ఆదివారం, జనవరి 11, 2009

ముత్యాల పల్లకి (1976)

నా చిన్నతనం లో నేను చాలా సార్లు విన్న పాటలు ఇవి రెండూ.. అప్పట్లో పెళ్ళికి వెళ్తే "సన్నా జాజి కి..." పాట తప్పని సరిగా వినిపించే వారు. కొన్ని రోజులు గా ఎందుకో ఈ పాటలు గుర్తొస్తున్నాయి. మీరూ ఓ సారి విని గుర్తు చేసుకుని ఆనందించండి. మల్లెమాల గారు రాసిన సాహిత్యం సరళంగా అందం గా ఉంటుంది. తెల్లవారక ముందే పాట, రెండవ చఱణం లో పల్లెల గురించి ఎంత బాగా చెప్పారు అనిపించక మానదు. ఈ సంక్రాంతి సమయం లో పల్లెలు మరింత గుర్తొచ్చి మనసు భారమౌతుంది కదా !!


తెల్ల వారక ముందే.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..

||తెల్లా వారక ముందే||

వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..

||తెల్లా వారక ముందే||

పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..

||తెల్లా వారక ముందే||


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*


సన్న జాజికి గున్న మావికి.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ.. ||సన్నజాజికి||
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. ||గున్నా మావికి||
హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా

||సన్నాజాజికి||

కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాధవీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..

11 comments:

avunandi తెల్ల వారక ముందే.. paata chaala baguntundi...especially meeru cheppinattu 2nd charanam chaala baguntndi.........

ఇక్కడ చెప్పడం బావుండకపోయినా, ఙ్ఞాపకాలు ఆగనివ్వడం లేదు. ఈ పాటలు చిన్నప్పుడు ఎన్ని సార్లు, చిత్రసీమ లో విన్నానో లెక్కలేదు. ఇంజినీరింగు చదివేప్పుడు మాత్రం, అప్పట్లో మా సీనియర్లు ఈ పాటలకు బూతు అర్థం వచ్చేట్లుగా మార్పు చేసి, మాతో పాడించే వాళ్ళు. ఆ రెండు అనుభూతులు మళ్ళీ రేపారు.

సుబ్బు, రవి, నేస్తం వ్యాఖ్యానించినందుకు నెనర్లు...

పండుగ భోజనం తిన్నంత తృప్తిగావుందండీ ఈ పాటలు వింటుంటే, వేణూ గారు! మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

చక్కని వ్యాఖ్యకు నెనర్లు ఊష గారు, మీకు కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

సన్న జాజికి గున్న మావికి..ఈ పాట అంటే చాల ఇష్టం నాకు .. మా పెళ్ళి వీడియో కేసెట్ లో ఉంది :) .. చాలా మంచి పాట గురించి రాసారు..

చాలా మంచి పాటలండి.కాలానికి ఎదురీది నిలబడ్డాయి కూడాను.కానీ సినిమా చీదెయ్యటంతో చూడటం తక్కువ,వినటం ఎక్కువ ఈపాటలను.మనలోమనమాట ఆ సినిమా చూళ్ళేము కూడా :).
సినిమా చీదేసిందన్నాము కదా అలా కొన్నాళ్లయ్యాక కన్నడంలో రాకాసినాగు అని ఒకసినిమా వచ్చింది(ఇది తెలుగు డబ్బింగు వెర్షన్ పేరు)కన్నడప్రభాకర్ అని విలన్ పాత్రలవీ వేస్తుండేవారు,ఇప్పుడు లేరు ఆయనమీద చిత్రీకరించారు.
వెలుగు దుత్తలేసుకుని అని అనుకుంటానండి

నెనర్లు నేస్తం, పెళ్ళి నాటి ఙ్ఞాపకాలను కదిలించిందనమాట నా టపా. మరి మళ్ళీ ఓ సారి చూసుకున్నారా వీడియో..

రాజేంద్ర గారు నెనర్లు. సినిమా గురించి నాకు అసలు తెలీదండి, Thanks for the information.

హ హ నాకు కూడా అనుమానం వచ్చింది ఇది కరెక్టేనా అని కానీ రెండవ సారి వినడానికి బద్దకించి పైగా ఏవో పిచ్చి లాజిక్కుతో నాకు నేనే సర్ది చెప్పుకుని అలానే వదిలేశాను. అది వెలుగు దుత్త కూడా కాదండీ, వెలుగు దుస్తులు. టపా లో సరి చేశాను. Thanks for pointing that out, మీరు చెప్పక పోతే అలానే వదిలేసే వాడిని.

చాలా చక్కటి పాటలు. కళ్ళు మూసుకొని అలా తీయగా పల్లెలని ఊహించుకొంటూ, ఆ ఊహల్లో తేలియాడుతూ వినాలనిపించే పాటలివి.

నెనర్లు రమణి గారు. అవును చాలా ఆహ్లాదంగా ఉంటాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.