండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.