అతిథులకు నమస్కారం. ఓ ఏడాది క్రితం నా ఙ్ఞాపకాలు పదిల పరచుకోవాలని మొదలు పెట్టిన నా బ్లాగ్ లో నా ఙ్ఞాపకాల కంటే పాటల గురించే ఎక్కువ టపాలు ప్రచురించాను. నాకు పాటలంటే అంత ఇష్టం. కానీ నేను ఏవిధమైన సంగీతం నేర్చుకోలేదు కేవలం శ్రోతని మాత్రమే.. అప్పుడప్పుడూ శ్రుతి, రాగం, తాళం లాటి వాటి తో పని లేకుండా పాటలు పాడుకుంటుంటాను. కాలేజి రోజులలో నా సౌండ్ బాగుందని ఒకటి రెండు సార్లు స్టేజ్ పై కూడా పాడనిచ్చారు లేండి అది వేరే విషయం. సరే ఇంత పాటల పిచ్చి ఉన్న నేను పాటల ప్రధానంగా ఒక బ్లాగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని చాలా రోజులగా ఆలోచించీ..చించీ..చించగా ఇప్పటికి దానికి ఒక కార్య రూపం ఇవ్వగలిగాను. తత్ఫలితమే ఈ బ్లాగు.
నా మరో బ్లాగ్ లో ఇప్పటి వరకూ పోస్ట్ చేసిన పాటలన్నీ ఇక్కడికి కాపీ చేశాను. వాటిని కాస్త సరిచేసి ఇండెక్సింగ్ చేయాలన్న ఆలోచనని ఎప్పటికి ఆచరణ లో పెడాతాను అనే విషయం ఇప్పుడే అడగకండి. ఇక ఈ బ్లాగ్ నుండి ఏమి ఆశించవచ్చు అంటారా? ముఖ్య విభాగాలు చూసిన వారు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చి ఉంటారు. ముఖ్యంగా నాకు ఎనభైల లో వచ్చిన తెలుగు పాటలు ఇష్టం, ఇంకా విశ్వనాధ్ గారి పాటలు, వాటితో పాటు బాలమురళీ కృష్ణ గారి శాస్త్రీయ సంగీతమూ విని ఆనందిస్తాను. అలాగే మూడ్ ని పట్టి కొన్ని మాంచి మాస్ మసాలా పాటలూ, అదే చెవితో మైఖేల్ జాక్సన్ లాటి ఆంగ్ల సంగీత కారుల పాటలూ వింటాను (ఇవి చాలా సెలక్టివ్ అనుకోండి).
సో నే వినే పాట లలోనుండి వీలుని పట్టి నాకు నచ్చిన పాటలూ, ఆ పాట వినగానే నా మనసులో కదిలే ఙ్ఞాపకాలు, ఆపాట నాకు అందించే అనుభూతులు అన్నీ మీతో పంచుకుంటాను. ప్రతిపాటకూ సాహిత్యం తప్పని సరిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఇంకా లభ్యతని పట్టి ఆడియో / వీడియో లింకు లు, పాటకి సంబందించిన ఇతర వివరాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓ విధంగా ఇది నా అన్లైన్ సినిమా పాటల పుస్తకం అని చెప్పచ్చనమాట, సరే మరి అలా అలా నా పాటల ప్రపంచం లో విహారించండి ఇక, ప్రస్తుతానికి శలవు.
అమ్మా అమ్మమ్మగారిల్లు...
-
ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you
who can't read Telugu but can understand. You can listen to this post in my
voi...
5 వారాల క్రితం
3 comments:
మీ ఆన్లైన్ పాటలపుస్తకం చాలా బాగుంది.
ఓహ్... అయితే బోలెడు మంచి మంచి పాటల్ని వినొచ్చనమాట.
Thanks గీతిక గారు, తప్పకుండా మంచి పాటలను పరిచయంచేయడానికి ప్రయత్నిస్తాను.
venugaru..okka sari veelaite- backstreet boys, colonial cousins, suno lucky ali vintara..endukante nenu cheyyaleni pani meeru chestunnaruga..avi na patala thotaloni konni gulabeelu..hope u like them..vini me kalam palikinche bhavalu telusukovalani chinni kutuhalam..ante..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.