మంగళవారం, ఫిబ్రవరి 28, 2017

ఎహే ఎహే ఒహోం ఒహోం...

ఋణానుబంధం చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఋణానుబంధం (1960)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : కొసరాజు
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల
 
ఓఓఓఓఓఓ.ఓఓఓఓ
ఓఓఓఓఓఓ.ఓఓఓఓ
ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ
ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి
ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ
ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి అమ్మీ
అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్
ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ 
అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్
ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ అన్నా..

ఓఓ పొద్దు పొడుపుటెండ అదర కాసే
చద్ది బువ్వ మూట ఎదురు చూసే
ఓఓ ఇసిరి ఇసిరి వారు గాలి వీసే
ఇగిరి ఇగిరి నేల నెర్రెలేసే
తడుపు బాగ పడాలోయ్
తలపులున్ని బాగ పండాలోయ్
ఓరన్నా.. ఓలమ్మీ.. ఔనా..

ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ
ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి అమ్మీ
అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్
ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ అన్నా

ఓఓ కోడి కూతతోనే మేలుకుందాం
కాయా కసరు పైరు చేసుకుందాం
ఓఓ ఒళ్ళు వొంచి పాటు చేసుకుందాం
ఒకరికింద లొంగకుండ ఉందాం
దిగులు మాసి తిరుగుదాం
మగసిరిగా బతుకుదాం

ఓరన్నా.. ఓలమ్మీ.. ఔనా..

ఎహే ఎహే ఒహోం ఒహోం నీళ్ళు తోడాలీ
ఈ మడవలన్ని మార్చి మార్చి మళ్ళు కట్టాలి అమ్మీ
అహాం అహాం ఈడే ఈడే తోడు ఉన్నానోయ్
ఈ బోదెలన్నీ బారూ చేసి మలుపుతున్నానోయ్ అన్నా

సోమవారం, ఫిబ్రవరి 27, 2017

వెన్నెల్లో కనుగీటే...

గురువుని మించిన శిష్యుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

 
చిత్రం : గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
రచన : జి.కృష్ణమూర్తి
గానం : జానకి

ఓఓఓఓఓఓ..ఆఆఆఆఆఆఆఆ..ఓ ఓ ఓ ఓ ఓ
వెన్నెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కదిలించే కోరికా
ఎదలోబాధా..ఆ..ప్రేమే చేదా..ఆ
ఎదలోబాధా..ఆ..ప్రేమే చేదా..ఆ
ఇది తీరే దారే లేదా..ఆఆఆ ఓ ఓఓఓఓ ఓఓ

వెన్నెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కదిలించే కోరికా

మొగ్గవంటి చిన్నదాన్ని..మనసిచ్చానే..ఏఏ 
మొగ్గవంటి చిన్నదాన్ని..మనసిచ్చానే..ఏఏ
సిగ్గుతో నా నోరువిప్పి..చెప్పగలేనే..ఏఏఏఏ
సొగసరి మొనగాడే..గడుసరి వాడే
సొగసరి మొనగాడే..గడుసరి వాడే
గుబులు గుండెల్లో..నింపాడే..ఏఏఏఏఏ ఓఓఓఓఓ ఓయ్

వెన్నెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కదిలించే కోరికా

ఒక్కసారి ఓరకంట..నను చూసాడే..ఏఏఏ
చక్కిలిగింతలు..రేపి మదిదోచాడే..ఏఏఏఏ
చుక్కలరేడేని..చక్కని వాడే
చుక్కలరేడేని..చక్కని వాడే
మక్కువతో చూడ రాడే..ఏఏ..ఓఓఓఓఓ ఓయ్

వెన్నెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కదిలించే కోరికా
ఎదలోబాధా..ప్రేమే చేదా
ఎదలోబాధా...ప్రేమే చేదా
ఇది తీరే దారే లేదా..ఆఆఆ ఓ ఓఓఓఓ ఓఓ

వెన్నెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కదిలించే కోరికా..ఆఆఆఆ


ఆదివారం, ఫిబ్రవరి 26, 2017

విరిసింది వింత హాయి...

బాలనాగమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాలనాగమ్మ (1959)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : ఘంటసాల, జిక్కి

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి

వలపు పూబాల చిలికించేను గారాల
వలపు పూబాల చిలికించేను గారాల
అల చిరుగాలి సొకున మేను తూలె అందుకే

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి

జగతి వినుపించే యువ భావాల గీతాలే
జగతి వినుపించే యువ భావాల గీతాలే
ఇల పులకించె నీ ఎల సోయగాల అందుకే

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

 

శనివారం, ఫిబ్రవరి 25, 2017

ఇదే పాటా ప్రతీ చోటా...

పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

 నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను


శుక్రవారం, ఫిబ్రవరి 24, 2017

హర హర హర శంభో శంభో...


మిత్రులందరకూ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఆ ఈశ్వరున్ని ధ్యానించుకుంటూ ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : ఘంటసాల

హిమగిరి శృంగ విహారీ...
ఉమానాధ శివ గంగా ధారీ..
హర హర హర శంభో శంభో
హర హర హర శంభో శంభో

హిమగిరి శృంగ విహారీ
ఉమానాధ శివ గంగా ధారీ
చంద్ర  చూడ చర్మాంబర ధారీ
ఈశ గిరీశ పురారీ... శంభో 

హర హర హర శంభో శంభో

శివ శివ అక్షయ లింగా
మహాలింగ స్మర గర్వ విభంగా
భక్త శుభంకర కరుణా పాంగా
వృషభ తురంగ శుభాంగా... శంభో 

హర హర హర శంభో శంభో 

గురువారం, ఫిబ్రవరి 23, 2017

అడగాలని ఉంది...

చిన్ననాటి స్నేహితులు చిత్రంలోని ఒక సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిన్ననాటి స్నేహితులు (1971)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది
అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది
అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
అందీ అందకుంటే..అందీ అందకుంటే
ఇంకెంతో అందం చిందేదేది?
చేప...ఉహు..చూపు.. ఆహ..
సిగ్గు...ఉహు..మొగ్గ...ఆహ..
మొగ్గ కాదు.. కన్నెపిల్ల బుగ్గా..

అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది
అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది?
కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది
మళ్ళీ తలచుకుంటే...మళ్ళీ తలచుకుంటే...
మరింత రుచిగా ఉండేదేది?

వెన్నా...ఉహు...జున్ను...ఉహు
తీపి ..ఉహు..ఆ పులుపు ఆహ...
పులుపు కాదూ ...తొలి వలపూ

అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

ఎంతగా చలి వేస్తుంటే...అంతగా మనసయ్యేదేది?
ఎంతగా ... చేరదీస్తే..ఎంతగా ... చేరదీస్తే..
అంతగా మురిపించేదేది?

కుంపటి...మ్మ్ హు..
దుప్పటి..ఆహ..
గొంగళి...మ్మ్ హు..
కంబళి..ఆహ..
కంబళి కాదు...కౌగిలీ
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగాలని ఉంది అది అడగాలని ఉంది

అడగంగానే ఇచ్చేస్తే ...అడగంగానే ఇచ్చేస్తే...
అందులో రుచి ఏముంది... అహా..హ..ఆ హ..

బుధవారం, ఫిబ్రవరి 22, 2017

అందాలు చిందు సీమలో...

రాజనందిని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజనందిని (1958)
సంగీతం : టి.వి.రాజు
రచన : మల్లాది రామకృష్ణ
గానం : ఎ.ఎం. రాజా , జిక్కి

అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా
అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా
అందాలు చిందు సీమలో...
ఆ... ఆ...

చూసిన చూపు నీకోసమే
నన్నేలు రాజు నీవే నీవే
చూసిన చూపు నీకోసమే
నన్నేలు రాజు నీవే నీవే
చిన్నారి బాలుడా... ఆ...

అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా
అందాలు చిందు సీమలో...
ఆ... ఆ...

ఆనంద సీమ ఈ లోకము
ఈ తీరుగానే నీవు నేను
ఆనంద సీమ ఈ లోకము
ఈ తీరుగానే నీవు నేను
ఏలేము హాయిగా... ఆ...

అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా
అందాలు చిందు సీమలో...
ఆ... ఆ...

నిలువెల్ల నిండె ఆనందము
నీ మోము గోము నాదే నాదే
నిలువెల్ల నిండె ఆనందము
నీ మోము గోము నాదే నాదే
ఔనోయి బాలుడా... ఆ...

అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా
అందాలు చిందు సీమలో...

 

మంగళవారం, ఫిబ్రవరి 21, 2017

మనసైన.. ఓ చినదాన..

దత్తపుత్రుడు చిత్రంలోని ఒక హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దత్త పుత్రుడు (1972)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, రమోల

మనసైన.. ఓ చినదాన..
ఒక మాటుంది వింటావా
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా..
కంది చేనుంది పోదామా
ఓహో..
మనసైన.. ఓహ్ చినదాన..
ఒక మాటుంది వింటావా
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా..
కంది చేనుంది పోదామా

ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ..
అహహహహా..
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ..
అహహహహా..

నా గుండెలోన అందమైన గూడు ఉన్నది..
ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది
ఆహ..
నా గుండెలోన అందమైన గూడు ఉన్నది..
ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది
ఆ చోట ఉంటావా..
ఆ..
నా మాట వింటావా..
ఊఁహూఁ..
ఆ చోట ఉంటావా..ఆ..
నా మాట వింటావా..ఆ..ఆ..
నా మాట వింటావా..
బులపాటం తీర్చుకుంటావా

మనసైన.. ఓహ్ చినదాన..
ఒక మాటుంది వింటావా
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా..
కంది చేనుంది పోదామా
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ..
అహహహహా..
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ..
అహహహహా..

మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది..
ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది
మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది..
ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది
ఆ పానుపు అడిగింది..
ఊఁ..
నీ రాణి ఎవరంది..
ఓహో..
ఆ పానుపు అడిగింది.. నీ రాణి ఎవరంది..
మన కోసం చూస్తూ ఉంది..

మనసైన.. ఓహ్ చినదాన..
ఒక మాటుంది వింటావా
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా..
కంది చేనుంది పోదామా
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ..
అహహహహా..
ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ..
అహహహహా..

నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి..
నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి
ఊఁ..
నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి..
నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి
కొంచెం చూడనిస్తావా..
నో..నో..
పోని తాకనిస్తావా..
ఆహ..
కొంచెం చూడనిస్తావా..ఆ..ఆ.. పోని తాకనిస్తావా..
నను నీతో చేర్చుకుంటావా..ఆ..

మనసైన.. ఓహ్ చినదాన..
ఒక మాటుంది వింటావా
ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా..
కంది చేనుంది పోదామా.. 

 

సోమవారం, ఫిబ్రవరి 20, 2017

పరుగులు తీయాలి...

మల్లీశ్వరి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : ఘంటసాల, భానుమతి

ఓ....ఓ...
హేయ్! పరుగులు తీయాలి ఓ
గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్! పరుగులు తీయాలి ఓ
గిత్తలు ఉరకలు వేయాలి

హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
ఓ.....హోరుగాలి కారుమబ్బులు
హోరుగాలి కారుమబ్బులు...
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి

గలగల గలగల కొమ్ముల గజ్జెలు..
ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ....
గలగల గలగల కొమ్ముల గజ్జెలు..
ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ....
వాగులుదాటి.. వంకలు దాటి..
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి

ఆ......ఆ.....ఆ....... అవిగో అవిగో..

నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు..
అవిగో అవిగో.. అవిగో అవిగో

నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు...
అవిగో అవిగో అవిగో

ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో...
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో..
ఆ...ఆ......ఆ....ఆ....... ఆ...ఆ......ఆ....ఆ..
 

ఆదివారం, ఫిబ్రవరి 19, 2017

ఓహో బస్తీ దొరసాని...

అభిమానం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభిమానం (1959)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల (జూనియర్)
గానం : ఘంటసాల, జిక్కి

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ
అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది..
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ
అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...
ఓహో బస్తీ దొరసాని..

ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్! ఆపై కోపం వచ్చింది.. వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ
అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...
ఓహో బస్తీ దొరసాని..

కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది
హాయ్! కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది

హాయ్..ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ
అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...
ఓహో బస్తీ దొరసాని..

పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది..
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది..
హాయ్! పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది...

హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది..చేయి చేయి కలిపింది
అందచందాల వన్నెలాడి ఆడి పాడింది

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ
అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...
ఓహో బస్తీ దొరసాని..ఓహో బస్తీ దొరసాని..
ఓహో బస్తీ దొరసాని


శనివారం, ఫిబ్రవరి 18, 2017

ఇది మల్లెల వేళయనీ...

సుఖ దుఃఖాలు సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సుఖదుఃఖాలు (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..

ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది


కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరిందీ..
ఎరుగని కొయిల ఎగిరింది
చిరిగిన రెక్కల వొరిగిందీ నేలకు వొరిగింది

ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది


మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు 
వాడని వసంతమాసం
వసి వాడని కుసుమ విలాసం

ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది


ద్వారానికి తారా మణిహారం
హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణిహారం
హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో
మొగసాల నిలిచెనీ మందారం

ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది 
 

 

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2017

చినదానా చినదానా...

పిడుగురాముడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి.రాజు
రచన : సినారె
గానం : ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరీ

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

దాటలేదు పదహారేళ్ళు దాచలేవు బెదిరే కళ్ళు
దాటలేదు పదహారేళ్ళు దాచలేవు బెదిరే కళ్ళు
గాలి తాకితేనే..హొయ్ హొయ్.. కందిపోవు నీ ఒళ్ళు
కందిపోవు నీ ఒళ్ళు

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

జడపాయలు వడి వేసేవు జారుపైట సరి చేసేవు
జడపాయలు వడి వేసేవు జారుపైట సరి చేసేవు
లేత నడుము జువు జువ్వనగా లేచి లేచి నడిచేవు
లేచి లేచి నడిచేవు

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

ఉలికి ఉలికి చూడబోకు ఉంటి నేను తోడు నీకు
ఉలికి ఉలికి చూడబోకు ఉంటి నేను తోడు నీకు
ఎదుట నీవు ఉంటే చాలు ఇంక ఎదురు లేదు నాకు
ఇంక ఎదురు లేదు నాకు

చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా
రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా

 

గురువారం, ఫిబ్రవరి 16, 2017

ఎక్కడో చూసినట్టు...

ప్రేమ మందిరం చిత్రంలో ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ మందిరం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల

ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా.. దేవదాసువా..
బాటసారివా.. కాళిదాసువా

ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ...
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా.. శశిరేఖవా..
భద్రకాళివా.. చండీప్రియవా

మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి

ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
కలల రాతిరీ.. కథల రాతిరి.. ప్రేమ కథల రాతిరి
కలత రాతిరీ.. బరువు రాతిరి.. గుండె బరువు రాతిరి

ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ...
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా.. శశిరేఖవా..బాటసారివా..కాళిదాసువా

ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కది మరీ దగ్గరవుతది
మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది

ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది
ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది

మీద పడతదీ.. మోజుపడతదీ.. పెళ్ళి మోజు పడతది
గట్టి పడతదీ.. కట్టమంటది.. తాళి కట్టమంటది

ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా.. దేవదాసువా..
భద్రకాళివా.. చండీప్రియవా

ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ... 

 

బుధవారం, ఫిబ్రవరి 15, 2017

తకధిమి తకధిమితోం...

ధర్మాత్ముడు చిత్రం కోసం ఏసుదాసు గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధర్మాత్ముడు (1983)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : ఏసుదాస్

తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

రూపం చూస్తే దీపమని లోకం తెలియని పాపవని
ఎట్టా నీతో చెప్పేది చెప్పక ఎట్టా దాచేది
ఏమి చిత్రమే ఇదీ చందమామా
ఎంత చోద్యమే ఇదీ చందమామా


తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

చేరే తీరం ఏదైనా పయనించేదీ ఒక పడవ
ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి
బదులు పలకవే నువ్వు చందమామా
పలకలేవులే నువ్వు చందమామా
 
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా 


మంగళవారం, ఫిబ్రవరి 14, 2017

శాంతి ఓం శాంతీ...

ప్రేమికుల రోజు సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ రన్ రాజా రన్ లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రన్ రాజా రన్ (2014)
సంగీతం : జిబ్రన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : క్లింటన్ సెర్జో, మాయా అయ్యర్

వస్తావ వస్తావ నా తోడై వస్తావా
ఇస్తావా ఇస్తావా నీచెయ్యందిస్తావా
నా రెండు కళ్లతొ ఈలోకం చూస్తావా హో..
టెన్షన్సు ప్రాబ్లంసు అన్నీ వదిలొస్తావా
ఆనందం ఆక్సీజన్ ఎంటోరుచి చూస్తావా
ఫ్రీడంతో ఇష్టంగా సల్సాలే చేస్తావా
హో.. ఓహో..

శాంతి ఓం శాంతీ.. ఛోడో కల్కీ బాతే..
లివ్ ఫర్ ద డే.. రైట్ నౌ
శాంతి ఓం శాంతీ.. ఛోడో కల్కీ బాతే..
లివ్ ఫర్ ద డే.. రైట్ నౌ

రేపంటే కంగారై కన్నీరైపోతుందే
ఈజీగా ఈ నిమిషం చెయిజారిపోతుందే
చిరునవ్వే నువ్వైతే భయమే భయ పడుతుందే
హే..లివ్ ఫర్ ద లివ్ ఫర్ ద డే.. ఓఓ.. 
నవ్వైనా కెవ్వైనా నీలోనె పుడుతుందే
ఈలోకం అద్దంలా నిన్నే చూపిస్తోందే
సంతోషం సీక్రెట్ కీ నీచేతుల్లో ఉందే..

శాంతి ఓం శాంతీ.. ఛోడో కల్కీ బాతే..
లివ్ ఫర్ ద డే.. రైట్ నౌ
శాంతి ఓం శాంతీ.. ఛోడో కల్కీ బాతే..
లివ్ ఫర్ ద డే.. రైట్ నౌ

చినుకా ఇన్నాళ్ళెలా ఓఓ.. 
ఎక్కడో ఉన్నావలా ఓఓ..
గెలుపే చూసావుగా నలుపే జారేంతలా
ఎంతగా మారావె ఎంతగా మారావె
ఇంతలో ఇంతలా

శాంతి ఓం శాంతీ.. ఛోడో కల్కీ బాతే..
లివ్ ఫర్ ద డే.. రైట్ నౌ
శాంతి ఓం శాంతీ.. ఛోడో కల్కీ బాతే..
లివ్ ఫర్ ద డే.. రైట్ నౌ


సోమవారం, ఫిబ్రవరి 13, 2017

ఒక్కోసారి ఓ ముద్దు...

కిస్సింగ్ డే సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు అందిస్తూ.. ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిర్మలా కాన్వెంట్ (2016)
సంగీతం : రోషన్ సాలూరి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : శ్రీకాంత్, దామిని 

ఒక్కోసారి ఓ ముద్దు
ఒక్కోచోట ఓ ముద్దు
ఒక్కోలాగా ఓ ముద్దు
సరే ఇవ్వవా ఓఓ.. ఓ ఓ ..
సరే ఇవ్వవా ఓఓ.. ఓ ఓ ..
సరే ఇవ్వనా ఓఓ.. ఓ ఓ ..
సరే ఇవ్వనా ఓఓ.. ఓ ఓ ..

నీలి కంటిపై పెట్టే ముద్దు నీలం
దానర్ధం నా కలల రాణివి నువ్వేనని చెప్పడం..
ఆహా.. ఓ ఓ
ఎర్రపెదవిపై పెట్టె ముద్దు పగడం
దానర్ధం నే ప్రేమించేది నిన్నే అని చెప్పడం..  
అచ్ఛా..
పాల బుగ్గపై ముద్దే మంచి ముత్యం
అన్ని పాలుపంచుకుంటా అని అర్ధం.. ఓ ఓ
కెంపులా మరింది ముద్దు నీ నుదిటిపైనా..
నీ గెలుపునీ నా గెలుపుగా అనుకోమానేలా..

సరే ఇవ్వవా ఓఓ.. ఓ ఓ ..
సరే ఇవ్వనా ఓఓ.. ఓ ఓ ..

లేత చేతిపై పెట్టే ముద్దు వజ్రం
దానర్ధం నీ చేతి నేనుప్పుడు వదలను చెప్పడం.. 
ఊహూ..
చిట్టి నడుముపై పెట్టె ముద్దు పచ్చ
దానర్ధం నీ చిలిపి మనసిక నాదేనని చెప్పడం..
ఔనా..
ముక్కు పక్కన ముద్దే వైఢూర్యం
నా శ్వాస లోనా కలిసిపోమ్మని అర్ధం
ముద్దుకో అర్ధన్నిలా చెబుతుంది ప్రాయం
ప్రతి ముద్దుకో రత్నాన్నిఇలా ఇస్తుంది ప్రాణం

సరే ఇవ్వవా ఓఓ.. ఓ ఓ ..
సరే ఇవ్వనా ఓఓ.. ఓ ఓ ..


ఆదివారం, ఫిబ్రవరి 12, 2017

ఇటు రార ఇటు రార...

హగ్ డే సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలందజేస్తూ ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రారా కృష్ణయ్య  (2014)
సంగీతం : అచ్చు
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : శ్రేయా ఘోషల్, యాజిన్ నిజార్

అటు ఇటు నను అల్లుకుంది
సిరి సిరి హరిచందనాల నవ్వు
నవ్వు
హో
ఎవరని మరి వెతకగ
ఆ నవ్వులన్ని రువ్వుతోంది నువ్వు
నువ్వు
కురిపించావిలా వినలేని వెన్నెలా
నాపైనా
పలికించావురా ప్రాయన్ని వీణలా
చెలి అధరాల మధురాలు
ఆస్వాదించేలా

ఇటు రార ఇటు రార కృష్ణయ్యా
నేనే రాధా
నే న్నీ రాధా
ఇటు రార ఇటు రార కృష్ణయ్యా
అందం గంధం నీది కాదా

మనసిది బయటపడదు
మాట అనదు ఏంటిలా
అలజడి తీరేదెలా
ఓ ఓ
సొగసిది కుదుట పడదు
వలపు మెరుపుతీగలా
నీ ఒడి చేరేదెలా
ఎపుడూ లేదిలా ఎగసిందే ఎద
ఫ్రియ సరసాలకు నోరూరిందా

ఇటు రారా
ఇటు రారా కృష్ణయ్యా
నేనే రాధా
నే న్నీ రాధా
ఇటు రారా ఇటు రారా కృష్ణయ్యా
అందం గంధం నీది కాదా 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.