ఇంద్రధనుస్సు సినిమా కోసం ఆత్రేయ గారు రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. కె.వి.మహదేవన్ గారు స్వరపరచిన ఈ పాట ఆత్రేయ గారికి ఇష్టమైన పాట అట. తను "నాపాట పాడ"మని అడిగి బాలు గారితో పాడించుకుని ప్రతిసారీ అర్థనిమీలిత నేత్రాలతో వినేవారట. ఆత్రేయ గారి భావుకత్వం గురించి బాలు గారి మాటల్లో ఎంబెడెడ్ వీడియోలో పాట తరువాత వినండి.
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)
రచన : ఆత్రేయ
సంగీతం : కె.వి. మహదేవన్
గానం : బాలు
ఆహాఆఆ..అహాహహా...
ఆఆఆ..ఆఆఅ..ఆఆఅ...
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
2 comments:
యెప్పుడు విన్నా ..మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందీ పాట..
అవునండీ.. అద్భుతమైన సంగీత సాహిత్యాలు.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.