ఖంగుమని మోగే భానుమతమ్మ గారి కంచుకంఠంలో ఏపాటైనాసరే ఓ ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇక అదే ఇలా ఆకతాయికుర్రాళ్ళకి బుద్దిచెప్పే పాటంటే ఇహ ఆలోచించనే అక్కరలేదు ఆవిడ గొంతులో “దులపర బుల్లోడో..” అని వినగానే అలాంటి ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగెట్టాల్సిందే :-) తెలుగు సినిమా బ్రాండెడ్ దెయ్యం సాంగ్ “నిను వీడను నేనే” పాట ఉన్న అంతస్థులు సినిమాలోనిదే ఈ పాట కూడా. భానుమతి గారి అభినయం ఆవిడకి వంతపాడే రేలంగి, రమణారెడ్డిలతో కలిసి చూడడానికి కూడా మాంచి సరదాగా ఉంటూంది ఈ పాట. యూట్యూబ్ పనిచేయనివాళ్ళు ఆడియో చిమటా మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : అంతస్థులు
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : కొసరాజు
గానం : భానుమతి
దులపర బుల్లోడో.. హోయ్ హోయ్...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే మలప రాములను పిలక బట్టుకొని
వన్.. టూ.. త్రీ... చెప్పి...
॥దులపర బుల్లోడో॥
సిరిగల చుక్కల చీర కట్టుకొని
జవాది కలిపిన బొట్టు పెట్టుకొని ॥ సిరిగల॥
వరాల బొమ్మ ముద్దులగుమ్మ
కాలేజీకి కదిలిందంటే వెకిలివెకిలిగా
వెర్రివెర్రిగా వెంటపడే రౌడీల పట్టుకొని... పట్టుకొని
తళాంగు త థిగిణ తక తోం తోం అని (2)
॥దులపర బుల్లోడో॥
సాంప్రదాయమగు చక్కని పిల్ల
సాయంకాలం సినిమాకొస్తే..
వస్తే ॥ సాంప్రదాయమగు॥
అదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులో బైఠాయించుకొని.. ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే
శిఖండిగాళ్లను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని (2)
॥దులపర బుల్లోడో॥
రోడ్డు పట్టని కారులున్నవని
మూడంతస్తుల మేడలున్నవని (2)
డబ్బు చూచి ఎటువంటి ఆడది
తప్పకుండా తమ వల్లో పడునని
ఈలలు వేసి సైగలు చేసే
గోల చేయు సోగ్గాళ్ళను బట్టి... పట్టి
వీపుకు బాగా సున్నం పెట్టి (2)
॥దులపర బుల్లోడో॥
మాయమర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్లకు పోతే... పోతే
॥మాయమర్మం॥
జనం ఒత్తిడికి సతమతమౌతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు
దిగు గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా... (2)
॥దులపర బుల్లోడో॥
3 comments:
>>ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగెట్టాల్సిందే :-)
LOL
రెఫ్రెషింగ్ గా చాలారోజుల తర్వాత వింటున్నాను
థాంక్స్ ఫర్ షేరింగ్
మా రూం మేట దుప్పట్లు దులిపేటప్పుడు ఈ సాంగ్ బాక్ గ్రౌండ్ లో పెడితే ఎలా ఉంటుందా అని థింకింగ్ :P
ఖంగుమనే ఆవిడ గొంతే చాలండి కురాళ్ళు పారిపోవటానికీ..:)
సాహిత్యం బావుటుంది.
హహహహ హరే థాంక్స్ :-) సూపరుంటుంది, నేను అపుడపుడు మంచాలు దులిపేప్పుడు బూజులు దులిపేప్పుడూ సరదాగా పాడుకుంటుంటాను :-)
థాంక్స్ తృష్ణ గారు, నిజమేనండి ఆవిడ గొంతే ఛాలు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.