గత వారం రోజులు గా ఎందుకో ఈ రెండు పాటలూ పదే పదే గుర్తొస్తున్నాయి సో టపాయించేస్తే ఓ పనైపోతుంది అని మొదలెట్టాను. అసలు ఈ టపా కి సరైన శీర్షిక ఓ క్లాసిక్... ఓ జానపదం అయి ఉండేదేమో. ముందు క్లాసిక్ గురించి... జంధ్యాల గారి ముద్దమందారం సినిమాలో వేటూరి గారు రాసిన ఈ పాట చాలా బాగుంటుంది. సాహిత్యం గొప్ప గా లేకపోయినా చిన్న చిన్న పదాలలో మంచి భావాలని పలికించారు వేటూరి గారు... రమేష్‌నాయుడు గారి సంగీతం ఆహ్లాదం గా ఉంటే... ఇక బాలు గాత్రం అద్భుతమైన వన్నె తెస్తుంది మనసుకు హాయినిస్తుంది. ఒక సారి విని చూడండి....
చిత్రం : ముద్దమందారం
సాహిత్యం : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : బాలు
నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా
||నీలాలు||
సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే
||నీలాలు||
ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కల పారి పోవాలి లే
ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే..
||నీలాలు||
ఇక రెండో పాట విషయానికి వస్తే, నా చిన్నపుడు మా మావయ్య పాడేవారు ఈ పాటని, తెలంగాణా యాస లో సాగే ఈ పాట ఇప్పటికీ ఎలాంటి మూడ్ లో ఉన్నా నాకు హుషారు తెప్పిస్తుంది... క్లాసు మాసు తేడా ఏంటి లెండి మంచి జానపదాలు వింటే మనకి తెలీకుండానే మన పాదమో లేక చెయ్యో కనీసం చిన్న గా అయినా సరే పాట తో పదం కలుపుతుంది ఆ పాటలు అలాంటివి. ఒక విచారించ వలసిన విషయం ఏంటంటే నాకు ఈ పాట రాసిన లేదా స్వరపరిచిన వ్యక్తుల గురించి ఏమీ తెలియదు కానీ ఈ పాట విన్న ప్రతి సారీ మాత్రం చాలా ఆనందిస్తాను ఒక చిరునవ్వు మోము పై అలవోకగా అలా వచ్చి వెళ్తుంది.

ఎడ్లు బాయె... గొడ్లు బాయె... ఎలమ దొరల మంద బాయే...
గోళ్ళగమ్మ నేను బోతె కందిరీగ కరిసి పాయె...
అరెరెరెరెరె ఆయ్
కోడిబాయె లచ్చమ్మదీ... కోడి పుంజు బాయె లచ్చమ్మదీ... ||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
హోయ్
బండి బాయె బస్సు బాయె రేణిగుంట రైలు బాయె.... ||2||
మళ్ళి దిరిగి చూడ బోతె గాలి మోటరెళ్ళిపాయె... ||2||
అరెరెరెరె
దూడ బాయె లచ్చమ్మదీ... లేగ దూడ బాయె లచ్చమ్మదీ...||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
కొండబాట నస్తుంటే.... కోయిలమ్మ గూస్తుంటే...
కొండబాట నస్తుంటె.... కోయిలమ్మ గూస్తుంటె...
వాగు బాట నస్తుంటే.. వాయిలాల సప్పుడాయె...
మందనంత గెదుముకుంట ఇంటిదారినొస్తుంటే...2
పోతుబాయె లచ్చమ్మదీ.. లేగ పోతుబాయె లచ్చమ్మదీ...||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
లచ్చన్న దారి లోన లంబాడీ ఆటలాయె...హోయ్...
జిగులారి సంత లోన పోతలింగడి గంతులాయె
బంతి పూలు తెంప బోతె తుమ్మెదొచ్చి గరిసి బాయె
గంప బాయె లచ్చమ్మదీ పూల గంప బాయె లచ్చమ్మదీ.. ||2||

7 comments:
కోడిబాయె లచ్చమ్మదీ... కోడి పుంజు బాయె లచ్చమ్మదీ...
ఈపాట నా చిన్నప్పుడు హాస్టల్లో తెగ పాడేవాళ్ళం...మళ్ళీ గుర్తు చేసారు
Thank U
వార్నీ ఏసుకో దరువు...ఓ మైసమ్మో మైసమ్మో మైసమ్మో మైసమ్మా...
మొదటి పాట సాహిత్యం కూడా బాగానే ఉందిగా! ట్యూన్ మాత్రం చాలా హాయిగా ఉంటుంది.
రెండో పాటని మొదటిసారి అందరికీ చాటింపేసినంత గొప్పగా పాడింది జానపద గాయకుడు చలపతి రావు గారు. ఈ కాసెట్లో ఇంకా అమ్మో బయలెల్లినాదే, ఓడెల్లిపోతున్నదీ, మొదలైన పాటలు కూడా ఉన్నాయి.
మధు గారు, శ్రీనివాస్ గారు నెనర్లు
సుజాత గారు నెనర్లు... అయ్యో నేను బాగోదు అనలేదండీ అంత గొప్ప గా ఉండదు అన్నాను అంతే... ఆ మాటకొస్తే రెండో పాటలో సాహిత్యం కోసం వెతక కూడదేమో.
ట్యున్స్ మాత్రం చాలా హాయిగా ఉన్నాయి.
పాటలకు మళ్ళీ ప్రాణం పోసినట్టుంది.చాలా బాగుంది.
నవకవిత గారు , సాహితి చంద్ర గారు ధన్యవాదాలండీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.