సుశీలమ్మ స్వరంలోని స్పష్టత నాకు చాలా ఇష్టం, స్పష్టత అనేదానికి సంగీతపరంగా మరో టెక్నికల్ పదముందో లేదో నాకు తెలియదు కానీ తను పాడిన చాలా పాతపాటలలో తనగళం సరైన పిచ్ లో చాలా క్లియర్ గా వినిపిస్తుంటుంది. అలాంటి పాటలలో రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ “స్వరములు ఏడైనా” పాట నేను తరచుగా వినే సుశీలమ్మ పాటలలో ఒకటి. సినారె గారు సాహిత్యమందించిన ఈ పాటలోని చివరి చరణం నాకు చాలా ఇష్టం. ఈ పాట వీడియో దొరకలేదు చిమట మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు. అది ఓపెన్ అవలేదంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం: తూర్పుపడమర (1976)
గానం: పి.సుశీల
సాహిత్యం: సినారె (సి.నారాయణరెడ్డి)
సంగీతం: రమేష్ నాయుడు
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
జననములోనా కలదు వేదనా
మరణములోనూ కలదు వేదనా
జననములోనా కలదు వేదనా..
మరణములోనూ కలదు వేదనా
ఆ వేదన లోనా ఉదయించే
నవ వేదాలెన్నో నాదాలెన్నెన్నో నాదాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో..
స్వరములు ఏడైనా రాగాలెన్నో
నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికీ మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ...ఆఅ.ఆఆఆఆఅ..
కాలమనే గాలానికి చిక్కీ
తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో..
స్వరములు ఏడైనా రాగాలెన్నో
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే
కలల వెలుగులో కన్నీరొలికే
కలతల నీడలు ఎన్నెన్నో..ఎన్నెన్నో..
2 comments:
సంగీత దినోత్సవం రోజునే ఈ పాట 'స్వరములు ఏడైనా రాగాలెన్నో పెట్టడం' సందర్భోచితంగా వుంది వేణు గారు!
గానకోకిల సుశీలమ్మ గారి గొంతులో ఈపాట మరింత మాధుర్యాన్ని ఇస్తోంది!
సాహిత్యం, సంగీతం, గానం అన్నీ మధురం...
మీకు అభినందనలు...
@శ్రీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.