ఆదివారం, జులై 13, 2008

పరువమా..చిలిపి పరుగు తీయకూ..

ఒకో రోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రోజంతా ఒకే పాట పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. Haunting or something అంటారే అలా అనమాట. మీకూ అలా ఎప్పుడైనా అనిపించిందా....మీరు గమనించి ఉండరేమో కాని ఖచ్చితం గా మీరూ ఫేస్ చేసి ఉంటారు. ఏదో ఒక పాట ఉదయాన్నే రేడియో లో విన్నదో ఎవరన్నా ఇంట్లో వాళ్ళు హమ్ చేసిందో అలా సడన్ గా మనల్ని అంటుకుని రోజంతా అదే పాట గుర్తొస్తుంటుంది. నాకు ఈ రోజు నిద్ర లేవగానే ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది రోజు మొత్తం మీద ఒక 10-15 సార్లు హమ్ చేసి ఉంటాను ఇక లాభం లేదు అని బ్లాగ్ లో పెట్టేస్తున్నా.

చిన్నపుడు అప్పుడప్పుడూ ఉదయం పూట రేడియో లో విజయవాడ కేంద్రం వివిధ భారతి కార్యక్రమం లో వేసే వాడీ పాట. చాలా సార్లు విన్నట్లు గుర్తు. మొదటి సారి ఈ పాట విన్నపుడు ప్రారంభం ఆంగ్లం లో ఉండటం తో ఏదో పిచ్చి పాట లే అనుకున్నాను...తర్వాత నవ్వులు విని ఖచ్చితం గా చెత్త పాటే అని నిర్ధారించేసుకున్నాను. ఆ తర్వాత ఇళయరాజా గారు మెల్లగా పాట లోకి తీసుకు వెళ్తారు...జాగింగ్ చేసే అడుగుల చప్పుడు తో అద్భుతం గా ట్యున్ చేసి పాట అయిపోయే సరికి శభాష్..!! అనిపించేసుకుంటారు. ఈ పాట వీడియో దొరకలేదు కానీ ఎవరో నాలాంటి అభిమాని పాటని presentation కి జత చేసి you tube లో పెట్టాడు. నేను అదే ఇక్కడ ఇస్తున్నా. ఇది ప్లే అవ్వక పోతే ఇక్కడ వినండి.


చిత్రం : మౌనగీతంసంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలూ, జానకి

Hello !
Hi.
Good morning !
Good morning.
How do you do?
Fine. Thank you.
How about joining me?
Ok, with pleasure.

పరువమా .. చిలిపి పరుగు తీయకూ..
పరువమా .. చిలిపి పరుగు తీయకూ..

పరుగులో .. పంతాలు పోవకూ..
పరుగులో .. పంతాలు పోవకూ..

పరువమా ..
చిలిపి పరుగు తీయకూ..

ఏ ప్రేమ కోసమో .. చూసే చూపులూ..
ఏ కౌగిలింతకో .. చాచే చేతులూ..
తీగలై .. హో .. చిరు పూవులై పూయ..
గాలిలో .. హో .. రాగాలుగా మ్రోగా..

నీ గుండె వేగాలు తాళం వేయా !

పరువమా ..
చిలిపి పరుగు తీయకూ..

ఏ గువ్వ గూటిలో .. స్వర్గం ఉన్నదో..
ఏ చెట్టు నీడలో .. సౌఖ్యం ఉన్నదో..
వెతికితే .. హో .. నీ మనసులో లేదా
దొరికితే .. హా .. జత కలుపుకో రాదా

అందాక అందాన్ని ఆపేదెవరూ !!

పరువమా ..
చిలిపి పరుగు తీయకూ...

13 comments:

వేణూ గారూ, i just love this song! లిరిక్స్ తో సహా పాటని షేర్ చెసుకున్నందుకు థాంక్స్.. నాకు చరణాలు చాలా చాలా ఇష్టం.. Balu & Janaki were just amazing!

నాకు ఈ అలవాటుంది.....ప్రొద్దుటే లెగిసాకా...ఏదైనా..మంచి పాట వింటే ఇక ఆ రోజంతా..అదే పాట పెదవులపై కదలాడుతూ,,,,,ఉంటుంది..

నేనిక రాగా లాంటి మ్యూసిక్ సైట్లకి గుడ్ బాయ్ చెప్పి ఇక్కడికి వచ్చేస్తా!! ఈ పాట చాలా బాగుంది. ఇలా మరిన్ని ఇవ్వగలరని ఆశిస్తూ..
పూర్ణిమ

@నిషిగంధ గారు నెనర్లు..
నిజమేనండీ బాలు, జానకి చాలా బాగా పాడారు, మొదట్లో ట్యూన్ అండ్ వాయిస్ ఎంజాయ్ చేసే వాడ్ని కొంచెం పెద్దయిన తర్వాత చరణాలు చాలా బాగా నచ్చేసాయ్, ఎంతైనా ఆత్రేయ గారు కదా.

@మీనూ నెనర్లు...

@పూర్ణిమా నెనర్లు..
మీరు మరీ ఎక్కువ expectations పెంచుకోకండీ.. నేను మంచి పాటలు ఎలా వింటానో కొన్ని చెత్త పాటలు కూడా అలానే ఎంజాయ్ చేస్తాను.. విచిత్రమైన టేస్ట్ అని నా ఫ్రెండ్స్ కూడా తిడుతుంటారు :-)

పాట చాలా బాగుంది. మౌనగీతం చిత్రం లో తర్వాత పాట కూడా చాలా బాగుంటుంది. " చెలిమిలో వలపు రాగం మనసులో మధురభావం"ట్రె చేయండి.

అవును వాసు గారు అది కూడా చాలా మంచి పాట, ఇక్కడ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

ఏ గువ్వ గూటిలో .. స్వర్గం ఉన్నదో..
ఏ చెట్టు నీడలో .. సౌఖ్యం ఉన్నదో..
వెతికితే .. హో .. నీ మనసులో లేదా
దొరికితే .. హా .. జత కలుపుకో రాదా
scenery.....అద్దుర్స్

నా ఫేవరేట్ పాట ప్లస్ మూవీ .విని విని గుర్తుచేసుకోగానే ఇతరత్రా ఏ సాధనం లేకుండానే మనసు పాడి వినిపిస్తుంది :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.