గురువారం, జులై 24, 2008

అలలు కలలు ఎగసి ఎగసి...

ఈ రోజు ఉదయం ఆరు దాటి ఒక పది నిముషాలు అయి ఉంటుందేమో నేను ఆఫీసుకు బయల్దేరి బస్ కోసం నడుస్తూ నా IPOD లో యాదృచ్చిక పాటలు (Shuffle songs కి ఇంతకన్నా మంచి పదం దొరకలేదు నా మట్టిబుర్రకి) మీట నొక్కగానే మొదట గా ఈ పాట పలకరించింది. సూర్యోదయమై ఓ అరగంట గడిచినా, ఇంకా సూర్యుడు మబ్బుల చాటు నే ఉండటం తో ఎండ లేకుండ మంచి వెలుతురు. అటు చిర్రెత్తించే వేడి ఇటు వణికించే చలీ కాని ఉదయపు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఈ పాట వింటూ అలా నడుస్తుంటే. ఆహా ఎంత బావుందో మాటల లో చెప్ప లేను. ఈ పాట కి సంభందించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరు నా పొగడకుండా ఉండ లేకపోయాను.

మీకు తెలుసా ఈ పాట ఇళయరాజా గారు పాడారు. ఈ పాట లో స్వరాలు వచ్చేప్పుడు నాకే తెలీకుండా నా వేళ్ళు నాట్యం చేస్తాయి ఇక తకతుం..తకతుం... అని వచ్చేప్పుడైతే తల ఊపకుండా ఉండలేను. ఇంక సాహిత్యం వేటూరి గారు నాలుగు లైన్లు అయినా చక్కగా వ్రాసారు. "నీ జడలో..." పంక్తి ఎన్ని సార్లు విన్నా మళ్ళీ ఓ సారి పెదవులపై ఓ చిన్న మెరుపుని పుట్టిస్తుంది. ఈ రోజంతా ఈ పాటే పాడుకున్నా అని ఈ పాటికి అర్ధం అయి ఉంటుంది కదా అందుకే ఈ పాట ఇక్కడ ఇస్తున్నా.

ప్లేయర్ ఓపెన్ కాకపోతే ఇక్కడ క్లిక్ చేయండి.


<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Seetakokachiluka+Old.html?e">Listen to Seetakokachiluka Old Audio Songs at MusicMazaa.com</a></p>


చిత్రం: సీతాకోకచిలుక
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: వాణీజయరాం, ఇళయరాజా

స గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమపా పపపా గమప గమగసా

నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీసా

అ: అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
ఆ: సాసాస నీనీని పాపాప మామామ గాగాగ సాసాస నీసా
అ: పగలూ రేయీ ఒరిసీ మురిసే సంధ్యారాగంలో
ఆ: సగపా మపపా మగపా మపప పని సని పదనిప మాగా
ఆ: ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో


తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తనన ననన ననన ననన తనన ననన నాన

అ: తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం
ఆ: తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం
అ: తకధుం తకధుం తకధుం తకధుం
ఆ: తకధుం తకధుం తకధుం తకధుం

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ.ఆ.ఆ.ఆ...

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా..
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా..
నా పుత్తడి బొమ్మా ..!

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే !

9 comments:

thanks for a great song srikanth.bloggerski daggara kaavalante kottaga kanipetti raayakkara ledu just ilantivi post chesina saripotundi.Endukante ee paatato nenu mee fan ni kada.Actually ee song naaku chaala istam.

one of my favorites songs
thank you :-)

కొన్ని సార్లు అంతే.. అనుకోకుండా ఇలాంటి పాటలు వస్తూ ఉంటాయి (మన పాటల లిస్ట్ లో నుండి)

ఒక మంచి పాట :)
మీరు పోస్ట్ చేసిన మిగతా పాటాలు కూడా బగున్నాయి
ఋతురాగాలు title song కి special thanks

మంచి పాటని గుర్తుచేసారు ధన్యవాదాలు.

వాణీ జయరాం గారు పాడిన అతి తక్కువ పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఇది. వాణీ జయరాం గారి గొంతు మీద చాల వరకు విమర్శలున్నాయి ఎందుకో. కాని నాకు చాల ప్రత్యేకంగా అనిపిస్తుంది. అలాగే స్వాతి కిరణం లోని తను పాడిన పాటలు కూడా బాగుంటాయి. మంచి పాటను పోస్ట్ చేసారు వేణూ.. థాంక్స్ !

క్రాంతి కుమర్ గారు,
నేను గారు,
మేధ గారు,
ప్రత్యూష గారు,
మురళి గారు,
Venu గారు.

మీ వ్యాఖ్యకు నెనర్లు.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ ప్రసాద్ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.