బుధవారం, డిసెంబర్ 30, 2009

ఒకటే జననం.. ఒకటే మరణం..

చాలా రోజులుగా రాద్దాం అనుకుంటున్న ఈ టపా అనుకోకుండా ఈ పాట ఈ వారం ఈనాడు ఆదివారం సంచిక లో రచయిత సుద్దాల అశోక్ తేజగారి వ్యాఖ్యానంతో కనిపించే సరికి వెంటనే ప్రచురించేస్తున్నాను. ఈ సినిమా శ్రీహరి సినిమాల్లో నాకు నచ్చిన వాటిలో ఒకటి, కాస్త లాజిక్కులను పక్కన పెట్టి చూస్తే కంట్రోల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది ఒక సారి ఛూసి ఆనందించవచ్చు. ఇది నచ్చడానికి మరో కారణం సింధుమీనన్ కూడా లేండి. తన మొదటి తెలుగు సినిమా అనుకుంటాను మోడర్న్ డ్రస్సుల్లో కాకుండా మన పక్కింటి అమ్మాయిలా సాదాసీదాగా చూడచక్కగా ఉండి ఇట్టే ఆకట్టుకుంటుంది. పాటకచేరి శీర్షిక నిర్వహిస్తున్న ఈనాడు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పత్రిక క్లిప్పింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.


సాహిత్యానికి సంగీతమో సంగీతానికి సాహిత్యమో తెలియదు కానీ ఈ పాటలో రెండూ ఒకదానికి ఒకటి అన్నట్లు ఒదిగి పోతాయి. పల్లవిలో ఉన్న ఫోర్స్ చరణాలలో కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది కానీ మొత్తం పాట విన్నపుడు ఒకే రకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. పల్లవి ఎత్తుగడ మాత్రం అద్భుతం సాహిత్యం పరంగా కానీ సంగీత పరంగా కానీ. నేను వాకింగ్ చేసేప్పుడు వినే ప్లేలిస్ట్ లో ఈ పాట మొదట ఉండేది (అంటే వాకింగ్ చేసింది కొద్దిరోజులైనా ఇలాటి అర్భాటలకు తక్కువ చేసే వాడ్ని కాదులెండి:-) నిజం చెప్పద్దూ, ఇదీ, ముత్తులో ఒకడే ఒక్కడు మొనగాడు, తమ్ముడు లో look at my face లాంటి పాటలు వింటూ జిమ్ కెళ్తే వచ్చే ఆ ఉత్సాహం  ఆనందం మాటల్లో చెప్పలేం అంటే నమ్మండి. సరే మరి మీరు విని ఉండక పోతే ఒకసారి వినేయండి.


చిత్రం : భద్రాచలం
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్ర నీకొద్దు నీకేది హద్దు

||ఒకటే||

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో గేయం ఊదాలి

||ఒకటే||

నిదరోకా నిలుచుంటా.. వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా.. కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె ..గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో.. ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా ...

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లుఔతుంది...

||ఒకటే||

ఈ నూతన సంవత్సరం ఈ పాటలా మీలో ఉత్తేజాన్ని నమ్మకాన్ని నింపి మీకందరికీ అన్ని శుభాలను చేకూర్చాలని, మీరు కోరుకున్న రీతిలో జీవిస్తూ సుఖసంతోషాలను మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అందరికీ 2010 నూతనసంవత్సర శుభాకాంక్షలు, కాస్త ముందుగా :-)

9 comments:

పాట వినడానికే కాదండీ, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది.. సినిమా చూసే ధైర్యం చేయలేదు కానీ టీవీలో ఈ పాట చాలా సార్లు చూశాను.. నిజంగానే సింధు మీనన్ చాలా బాగుంది.. 'చందమామ' లో చేసింది ఈ అమ్మాయే అంటే మొదట నమ్మ బుద్ధి కాలేదు నాకు!! ఇప్పుడు గుర్తు రావడం లేదు కానీ 'పల్లెటూరు' అంటూ మరో పాట ఉంటుంది ఈ సినిమాలో.. అది కూడా చాలా బాగుంటుంది.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మురళి గారు నెనర్లు. నిజమే వీడియో కూడా బాగానే ఉంటుంది ఇందాక హడావిడిగా దొరికిన వీడియో పెట్టేశాను ఇపుడు టపా అసలైన వీడియోతో సరిచేశాను. రిలేటెడ్ వీడియోస్ లో మీరు చెప్పిన ఇదే సినిమాలోని ’ఇదే నా పల్లెటూరు’ వీడియో కూడా ఉంది చూడండి.

బాగుంది :)
నూతన సంవత్సర శుభాకంక్షలు..
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html

పాట స్క్రిప్టు కి ధన్యవాదములు.
నూతన సంవత్సర శుభాకంక్షలు..

Monkey2man గారు నెనర్లు.

శ్రీనిక గారు నెనర్లు..

వేణు,నాకు ఈ పాట ఒక్కాదానికీ ఆ సినిమా చూసిన సమయానికి విలువ దొరికింది అనుకున్నాను. పాట, చిత్రీకరణ అంతా బాగా ఉత్తేజాన్ని ఇస్తాయి కదా? పాడినతీరు కూడా ఇమిడిపోయినట్లుగా..

ఉష గారు నెనర్లు. మీరు చెప్పింది అక్షర సత్యం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.