నిన్నటి జూనియర్ పాట తర్వాత ఈ పాట కూడా బాగా గుర్తొచ్చింది సరే అని పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ప్రభావమో లేకా మిమిక్రీ కి మామూలు గానే అంత క్రేజ్ వుందో తెలీదు కాని, అప్పట్లో మా ఇంట్లో చిన్న టేప్ రికార్డర్ వుండేది దాని లో రక రకాల శబ్దాలు మిమిక్రీ చేయడానికి ప్రయత్నించి రీకార్డ్ చేసే వాడ్ని. చేతి బొటన వేలు, చూపుడు వేలు కి మధ్య వుండే గాడి ని నోటికి perpendicular గా పెట్టుకుని "కూ...చుక్ చుకు" అంటూ వేసే ట్రైన్ కూత, ఇంకా ట్రైన్ రన్నింగ్ సౌండ్ ఒకటి చాలా బాగా వచ్చేది అప్పట్లో. మా చిన్న మామయ్య గారు "నాయనా శుయోధనా" అంటూ శకుని డైలాగులు , ఇంకా వేటగాడు లో రావు గోపాల రావు గారి "గాజు గది గాజు గది అని నువ్వట్టా మోజు పడి..." అనే డైలాగులు భలే చెప్పేవారు.మా నాన్న గారు వింటుండటం తో దాన వీర శూర కర్ణ లో సంభాషణలు, పద్యాలు, ఇంకా సత్య హరిశ్చంద్ర లో పద్యాలు కూడా నాకు బాగా నచ్చేవి. అవి వింటూ వాళ్ళతో పాటు చెప్పుకుంటూ అప్పుడప్పుడూ మా వాయిస్ కూడా రికార్డ్ చేసుకుని వింటూ చాలా సరదాగా గడిపే వాళ్ళం... నాన్న అన్ని రకాలు వినే వాళ్ళు అప్పుడప్పుడూ నాటకాలు వేసిన అనుభవం వుండటం తో అటు పద్యాలు, పాత పాటలు, ఇంకా మాములు మసాలా సినిమా పాటలు, ఇంకా యాదోంకిబారాత్, షోలే, షాన్ లాంటి హిందీ పాటలు కూడా వింటూ వుండే వారు. బహుశా నాకు కోడా అందుకే అన్ని రకాల సంగీతాన్ని ఆస్వాదించ గలగడం అలవాటు అయిందేమో అనిపిస్తుంది ఒకో సారి. అంతులేని కధ
భీష్మ...
-
త్రివిక్రం గారి ప్రియ శిష్యుడు వెంకీ కుడుముల ఇంటిల్లి పాది హాయిగా
నవ్వుకుంటూ చూసొచ్చేలా తీసిన సినిమా భీష్మ. సినిమాలో అక్కడక్కడ మనం
త్రివిక్రమ్ సినిమా చూస...
1 comments:
It's an excellent song. I used to like it, when I was a small boy.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.