సోమవారం, జూన్ 04, 2012

ఏ దివిలో విరిసిన పారిజాతమో

గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు మేలు తలపులు తెలుపుకుంటూ, తను పాడిన పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట మీ అందరికోసం. ఆడియో ఇక్కడ వినండి. ఇదే పాట బాలుగారికి కూడా ఇష్టమని ఎక్కడో చదివిన గుర్తు కానీ ఎక్కువసార్లు ఇంటర్వూలలో అడిగితే మాత్రం ఇలా ఏదో ఒక పాట నాకు ఇష్టమైనదని చెప్పలేననే అంటూంటారు.చిత్రం : కన్నెవయసు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : బాలు

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..

|| ఏ దివిలో ||

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

|| ఏ దివిలో ||

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

|| ఏ దివిలో ||

11 comments:

బాలుగారి పాటల్లో ఇష్టమైన ఒక్క పాట అని ఎంచుకోవడం మనకే కష్టమైన పని, ఇక ఆయన అలా ఎలా ఎంచుకోగలరు?
కన్యాకుమారి మూవీలోని "ఇది తొలి పాట..ఒక చెలి పాట" పాట విన్నారా వేణు గారు? ఆ పాట నా "టాప్ సాంగ్స్ ఆఫ్ బాలు" లిస్టులో తప్పకుండా ఉంటుంది.

Mahek గారు ధన్యవాదాలు.. మీరు చెప్పినది కూడా నిజమేనండీ అన్ని వేల పాటలలో ఒకదాన్ని ఎలా ఎన్నుకోగలం.. "ఇది తొలిపాట" తెలుసండీ నాకు కూడా చాలా ఇష్టమైన పాట అది. మొన్నే మరోసారి విని త్వరలో పోస్ట్ చేయాలని కూడా అనుకున్నాను.

బాలు పాడిన ఓ చక్కగా సంగీతం సమకూరిన దర్శకుడు సత్యం పాట. ఇది కాపి/పిలూ రాగం అని ఎక్కడో చూశాను.
ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ, పిలచిన బిగువటరా(మల్లీశ్వరి), రమతే యమునా, మురిపించే అందాలే అవినన్నే చెందాలే(బొబ్బ్లియుద్ధం) ఈ రాగమే అట!

వావ్! నాకెంతో ఇష్టమయిన పాట. చాలా బాగుంటుంది ఇది. మంచి పాటను పంచుకున్నారు.

Thanks for the info SNKR ji.. hmmm నాకు రాగాల గురించి ఏమి తెలియదండీ..
ధన్యవాదాలు రసజ్ఞ గారు.

అసలు సిసలు బాలు క్లాసిక అంటే ఇదే కదా!
కానీ నాకు 'ఏ దివిలో..' కన్నా Mahek గారు చెప్పిన 'ఇది తొలిపాటా..' నే చాలా చాలా... బోల్డంత చాలా ఇష్టం, వేణూ :))

అవును నిషీ.. అసలు సిసలు బాలు క్లాసిక్.. హహహహ దీనికన్నా "ఇదితొలిపాటా" అన్నపాటే ఇష్టమనమాట.. అదికూడా మరో మంచి పాట గుర్తొచ్చే వరకేకదా :-) థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.

ఈ బ్లాగును ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాను? ఏదేమైనా, వేణు గారు చాలా థాంక్స్ అండి.

సిరిమల్లె నీవె విరిజల్లు కావే.. పాట నాకిష్టం మరి

థాంక్స్ ఫర్ ద కామెంట్ కామేష్ గారు :-) బాలు గారి పాటల్లొ ఇదీ అని ఎన్నుకోవడం చాలా కష్టమైన పనేనండీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.