క్రియేటివ్ కృష్ణవంశీ దర్శకత్వం లో వస్తున్న శ్రీకాంత్ వందవ చిత్రం "మహాత్మ" లో సిరివెన్నెల గారు రచించిన ఈ రెండు పాటలూ, విన్న వెంటనే బాగున్నాయి అనిపించి బ్లాగ్ లో పెట్టేయాలనిపించింది. ఈ లిరక్స్ ని మా ఆర్కుట్ కమ్యునిటీ లో కష్టపడి టైప్ చేసి ముందే పోస్ట్ చేసిన ఫణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వల్ప మార్పులతో ఇక్కడ మీ కోసం. "ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ" పాట లో "సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి" లాటి పంక్తులు రాయడం సిరివెన్నెలగారికే చెల్లింది. పాట వినాలంటే సీడీ కొనడం సక్రమమైన పద్దతి :-) కానీ ఇది ఇప్పటికే ఆన్లైన్ లో దొరుకుతుంది కనుక లింక్ ఇస్తున్నాను. ఒక సారి విని, మిగిలిన పాటలు కూడా నచ్చితే సీడీ కొనండి. నేను ఈ రెండు తప్ప వేరేవి ఇంకా వినలేదు.
మహాత్మ చిత్రం లోని పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. "తల యెత్తి జీవించు" పాట మొదటి నుండి నాలుగవది, మహాత్ముని పై రాసిన "ఇందిరమ్మ ఇంటిపేరు" పాట మొదటిది.
చిత్రం: మహాత్మా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: బాలసుబ్రహ్మణ్యం
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ
తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినాననీ
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ
తల వంచి కైమోడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కని పెంచినాదని
కనుక తులలేని జన్మమ్ము నాదని
త్రైలింగ ధామం...త్రిలోకాభిరామం
అనన్యం...అగణ్యం...ఏదో పూర్వపుణ్యం
త్రిసంధ్యాభివంద్యం....అహో జన్మ ధన్యం
||తల ఎత్తి||
శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి
||తల ఎత్తి||
తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ములతపః సంపత్తి నీ వారసత్వం
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం
||తల ఎత్తి||
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
చిత్రం: మహాత్మా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: బాలసుబ్రహ్మణ్యం
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తెరో నాం
సబ్ కో సన్మతి దే భగవాన్
ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
||ఇందిరమ్మ||
కరెన్సీ నోటు మీద
ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ
||ఇందిరమ్మ||
రామనామమే తలపంతా
ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష., స్వతంత్ర కాంక్ష
ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత
ధర్మయోగమే జన్మంతా
ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసినోటి తాతా
మన లాగే ఒక తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గ జ్యోతి
నవ శకానికే నాంది
||రఘుపతి|| ||రఘుపతి||
గుప్పెడు ఉప్పును పోగేసి
నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా
ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
చఱఖా యంత్రం చూపించి
స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను బంధించాడురా జాతి పితా సంకల్ప బలం చేత
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి
హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడు ఇల తలంపై నడయాడిన ఈనాటి సంగతీ
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి
సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని అంతః కలహాలనీ
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం
హే రాం !!
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: బాలసుబ్రహ్మణ్యం
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ
తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినాననీ
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ
తల వంచి కైమోడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కని పెంచినాదని
కనుక తులలేని జన్మమ్ము నాదని
త్రైలింగ ధామం...త్రిలోకాభిరామం
అనన్యం...అగణ్యం...ఏదో పూర్వపుణ్యం
త్రిసంధ్యాభివంద్యం....అహో జన్మ ధన్యం
||తల ఎత్తి||
శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి
||తల ఎత్తి||
తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ములతపః సంపత్తి నీ వారసత్వం
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం
||తల ఎత్తి||
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
చిత్రం: మహాత్మా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: బాలసుబ్రహ్మణ్యం
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తెరో నాం
సబ్ కో సన్మతి దే భగవాన్
ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
||ఇందిరమ్మ||
కరెన్సీ నోటు మీద
ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ
||ఇందిరమ్మ||
రామనామమే తలపంతా
ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష., స్వతంత్ర కాంక్ష
ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత
ధర్మయోగమే జన్మంతా
ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసినోటి తాతా
మన లాగే ఒక తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గ జ్యోతి
నవ శకానికే నాంది
||రఘుపతి|| ||రఘుపతి||
గుప్పెడు ఉప్పును పోగేసి
నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా
ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
చఱఖా యంత్రం చూపించి
స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను బంధించాడురా జాతి పితా సంకల్ప బలం చేత
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి
హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడు ఇల తలంపై నడయాడిన ఈనాటి సంగతీ
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి
సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని అంతః కలహాలనీ
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం
హే రాం !!
8 comments:
EXCELLENT,i already heard the 1st song on sirivennela site with a different lyric
తల ఎత్తి జీవించు తమ్ముడా ...
ఈ పాట వింటునంతసేపు నాకు NTR తెలుగు దేశం ప్రచారానికీ రాయించుకున్న చెయ్యేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ...
నే గుర్తు వచ్చింది, ట్యూన్ కొంచం దగ్గర పోలిక వలన కాబోలు
చఱఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను బంధించాడురా
జాతి పితా సంకల్ప బలం చేత
ఈ మాటలు ఒక్క శాస్త్రి గారే రాయగలరు
"నేను శాస్త్రి గారు, గాంధీ గారి మీద చిత్రం అంటే ఇంకా ఘాటుగా రాస్తారు అని ఉహించాను"
ఈ రెండు పాటలు బాలు నే పాడాలని కృష్ణ వంశి / శాస్త్రి గారు పట్టుపట్టి వుంటారు,
మిగిలిన పాటలలో "ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది" అనే పాట ఒక్కటి విన్నోచు మిగిలినవి అన్ని తమిళ్ వాసన :)
'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని', 'సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని' గీతాల్లో ఉన్న పట్టు, పదాల పొందిక వీటిలో కనపడలేదు. సినిమాలో సందర్భానికి అంతకన్నా అక్కర్లేదేమో మరి.
నేనింకా ఈ పాటలు వినలేదు. విన్నాక అభిప్రాయం మారొచ్చు. ఒక్కోసారి సంగీతమూ సాహిత్యానికి మెరుగులద్దుతుంది కదా.
ఇపూడేవిన్నాను వేణు గారు మంచి సాహిత్యం.సిరివెన్నెల గారి గురించి ప్రత్యేకం గా చెప్పెదేముంది ..థేంక్స్ మంచి పాటలు అందించినందుకు .
ఎందుకో ఆ లింక్స్ పనిచేయలేదండి. సాహిత్యం వరకు "తల యెత్తి జీవించు" బాగుంది. కాస్త తీరిగ్గా మళ్ళీ ప్రయత్నించి వింటాను. సిరివెన్నెల గారి ఈ తరహా పాటలంటే "గాయం" లో నిగ్గదీసి అడుగు మాత్రం గుర్తుకువచ్చేతీరుతుండి.
అజ్ఞాత గారు Thanks for the comment.
రమేష్ గారు నెనర్లు, మీరు చెప్పింది నిజం బాలూనే పాడాలని అడిగి ఉంటారు. గాంధీ గారి మీద ఇంకా పదును గా రాసి ఉండేవారేమో కాని సినిమా లో ఎంతవరకు అవసరమో కూడా చూడాలి కదా.
అబ్రకదబ్ర గారు నెనర్లు. నిజమే గాయం లో ఉన్న ఫోర్స్ ఈ పాటల లో లేదు సంధర్బానుసారంగా అవసరం ఉండి ఉండదు.
నేస్తం గారు నెనర్లు.
ఉష గారు నెనర్లు. ఒకోసారి కొన్ని browsers లో ఈ లింక్ పనిచేయదండీ.. వేరే దానిలో ఈ లింక్ కాపీ పేస్ట్ చేసి ప్రయత్నించండి http://www.ragalahari.com/newreleasesdetail.asp?newmvname=Mahatma
Thanks Srujan.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.