శుక్రవారం, అక్టోబర్ 09, 2020

ఆడవే మయూరీ...

చెల్లెలి కాపురం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట నిజానికి ఘంటసాల గారు పాడాల్సిన పాటట. ఆయన ఆరోగ్యం బాగోలేక కనీసం ట్రాక్ పాడిద్దామని బాలు గారికి అవకాశం ఇచ్చారట. పాడడంలో సినారే గారి ప్రోత్సాహం ఎంతో ఉందని బాలు చెప్పిన విశేషాలు పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చెల్లెలి కాపురం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె 
గానం : బాలు

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగామ్ములూగగా
వినీల గజభర.. విలాస బంధుర.. 
తనూలతిక చంచలించిపోగ

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకును గని నా పలుకు విరియ 
నీ నటనను గని నవ కవిత వెలయగ
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

అది యమునా సుందర తీరము 
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల 
అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక
అట సాగెను విరహిణి రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన 
రసమయ మురళీ గీతిక

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నా పలుకులకెనెయగు కులుకు చూపి 
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

ఫాల నేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని కోలు పడి రతీదేవి దుఖిఃతమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల.. 
జలిత దిక్ తటుల.. జహిత దిక్కరుల.. వికృత
ఘీంకృతుల.. సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన.. కనుబొమలలోన.. 
అధరమ్ములోన.. వదనమ్ములోన
కనులలోన.. కనుబొమలలోన.. 
అధరమ్ములోన.. వదనమ్ములోన
గళసీమలోన.. కటిసీమలోన.. 
కరయుగములోన.. పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన.. 
అనంత విధముల అభినయించి 
ఇక ఆడవే.. ఆడవే .. ఆడవే.. 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.