శుక్రవారం, జూన్ 15, 2012

మోహనరాగం పాడే కోయిల

భారత రన్నింగ్ సంచలనం అశ్విని నాచప్ప తెలుగులో నటించిన తొలిచిత్రం 'అశ్విని' అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా తన జీవిత కథ ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించారు. సినిమా అందరూ చూసినా లేకపోయినా అందులోని అద్భుతమైన కీరవాణి సంగీతం మాత్రం మర్చిపోలేము. “సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టిరాయిరా.. ఆనకట్ట కట్టు లేని ఏటికైనా చరిత్రలేదురా”, “చెయ్ జగము మరిచి జీవితమే సాధనా.. నీ మదిని తరచి చూడడమే శోధన” ఈ రెండు పాటలు మాంచి Inspiring గా ఉండి చాలామంది జిం ప్లేలిస్ట్ లో ఇప్పటికే చోటు సంపాదించుకుని ఉంటాయి, వాటి గురించి మరో పోస్ట్ లో చెప్పుకుందాం. అయితే వాటి మరుగున పడి కొంచెం తక్కువ ప్రాచుర్యాన్ని పొందిన ఒక మంచి మెలోడీ ఈ “మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో” పాట. నాకు సీజనల్ గా కొన్ని పాటలు వినడం అలవాటు. అంటే నేను ఎన్నుకుని కాదు గుర్తొచ్చిన పాటలు కొన్ని రోజులు రిపీట్ చేయడమనమాట. అలా నా ప్లేలిస్ట్ లో ఒక నాలుగురోజులనుండి రిపీట్ అవుతున్న ఈ పాట మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఇందులో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్లుండే ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం. ఈ పాట సాహిత్యం ఎవరు రాశారో తెలియదు మీకు తెలిస్తే చెప్పగలరు. వీడియో దొరకలేదు ఆడియో ఉన్న యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను. అదిపనిచేయకపోతే ఆడియో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : అశ్విని 1991
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : ??
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి కొండల్లో
అరవిచ్చినా
సుమలేఖలు చూశా
మనసెందుకో
మధువేళలలో
మారాకులే తొడిగే.ఏ.ఏ.ఏ

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి కొండల్లో

దివిలో తారనీ ఒడిలోనే చేరనీ
నదిలో పొంగునీ కడలి ఎదలో చేరనీ
సూటిపోటీ సూదంటి మాటల్తోటీ
నీతో ఎన్నాళ్ళింకా సరే సరిలే
అన్నావిన్నా కోపాలే నీకొస్తున్నా
మళ్ళీ ఆమాటంటా అదే విధిలే
సయ్యాటలెందుకులే.ఏ.ఏ.ఏ...

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి కొండల్లో

మనసే నీదనీ చిలిపి వయసే అన్నదీ
వనిలో ఆమని వలచి వచ్చే భామిని
ఆకాశంలో ఉయ్యాలే ఊగేస్తుంటే
నీలో అందాయెన్నో హిమగిరులూ
జాబిల్లల్లే వెన్నెల్లో ముంచేస్తుంటే
నీలో చూశానెన్నో శరత్కళలూ
ఆమాటలెందుకులే.ఏ.ఏ.ఏ

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి చుక్కల్లో
అరవిచ్చినా
సుమలేఖలు చూశా
మనసెందుకో
మధువేళలలో
మారాకులే తొడిగే.ఏ.ఏ.ఏ

4 comments:

Yes, many people don't know about this song, but it is one of my favorite numbers. Very melodious song ! I couldn't find even the full movie any where online to watch this song.

Siddharth

ధన్యవాదాలు సిద్దార్థ్ గారు. అవునండీ సినిమా కోసం నేను కూడా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు.

Another song "Mogalipuvve monika" in Keechurallu composed by Ilayaraja, also got very less attention by music lovers. Lyrics are not impressive but the tune is melodious.

Siddharth

అవును సిద్దార్ద్ గారు. ఆ పాట ట్యూన్ బాగుంటుంది కానీ సాహిత్యం ఆకట్టుకోదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.