సోమవారం, డిసెంబర్ 31, 2018

రాధా లోలా గోపాలా...

శారద చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శారద (1973)
సంగీతం : చక్రవర్తి   
సాహిత్యం :  
గానం : సుశీల, జానకి   

రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా
నందకిషోరా నవనీత చోరా
నందకిషోరా నవనీత చోరా
బృందావన సంచారా

రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
ఇన్నాళ్ళు చేశాను ఆరాధనా
ఇన్నాళ్ళు చేశాను ఆరాధనా
దాని ఫలితం నాకీ ఆవేదనా

రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా
నందకిషోరా నవనీత చోరా
నందకిషోరా నవనీత చోరా
బృందావన సంచారా

రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా

మనిషిని చేసి మనసెందుకిచ్చావూ
ఆ మనసుని కోసే మమతలెందుకు పెంచావు
మనిషిని చేసి మనసెందుకిచ్చావూ
ఆ మనసుని కోసే మమతలెందుకు పెంచావు
మనసులు పెనవేసీ మమతలు ముడివేసీ
మగువకు పతిమనసే కోవెలగా చేసీ
ఆ కోవెల తలుపులు మూశావా
ఆ కోవెల తలుపులు మూశావా
నువు హాయిగా కులుకుతూ చూస్తున్నావా

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి

నీ గుడిలో గంటలు మోగాలంటే
నీ మెడలో మాలలు నిలవాలంటే
నీ సన్నిధి దీపం వెలగాలంటే
నే నమ్మిన దైవం నీవే ఐతే

నా గుండెల మంటలు ఆర్పాలీ
నా స్వామి చెంతకు చేర్చాలీ
 
రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా
రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా
రాధా లోలా గోపాలా
గాన విలోలా యదుపాలా
గోపాలా గోపాలా గోపాలా


ఆదివారం, డిసెంబర్ 30, 2018

భామా అలక ఏల...

కన్నయ్య కిట్టయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కన్నయ్య కిట్టయ్య (1993)
సంగీతం : వంశీ 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర  

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా

ఏమీ విరహ గోల ఆగవా
అబ్బ ఏంటీ ప్రణయ లీల ఆపవా
వద్దు చిన్ని కన్న హద్దు దాటకన్నా
నీపై ప్రేమ వెన్న నాలో నిండు సున్న


కృష్ణా నీకు ఇది న్యాయమా
ముద్దు కృష్ణా నీకు ఇది న్యాయమా
సత్యభామను వీడి రుక్మిణి చెలిని వీడి
మాయాలాడిని కూడు మమ్మే మరిచిపోవ
కృష్ణా నీకు ఇది న్యాయమా


ఆపండీ పితలాటకం మీ ఆటా పాటా బూటకం
విశాఖపట్నం కేసనీ తెలిసిందమ్మో ఆల్రెడీ
ఇద్దరు కలిసి పైబడీ చెయ్యొద్దు శీలం దోపిడీ

బుంగమూతిలో దాగె బృందావనం
పెదవుల మాటున దాగె మధురానగరం
ఈ కోమలాంగి కోపమంతా పైపైనే
ఈ శోభనాంగి ఆరాధన నాపైనే

ఆరాధనా ఆలాపనా గోంగూరా
పోజు ఆపరా పొగడబోకురా పోపోరా
నీ విరహ గోలా ఈ మదన జ్వాలా
అంటించకు నాకూ సారీ సారీ ఆపు
ప్రేమించమంటూ పేట్రేగి పోకు
షంటేయకూ నన్నూ సారీ సారీ స్టాపు


ఇంత మాయ చేస్తావా ఓ ప్రాణనాథా
మాకేల నీవలన సంసార బాధా
ద్వారకను వదిలేసి సత్యా రుక్మిణిని
భువికి చేరి కలిసావా ఆ టక్కులాడినీ


అమ్మో బాబో నాకేం తెలీదూ
కుయ్యో మొర్రో ఇది ఏం వెర్రో
ఓ గుమ్మలారా వెంకమ్మలారా
మీ మొగుణ్ణి కానే నేను
నాకింకా పెళ్ళే కాలేదు
వెళ్ళండి తల్లీ వెళ్ళండీ
కోటి దండాలే మీకూ

ముద్దులోన పలికించు మురళీరవం
అమృతం చిలికించు ఆలింగనం
ఈ సుందరాంగి పొందులోని శృంగారం
రతి మదన సామ్రాజ్య పట్టాభిషేకం

నీకోతలూ లాలింపులూ చాలించేయ్
బుజ్జగింపులూ బ్రతిమిలాటలూ మానేసేయ్
నీ చెక్కభజనా ఈ మాయనటనా
నమ్మేందుకు ఇపుడూ ఎవరూ లేరు గురువా
నీ బుట్టలోనా నే పడనులేరా
ఓ చిట్టికన్నా వస్తా ఇకపై శలవా


సుఖపెట్టలేదా నిను ఓ సుందరాంగా
మొహం మొత్తెనా నీకు ఓ మోహనాంగా
పదహారు వేల మంది పసలేని వారమా
ఈ సవితి బాధేల ఓ కోమలాంగా


రంగా లింగా ఒకటే బెంగా
ఏంటీ మాయా యమ ఘోరంగా
లవ్ సెంటిమెంటు ప్లేచేయవద్దు
ఇక చికాకు తెప్పించద్దు
దయచేయండి ఛీపొండి
వచ్చిందపుడే క్లైమాక్స్
తప్పదు మీకు పేథాసు..

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా
 


శనివారం, డిసెంబర్ 29, 2018

కోపాల గోపాలుడే...

అల్లరి పెళ్ళాం చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లరి పెళ్ళాం (1998)
సంగీతం : రమణి భరధ్వాజ్
సాహిత్యం : సాహితీ
గానం : అనురాధా శ్రీరామ్, రమణి భరధ్వాజ్

కోపాల గోపాలుడే నా శ్రీవారు
అలిగారా బాగుంటారు
ఏ కొంచెం ఎడబాటైనా
నను ఆపైనా అమితంగా ప్రేమిస్తారు
తన కోపం శాంతించగా
సఖీ ప్రియా సపర్య చేయనా


షోకైనా భార్యామణీ ఈ దినమూ
చూపించకు అతివినయము
అందితె జుట్టును పట్టుడు
మరి కసిరితే కాలికి మొక్కుడు
బారుగ మూతులు తిప్పుడూ
ఈ భార్యలు ఇంతే ఎప్పుడూ

పొద్దున్నే లేవంగనే పొగలెగజిమ్మే
కాఫీనే అందించనా
పన్నీటి జలకాలతో నిను చల్లంగా
స్నానాలే చేయించనా
మనసెరిగిన ఇల్లాలల్లే
తోడూ నీడై సేవించుకోనా


అమ్మో నీ అల్లర్లతో నా పెళ్ళామా
నా కొంపే గుల్లయ్యిందే
ఇక కాకాలన్నీ ఆపవే
ఏకాకై పోతే మేలులే
జిలిబిలి సొగసుల జాణవే
ఈ చిల్లర తగవులు మానవే

నలభీమ పాకాలనే నేనొండేసి
మురిపెంగా తినిపించనా
ప్రతి ముద్దకు నా ముద్దునే
నే జోడించి యమాగా రుచి పెంచనా
పరువాన్నే తాంబులమై
రేయే హాయై పండించుకోనా


ఆమాటే మన బాటగా సాగించాలి
ముచ్చటగా సంసారమే
ఆలూమగలా బండికి
ఒక చక్రము దీనిలో ఆడది
ఊడితే దెబ్బలే ఒంటికి
నడిచిందా చేరుకొ ఇంటికి 

 

శుక్రవారం, డిసెంబర్ 28, 2018

జయ జయ గోకుల బాలా...

పాండురంగ మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూ
గానం : నాగయ్య

జయ జయ గోకుల బాలా
జయ జయ గోకుల బాలా
మురళీ గాన విలోలా గోపాలా

జయ జయ గోకుల బాలా
మురళీ గాన విలోలా గోపాలా
జయ జయ గోకుల బాలా


నంద యశోదా పుణ్య నిధానా..ఆఅ...
నంద యశోదా పుణ్య నిధానా
సుందర నీల శరీరా ధీరా
సుందర నీల శరీరా ధీరా

జయ జయ గోకుల బాలా
మురళీ గాన విలోలా గోపాలా
జయ జయ గోకుల బాలా


గోపవధూటీ హృదయ విహారీ.. ఈఈఈ...ఈ..
గోపవధూటీ హృదయ విహారీ
తాపస భవ భయ హారీ శౌరీ
తాపస భవ భయ హారి శౌరీ

జయ జయ గోకుల బాలా
మురళీ గాన విలోలా గోపాలా
జయ జయ గోకుల బాలా
మురళీ గాన విలోలా గోపాలా
జయ జయ గోకుల బాలా
ఓఓఓఓ జయ జయ గోకుల బాలా

 

గురువారం, డిసెంబర్ 27, 2018

రాధా గోపాల...

హౌరా బ్రిడ్జ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హౌరా బ్రిడ్జ్ (2018)
సంగీతం : శేఖర్ చంద్ర 
సాహిత్యం : పూర్ణాచారి
గానం : హరిప్రియ

రాధా గోపాల గోకుల బాలా రావేలా
మనసువిని రావేరా
రావేరావే రాధా మాధవ

హౌరా వారధిలా తేలినది మనసే ఈ వేళ
మనవినిను రాధా కృష్ణ
రాధా కృష్ణ మురళీ ముకుంద

హృదయ లయ ఆలకించరా
ఎదురు పడి స్వాగతించరా
కన్నె కలలన్ని వేచాయి
నిన్ను కోరాయి
మూగపోయాను రాక తెలుపర

హృదయ లయ ఆలకించరా
ఎదురు పడి స్వాగతించరా
కన్నె కలలన్ని వేచాయి
నిన్ను కోరాయి
మూగపోయాను రాక తెలుపర

నిన్నే కొరారా కనుల కలలన్నీ నీవేర
తెలుసుకొని ప్రియమారా
దరిచేరావే నీవే నేనుగా
మనసున గీసా రా నీ ప్రతిమ
ప్రధముడు నీవే రా
ప్రతిక్షణము నువ్వే నేనయి
నేనే నువ్వయి పోయాం ఇంతగా

బుధవారం, డిసెంబర్ 26, 2018

గోపాల బాల నిన్నే కోరి...

భలే తమ్ముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలే తమ్ముడు (1969)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సినారె
గానం : మొహమ్మద్ రఫీ, సుశీల

గోపాల బాల నిన్నే కోరి ..నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ..హూ..హూ..హూ..
గోపాల బాల నిన్నే కోరి ..నీ సన్నిధి చేరి
నీ చుట్టే తి రు గు తు ఉంటాను...

నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ....
హే..గీతా..ఆ..ఆ..ఆ నాథా..ఆ..ఆ..

నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ
గారాల బాలా మారాము చేయొద్దు..
బైరాగిని అనుకోవద్దు..నేను.. ఆ నేనే.. ఈ నేనూ

గొపాల బాల నిన్నే కోరి .. నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.

ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న..
పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ..
కృష్ణమ్మా..ఆ...ఆ..ఆ..ఆ

ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న..
పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ

నిన్ను నమ్మిన వాన్ని నట్టేటా ముంచేస్తావో..
మరి గట్టు మీద చేరుస్తావో..
అంతా నీ భారమన్నాను..ఊ..ఊ

గోపాల బాల నిన్నే కోరి .. నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.

సిరులంటే ఆశ లేదు.. వరమేమి అక్కరలేదు
గీతా పారాయణమే.. నా జీవిత లక్ష్యం అన్నాను..
సిరులంటే ఆశ లేదు.. వరమేమి అక్కరలేదు
గీతా పారాయణమే.. నా జీవిత లక్ష్యం అన్నాను..

నా ముద్దు మురిపాలన్నీ తీర్చేదాక..
నీలో నన్నే చేర్చేదాక
నీడల్లే నిన్నంటే వుంటాను

గోపాల బాల నిన్నే కోరి .. నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.
గోపాల బాల నిన్నే కోరి ..నీ సన్నిధి చేరి..ఈ..ఈ
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.
నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
నీ చుట్టే..నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
తిరుగుతు వుంటాను..తిరుగుతు వుంటాను..తి..

మంగళవారం, డిసెంబర్ 25, 2018

నీదే నీదే ప్రశ్న నీదే...

గోపాల గోపాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గోపాల గోపాల (2015)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : సోనూ నిగమ్

బ్రహ్మలా నేనే నిన్ను సృష్టించాననుకోనా
బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా
నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
ఏమి అంటుందో నీ భావన

తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట

నీదే నీదే ప్రశ్న నీదే
నీదే నీదే బదులు నీదే

నీ దేహంలో ప్రాణం లా
వెలిగే కాంతి నా నవ్వే అనీ
నీ గుండెల్లో పలికే నాదం
నా పెదవి పై మురళిదని
తెలుసుకోగలిగే తెలివి నీకుందే
తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే

తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట

నీదే నీదే స్వప్నం నీదే
నీదే నీదే సత్యం నీదే

మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే
మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే
హే ఖుదా హే ఖుదా హే ఖుదా హే ఖుదా
మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే
మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే
మౌలా

ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్ని తిరిగితే
నిన్ను నువ్వు చూడగలవా ఓ రబ్బా
కరుణతో కరిగిన మది మందిరమున
కొలువై నువ్వు లేవా ఓ రబ్బా
అక్కడక్కడక్కడని నీలి నింగి తడిమితే
నిన్ను నువ్వు తాకగలవా ఓ రబ్బా
చెలిమిని పంచగ చాచిన చెయ్యివైతే
దైవం నువ్వు కావా

తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట
తోం తకిట తక తరికిట తరికిట

నీదే నీదే ధర్మం నీదే
నీదే నీదే మర్మం నీదే 

 

సోమవారం, డిసెంబర్ 24, 2018

వేణు గాన లోలుని గన...

రెండు కుటుంబాల కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రెండు కుటుంబాల కథ (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే

చిన్ననాడు గోపెమ్మల చిత్తములలరించి
మన్ను తిన్న ఆ నోటనే మిన్నులన్నీ చూపించి
కాళీయుణి పడగలపై లీలగా నటియించి
సురలు నరులు మురిసిపొవ ధరణినేలు గోపాలుని

వేణుగానలోలుని గన.. వేయి కనులు చాలవులే

అతని పెదవి సోకినంత అమృతము కురిసేను
అతని చేయి తాకినంత బ్రతుకే విరిసేను
సుందర యమునా...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
సుందర యమునా తటిలో సుందర యమునా తటిలో
సుందర యమునా తటిలో బృందావన సీమలలో
కలసి మెలిసి అలసి సొలసి వలపు తెలుపు వేళలో

వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే 


ఆదివారం, డిసెంబర్ 23, 2018

ఒక వేణువు వినిపించెను...

అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : మైలవరపు గోపీ
గానం : జి.ఆనంద్

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
నవమల్లిక చినబోయెనూ..
నవమల్లిక చినబోయెనూ చిరునవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
రేరాణియే నా రాణికీ.. 
రేరాణియే నా రాణికీ పారాణి పూసెనూ

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా
నా గుండెలో వెలిగించెనూ..
నా గుండెలో వెలిగించెనూ సింగార దీపికా

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా

శనివారం, డిసెంబర్ 22, 2018

గోపాల జాగేలరా...

భలే అమ్మాయిలు చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలే అమ్మాయిలు (1957)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : సదాశివబ్రహ్మం
గానం : ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల
 
గోపాల జాగేలరా 
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా 
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా 
దరిజేర చలమేలరా...ఆ...
దరిజేర చలమేలరా 
నన్ను దయజూడ విధియేమిరా 
దరిజేర చలమేలరా 
నన్ను దయజూడ విధియేమిరా
మొర వినవేల కనవేల 
మురళీధర కరుణాకర గిరిధర 

గోపాల జాగేలరా

కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి 
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా 
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలర
మురళీధర కరుణాకర గిరిధర 

గోపాల జాగేలరా

సరిగపద గోపాల జాగేలరా
సదపగరి సరిగపద గోపాల జాగేలరా
పగరిసదా సరిగపద గోపాల జాగేలరా
దాసరి పాదస పా సరిగపద గోపాల
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద గోపాల
సాస దదసాస గపదసాస 
రిగపదసాస సరిగపద గోపాల జాగేలరా
 
రీగ రిగ రీరీ... ఆ...
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని గోపాల జాగేలరా
 
నిస్సనినిసా...ఆ...
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని గోపాల జాగేలరా 

గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా... ఆ...
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ...ఈ...
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ గోపాల  
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద జాగేలరా

రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ...ఆ...రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని గోపాల జాగేలరా

గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా... గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ...
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదవ గపదా...
గరిసదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద
గోపాల జాగేలరా...


శుక్రవారం, డిసెంబర్ 21, 2018

గొపీ లోలా...

లేడీస్ టైలర్ లోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, శైలజ

గొపీలోలా నీ పాల బడ్డామురా
లీలాలోలా అల్లడుతున్నామురా
చన్నీళ్ళలో ఉన్నామురా చిన్నారులం మన్నించరా


భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరీ చేయెత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు అ దిక్కులే దిక్కమ్మలు

గొపీలోలా నీ పాల బడ్డామురా

క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా
మచ్చా మచ్చా మచ్చా మచ్చా
క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా
మచ్చా మచ్చా మచ్చా మచ్చా

జాలిమాలిన ఈ గాలీ
తేరిపారా చూసే వేసే ఈల
మావీ మాటున దాగుంటే
కూత వేసి గువ్వలు నవ్వేగోల


తరుణిరో… కరుణతో మోక్షం చూపె
కిరణమై నిలిచానే
తనువుతో పుట్టె మాయను
తెలుపగా పిలిచానె

మోక్షం కన్నా మానం మిన్నా
మిన్ను మన్ను కన్నులు మూసేన 

  గొపీలోలా నీ పాల బడ్డామురా 
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
 చన్నీళ్ళలో ఉన్నామురా చిన్నారులం మన్నించరా
గొపీలోలా నీ పాల బడ్డామురా

 
వాడిపోనీ సిరులెన్నో పూలు పూచేటి 
కొమ్మా రెమ్మా గుమ్మా
నేను కోరే ఆ తార ఏదీ మీలోన 
భామా భామా భామా
తగదురా... ఇదీ మరీ చోద్యం కాదా సొగసరీ గోవిందా
అందరూ నీవారేగా ఒకరితో ముడి ఉందా

చూసే కలలు ఎన్నో ఉన్నా
చూపే హృదయం ఒకటే ఉందమ్మా

గొపీలోలా నీ పాల బడ్డామురా
లీలాలోలా అల్లడుతున్నామురా
అందాక మీ అందాలకు అ దిక్కులే దిక్కమ్మలు

భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరీ చేయెత్తి మొక్కాలమ్మా 
 

గురువారం, డిసెంబర్ 20, 2018

మధువనిలో రాధికవో...

అల్లరిబావ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లరి బావ (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం


మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..


తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..హేలలో..డోలలో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం
మధువనిలో రాధికనూ..మధువొలికే గీతికనూ


బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..

మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో..
అదియే రాగమో..భావమో..బంధమో..

మధువనిలో రాధికవో..మది పలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం 
 ఆఅహహహా ఆహహహ ఆఆఅహహహాఅ ఆహహహ



బుధవారం, డిసెంబర్ 19, 2018

మనసే కోవెలగా...

మాతృదేవత చిత్రంలోని ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. వీడియో సాంగ్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాతృదేవత (1969)
సంగీతం : కె.వి.మహాదేవన్
సాహిత్యం : దాశరధి
గానం : పి.సుశీల

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా..

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా..


ఈ అనురాగం ఈ అనుబంధం
మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం
మన ఇరువురి ఆనందం
కలకాలం మదినిండాలి కలలన్నీ పండాలి
కలకాలం మదినిండాలి కలలన్నీ పండాలి
మన కలలన్నీ పండాలి

మనసే కోవెలగా
మమతలు మల్లెలుగా


ఎన్నో జన్మల పుణ్యముగా
నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా
నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేము
ప్రతి రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేము

మనసే కోవెలగా
మమతలు మల్లెలుగా


నీ చూపులలో చూపులతో
నీ ఆశలలో ఆశలతో
నీ చూపులలో చూపులతో
నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి

మనసే కోవెలగా
మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా..
మనసే కోవెలగా
మమతలు మల్లెలుగా
  

మంగళవారం, డిసెంబర్ 18, 2018

బృందావనమాలి...

తప్పుచేసి పప్పుకూడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తప్పు చేసి పప్పు కూడు (2002)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : జొన్నవిత్తుల
గానం : కె.జె.యేసుదాసు, కె.ఎస్.చిత్ర

సమగమ సమాగమగసదా నీ సా
గమదని సమగస నిసదని మదగమ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
వీలలు గోలలు మాయలు నవ్వులు
మాకు ఎంతో ఇష్టంలేరా

బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి
మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి
ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
పదపదమంటూ పట్టే పట్టి ప్రేమఉట్టి కొల్లగొట్టి పోరా..ఆఆఆ..
పరవశమౌతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
ముద్దుల జాణ ముందుకు రాగా
మీగడ బుగ్గల నిగ్గులు దోచగ

బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి
యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి
వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి
గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా..ఆఆ..
గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా
మీటగ రారా యవ్వన వీణ
మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ

బృందావనమాలి... ఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

  

సోమవారం, డిసెంబర్ 17, 2018

పొన్న చెట్టు నీడలో...

భలే కృష్ణుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలే కృష్ణుడు (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఊ..ఊ..ఊ..ఊ..
ఓ..హో..హో..హో..ఆ..ఆ..ఆ..ఆ

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో..

ఆ..ఆ...అ.అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..
రాధమ్మ మదిలో

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పొంగింది గగనాన భూపాల రాగం
ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పొంగింది గగనాన భూపాల రాగం

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పలికింది పరువాన తొలివలపు రాగం..
తొలివలపు రాగం..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

ఆ..ఆ..ఆ..ఆ..రాగాలే..
ఊగాయి నీలాల యమునలో..

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం..
నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం..

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
మైమరచి రాధమ్మ మరచింది కాలం
మరచింది కాలం..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే..ఊగాయి నీలాల యమునలో..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..
రాధమ్మ మదిలో..


ఆదివారం, డిసెంబర్ 16, 2018

యమునా తటిలో...

దళపతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : దళపతి (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ 
గానం : స్వర్ణలత, బృందం

యమునా తటిలో నల్లనయ్యకై
ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే
వాడిపోయెనూ కాదా

యమునా తటిలో నల్లనయ్యకై
ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే
వాడిపోయెనూ కాదా

రేయి గడిచెనూ పగలు గడిచెనూ
మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే
రాగబంధమే లేదే

రేయి గడిచెనూ పగలు గడిచెనూ
మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే
రాగబంధమే లేదే

యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా...

యమునా తటిలో నల్లనయ్యకై
ఎదురు చూసెనే రాధా

ప్రేమ పొంగులా పసిడి వన్నెలే
వాడిపోయెనూ కాదా


శనివారం, డిసెంబర్ 15, 2018

పుట్టలోన ఏలుపెడితే...

భైరవ గీత చిత్రంకోసం తెలుగులో పిల్లల పాటలను కలుపుతూ సిరాశ్రీ సరదాగా రాసిన ఓ గమ్మత్తైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భైరవ గీత (2018)
సంగీతం : రవిశంకర్
సాహిత్యం : సిరాశ్రీ
గానం : అసిత్ త్రిపాఠి, స్వీకార్, అంజనా సౌమ్య

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా
పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

ఈరిఈరీ గుమ్మడి పండు ఈడిపేరమ్మా
ఇంతకన్నా నాకు ఏదీ పాట రాదమ్మా
హ ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కె గుర్రం అది రంగుల గుర్రం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
చుక్ చుక్ రైలొత్తందమ్మా

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

గుడి గుడి గుంజమంటూ
కాలికి గజ్జె ఇయ్యాలా పాడెయ్ నా
ఓయ్ దాగుడు మూత అంటూ
ఓ చెమ్మ చెక్కాడైనా పాడెయ్ నా
ఏయ్ కోతిబావ పెళ్ళి చేసేద్దామా మళ్ళీ
ఉడతా ఉడతా ఊచ్ సిందేద్దామా తుళ్ళీ
అరె తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో మేళాలోయ్

ఓ సందమామ రావే జాబిల్లీ రావే
అంటూనే పాడేయ్ నా
అ ఉప్పు కప్పురమ్ము పద్యాలు
పాటకట్టేసి పాడేయ్ నా
ఏయ్ సేత ఎన్నముద్ద సెంగల్వ పూదండ
నీ నవ్వులోన ఉంది తెల్లాని పాలకుండ
అరె ఉడతబోయి ఎలక వచ్చే
ఎలకా బోయీ పిల్లి వచ్చే

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

ఈరిఈరీ గుమ్మడి పండు ఈడిపేరమ్మా
ఇంతకన్నా నాకు ఏదీ పాట రాదమ్మా
హెయ్ ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కె గుర్రం అది రంగుల గుర్రం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
చుక్ చుక్ రైలొత్తాందమ్మా

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా


శుక్రవారం, డిసెంబర్ 14, 2018

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...

గీత గోవిందం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : చిన్మయి

అక్షరం చదవకుండా
పుస్తకం పేరు పెట్టేసానా
అద్బుతం ఎదుటనున్నా
చూపు తిప్పేసానా

అంగుళం నడవకుండా
పయనమే చేదు పొమ్మన్నానా
అమృతం పక్కనున్నా
విషములా చూసానా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...

రా ఇలా రాజులా నన్నేలగా
రాణిలా మది పిలిచెనుగా
గీతనే దాటుతూ చొరవగా
ఒక ప్రణయపు కావ్యము లిఖించరా
మరి మన ఇరువురి జత గీత గోవిందంలా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...


గురువారం, డిసెంబర్ 13, 2018

ప్రాణ బృందావనం...

ట్వంటీ ఫోర్ కిసెస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 24 కిస్సెస్ (2018)
సంగీతం : జాయ్ బారువ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రోహిత్, కావ్యా కుమార్ 

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
ఎంత సమ్మోహనం పెదాలతో ప్రేమ పానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

వన్ టూ త్రీ ఫోర్ అంటూ ట్వంటీఫోర్
కౌంటూ లెక్కపెట్టేసేయ్
వన్ బై వన్ను బేబీ ముద్దు జ్ఞాపకాలు
మూటకట్టేసేయ్
ప్రపంచమే నీ ఆశనీ తథాస్తనీ దీవించనీ..

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

ఏదో మైకం వేరే లోకం చూపుతోందే
హాయిగా ఉన్న ఇంత హైరానా
నిన్నలో లేనిది తప్పించుకోలేనిది

వన్ టూ త్రీ ఫోర్ అంటూ ట్వంటీఫోర్
కౌంటూ లెక్కపెట్టేసేయ్
వన్ బై వన్ను బేబీ ముద్దు జ్ఞాపకాలు
మూటకట్టేసేయ్
ప్రపంచమే నీ ఆశనీ తథాస్తనీ దీవించనీ..

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

ఊగే ప్రాయం ఆగేలాగ లేనె లేదే
మరో ముద్దేది ఎప్పుడంటుంది
మరింత కేరింతగా వేచి చూస్తున్నదీ
ఇరవై నాలుగన్న సంఖ్యలోనే
ఏదో మంత్రముందంటా
అదేమాట నమ్మి అన్ని
ముద్దులన్నీ అతనికిచ్చేస్తా
నా ప్రేమకూ బలం ఇదీ
నా నమ్మకం నిజం మరీ

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.