ఈ పాట గురించి ఏమని చెప్పను. ఘంటసాల గారి గాత్రం తో మనసు ను మెలి పెట్టే పాట. ఆత్మీయులను కోల్పోయినపుడు గుర్తొచ్చి మరింత భాధ పెట్టే పాట. ఆపద్బాన్ధవుడు లో అడిగినట్లు "ఆ దేవుడి కి తను చేసుకున్న బొమ్మ ల పై తనకు హక్కు లేదా" అని అడుగుతున్నారా ?, మరి అలా తన ఇష్టమొచ్చినట్లు ఆడు కుందామని అనుకున్నపుడు ఆ బొమ్మల మధ్య అనుభంధాలు, మమతానురాగాలు ఎందుకు సృష్టించాలి ? ఏంటో ఈ దేవుడు !! అందుకే ఒకటి మాత్రం నిజం... తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!
ఈ పాట ఇక్కడ చిమట మ్యూజిక్ లో వినండి
చిత్రం: దేవత (1965)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల
బ్రతుకంత బాధ గా... కలలోని గాధ గా...
కన్నీటి ధారగా.... కరగి పోయే...
తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!
బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా.. ||2||
గారడి చేసీ.. గుండెలు కోసీ.. నవ్వేవు ఈ వింత చాలికా...
|| బొమ్మను ||
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
దీపాలు నీవే వెలిగించినావే.. ఘాఢాంధకారాన విడిచేవులే..
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ...
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ.. పాతాళ లోకాన తోసేవులే..
|| బొమ్మను ||
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
అనురాగ మధువు అందించి నీవు.. హలా హల జ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించు వేళా..
ఆనందనౌకా పయనించు వేళా.. శోకాల సంద్రాన ముంచేవులే !!
|| బొమ్మను ||
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల
బ్రతుకంత బాధ గా... కలలోని గాధ గా...
కన్నీటి ధారగా.... కరగి పోయే...
తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!
బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా.. ||2||
గారడి చేసీ.. గుండెలు కోసీ.. నవ్వేవు ఈ వింత చాలికా...
|| బొమ్మను ||
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
దీపాలు నీవే వెలిగించినావే.. ఘాఢాంధకారాన విడిచేవులే..
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ...
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ.. పాతాళ లోకాన తోసేవులే..
|| బొమ్మను ||
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
అనురాగ మధువు అందించి నీవు.. హలా హల జ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించు వేళా..
ఆనందనౌకా పయనించు వేళా.. శోకాల సంద్రాన ముంచేవులే !!
|| బొమ్మను ||
10 comments:
చాలా మంచి పాట. నాకు నచ్చిన పాటల్లొ ఒకటి. మరల గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. ఒక చిన్న సవరణ - "ఘాఢాంధకారాన కాదు. గాఢాంధకారాన". నాకు గుర్తున్నంతవరుకు ఈ పాట రాసింది శ్రీ శ్రీ మరియు వీటూరి. ఒకరు పల్లవి, ఇంకొకరు చరణాలు రాసేరనుకుంటా. ఎవరికైనా మరిన్ని వివరాలు తెలిస్తే దయచేసి చెప్పండి.
అద్భుతమైన పాట. రామారావు, సావిత్రి సినిమా కదా?
Loss...
So sudden
ఆనందనౌకా పయనించు వేళా.. శోకాల సంద్రాన ముంచేవులే !!
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మొహత్వం
నిర్మొహత్వే నిస్చలతత్త్వం
నిస్చలతత్త్వే జీవన్ముక్తీః
అంటారుకాని ఏదైనా చెప్పడం సులువు. అనుభవంలో చాలా కష్టం
మంచి పాటను గుర్తు చేసారు.
అద్భుతమైన పాట గుర్తు చేసారు.thanks!
చాలా మంచి పాట ..ఈ పాట ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదని రాత్రి పగలు నిద్రపోకుండా నటించారట రామారావు గారు..అదీ నీళ్ళు నెత్తిమీద పోసుకుని చలిలో ..
చాలా జీవితం ఇదే పాట గుర్తొచ్చేలా గడిచిపోయింది. ఆపైవాడి screen play అర్థం కాక నా పాత్ర లో నటించేసాను. నిడివి తెలియదు కానీ ఇపుడు మాత్రం "గాల్లో తేలినట్లుందే.." అని పాడిస్తున్నాడు మరి :) వేణూ గారు ఇంత మంచి మంచి గీతాలు గుర్తు తెస్తూ జప్తు పరచుకున్న జ్ఞప్తులనొకసారి దర్శించే అవకాశం కల్పిస్తున్నారు. కృతజ్ఞతలు.
KK గారు నెనర్లు. నాకెందుకో ఘంటసాల గాత్రం లో అది ఘాడాంధకారమనే అనిపిస్తుందండీ.. ఇంకో రెండు మూడు చోట్ల వెతికి కరెక్ట్ చేస్తాను.
అబ్రకదబ్ర గారు నెనర్లు. అవునండీ NTR సావిత్రి గారి సినిమానే పేరు "దేవత".
నేను గారు కరెక్ట్ గా చెప్పారు.
చైతన్య గారు, పరిమళం గారు నెనర్లు.
నేస్తం నెనర్లు. ప్రొడ్యూసర్ గురించి కాదనుకుంటా అండీ పాట లో తిండి లేక తిరుగుతూ బాధ తో కళ్ళు పీక్కు పోయి ఉన్న ఎఫెక్ట్ కోసం రామారావు గారు అలా నటించారు అంటారు.
ఉష గారు నెనర్లు. కొన్ని సార్లు జీవితం అలా మన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటుందండీ.. ఏదేమైనా ఇప్పటి మీ "గాల్లో తేలినట్లుందే.." పాట జీవితాంతం ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
విన్నకొద్దీ జీవిత సత్యాన్ని కళ్ళముందు ఆవిష్కరింప చేసే పాట, బాధతో గుండె బరువెక్కి పోవటం నిజం
Thanks for the comment లక్ష్మి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.