సోమవారం, అక్టోబర్ 19, 2020

జామురాతిరి జాబిలమ్మ...

క్షణం క్షణం సినిమాలోని ఈ పాట నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరేమో కీరవాణి గారి అద్భుతమైన కంపోజిషన్ అలాగే బాలు చిత్ర ఇద్దరూ కూడా అద్భుతంగా పాడిన పాట. కీరవాణి గారి రికార్డింగ్ శైలి, గాయనీ గాయకులను ఎలా ట్రీట్ చేసేవారు నచ్చని వాళ్ళతో ఎలా నడుచుకునే వారు ఇత్యాది వివరాలు. ఇంకా కొందరు మహానుభావుల గురించి బాలు గారి మాటలలో వీడియో తర్వాత వినండి.      

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : క్షణం క్షణం  (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా

కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో

చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా 
ఊఊఊహ్.హ్.హ్. ఆహ
స్వరాల ఊయలూగు వేళ
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.