గురువారం, సెప్టెంబర్ 19, 2019

నిన్ను తలచి మైమరచా...

విచిత్ర సోదరులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర సోదరులు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ
ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే
ఓ చెలీ...

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే 

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయె జీవితం
జోరు వానలోన ఉప్పునైతి నేనే
హోరు గాలిలోన ఊకనైతి నేనే

గాలి మేడలే కట్టుకున్నా
చిత్రమే.. అది చిత్రమే..
సత్యమేదో తెలుసుకున్నా
చిత్రమే.. అది చిత్రమే..
కథ ముగిసెను కాదా..
కల చెదిరెను కాదా.. అంతే..

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే 

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపొయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు

రాసి ఉన్న తల రాత తప్పదు..
చిత్రమే.. అది చిత్రమే..
గుండె కోతలే నాకు ఇప్పుడు
చిత్రమే.. అది చిత్రమే..
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా..
అంతే..

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ
ఈ భూమి చేరదని
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే.. ఓ చెలీ..
 
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే

 

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

మరు మల్లియ కన్నా...

మల్లెపువ్వు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : బాలు

ఓ ప్రియా..ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ


సఖియా..
నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం

ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ


తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే

ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ
ఓ... ప్రియా.. 

 

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

నిన్ను మరచి పోవాలనీ...

మంచి మనుషులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంచి మనుషులు (1974)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

నిన్ను మరచి పోవాలనీ
అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్ని సార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా

నిన్ను మరచి పోవాలనీ
అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్ని సార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా


నువ్వు విడిచి వెళ్ళినా
నీ రూపు చెరిగి పోలేదు
నువ్వు మరలి రాకున్నా
నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు
నువ్వు విడిచి వెళ్ళినా
నీ రూపు చెరిగి పోలేదు
నువ్వు మరలి రాకున్నా
నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు

తలుపు తెరచి ఉంచుకుని
తల వాకిట నిలుచున్నా
వలపు నెమరు వేసుకుంటూ
నీ తలపులలో బ్రతికున్నా

నిన్ను మరచి పోవాలనీ
అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్ని సార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా


ఎందుకిలా చేశావో
నీకైనా తెలుసా
నేనెందుకింక ఉన్నానో
నాకేమో తెలియదు
ఎందుకిలా చేశావో
నీకైనా తెలుసా
నేనెందుకింక ఉన్నానో
నాకేమో తెలియదు

నేను చచ్చిపోయినా
నా ఆశ చచ్చిపోదులే
నిన్ను చేరు వరకు
నా కళ్ళు మూతపడవులే

నిన్ను మరచి పోవాలనీ
అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్ని సార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా


గుండెలోన చేశావు
ఆరిపోని గాయన్నీ
మందుగా ఇచ్చావూ
మన వలపు పంట పసివాడ్ని
గుండెలోన చేశావు
ఆరిపోని గాయన్నీ
మందుగా ఇచ్చావూ
మన వలపు పంట పసివాడ్ని

ఆ లేతమనసు తల్లి కోసం
తల్లడిల్లు తున్నది
నీ తల్లి మనసు తెలియకనే
దగ్గరవుతు ఉన్నది

నిన్ను మరచి పోవాలనీ
అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్ని సార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా  


సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ఆకాశ దేశాన...

మేఘసందేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : కె.జె.ఏసుదాస్

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం


వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి
విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి
మనోవేదన నా మరణయాతన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం 


ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ఎడారిలో కోయిలా...

పంతులమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పంతులమ్మ (1977)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా..
తెల్లారనీ రేయిలా...
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే..

ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన
మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత
విధిరాత చేత నా స్వర్ణ సీత

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాట... ఒక చేదు పాట

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా  
 

 

శనివారం, సెప్టెంబర్ 14, 2019

కల చెదిరింది...

సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవదాసు (కృష్ణ) (1974)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

కల చెదిరిందీ... కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ..
కన్నీరే ఇక మిగిలిందీ

కల చెదిరిందీ.. కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ

ఒక కంట గంగ.. ఒక కంట యమునా
ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ..
ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ

కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ

కల చెదిరిందీ... కథ మారిందీ..
కన్నీరే ఇక మిగిలిందీ
కన్నీరే ఇక మిగిలిందీ

మనసొక చోట మనువొక చోట
మమతలు పూచిన పూదోట
మమతలు పూచిన పూదోట

కోరిన చిన్నది కుంకుమ రేఖల
కుశలాన ఉండాలి ఆ చోట
కుశలాన ఉండాలి ఆ చోట

కల చెదిరిందీ.. కథ మారిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ


శుక్రవారం, సెప్టెంబర్ 13, 2019

మనసు గతి ఇంతే...

ప్రేమనగర్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల

తాగితే మరచిపోగలను
తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను
మరువనివ్వదు

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే
మనసు గతి ఇంతే


ఒకరికిస్తే మరలి రాదూ
ఓడిపోతే మరిచిపోదూ
ఒకరికిస్తే మరలి రాదూ
ఓడిపోతే మరిచిపోదూ
గాయమైతే మాసిపోదూ
పగిలిపోతే అతుకుపడదూ

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే


అంతా మట్టేనని తెలుసూ
అదీ ఒక మాయేనని తెలుసూ
అంతా మట్టేనని తెలుసూ
అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే


మరుజన్మ ఉన్నదో లేదో
ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో
ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా
దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే
మనసు గతి ఇంతే  

 

గురువారం, సెప్టెంబర్ 12, 2019

ఆకాశ వీధిలో...

మల్లీశ్వరి చిత్రంలోని ఒక చక్కని విరహ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లీశ్వరి (1954)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల, భానుమతి

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు

ఏడ తానున్నాడో బావా
జాడ తెలిసిన పోయి రావా
అందాల ఓ మేఘమాల ఆఆ ..
అందాల ఓ మేఘ మాల

గగన సీమల తేలు ఓ మేఘమాలా
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా

మల్లి మాటేదైన నాతో
మనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా ఆఆ
రాగాల ఓ మేఘమాలా

మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచెనే బావకై
చెదరి కాయలు కాచెనే ఏఏ …

నీలాల ఓ మేఘమాలా ఆఆ…
రాగాల మేఘమాలా

మనసు తెలిసిన మేఘమాలా
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా

కళ్ళు తెరచిన గాని
కళ్ళు మూసిన గాని
మల్లి రూపే నిలిచెనే
నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుక జాల
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు
గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసి పోవా
కన్నీరు ఆనవాలుగా బావ బ్రోల


బుధవారం, సెప్టెంబర్ 11, 2019

నీ సుఖమే నే కోరుకున్నా...

మురళీకృష్ణ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల

ఎక్కడ వున్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పనీ

నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా


పసిపాపవలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను
నువ్వుండలేనని వెళ్ళావు

నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా


వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే రుజువు కదా!

నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా


నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ వున్నా ఏమైనా
ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా 


మంగళవారం, సెప్టెంబర్ 10, 2019

అంతా భ్రాంతియేనా..

దేవదాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవదాసు (1953)
సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : కె. రాణి

అంతా.. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనా
ఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా..ఆ ఆ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా..
నా ఆశే దోచినదా ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
వంతలపాలై చింతింతే నా వంతా దేవదా..
నా వంతా దేవదా.. ఆ ఆ ..

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


సోమవారం, సెప్టెంబర్ 09, 2019

నీకోసమె నే జీవించునది...

మాయాబజార్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : ఘంటసాల, P.లీల

నీకోసమె..నే జీవించునది
ఈ విరహములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది

వెన్నెల కూడా..చీకటియైనా
మనసున వెలుగే..లేక పోయినా
నీకోసమె..నే జీవించునది

విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా

నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో..నా మనస్సులో
నీరూపమె..నే ధ్యానించునది

హృదయము నీతో వెడలిపోయినా..
మదిలో ఆశలు మాసిపోయినా..ఆఆ
మన ప్రేమలనే మరి మరి తలచి..
ప్రాణము నిలుపుకొనీ..ఈఈఈఇ
నీకోసమె..నే జీవించునది

మెలకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా
ఇక నా దానవెగా..ఆ ఆ ఆ

నీ రూపమెనే ధ్యానించునది
ఈ విరహాములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది 

 

ఆదివారం, సెప్టెంబర్ 08, 2019

సీతాలు నువ్వు లేక...

దొంగ దొంగ చిత్రం కోసం ఎ.ఆర్.రహ్మాన్ వాయిద్యాలేవీ ఉపయోగించకుండా కేవలం కోరస్ తోనే కంపోజ్ చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ తమిళ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  దొంగ దొంగ (1993)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : సాహుల్ హమీద్, కోరస్

సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురూ చేరే లోగా చేరు నన్నే
సీతాలూ నువ్వు లేక నేను లేనే

సందేపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయు వేళా
పూలు కోయలేదె మనసే కోసెనంట
పెళ్ళి చీరా పసుపు నీటా పిండారవేయు వేళ
మనసు పడిన వాడి మనసే పిండెనంట
గడ్డివాము చాటులోన బాస చేసి కూడా పోయేవే
పోయేవు పోయేవులే ప్రేమ తీసి గట్టు నెట్టి
నీ చీర చెంగు లోనె కన్నీళ్ళు మూట గట్టి పోయేవే
పోయేవు పోయేవు లే కోరుకున్న తోడు వీడీ
ఇచ్చిన మల్లెలన్ని నట్టేట ఇసిరేసి
నన్ను కన్నీటి వాగులోన అల చేసి
 
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట

సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఓ ఓ ఓ ఓ

బొట్టునీకు పెట్టినా వేలి రంగు ఆరలేదే
పూసుకున్న చందనాల వాసనింకా తగ్గలేదే
గాజువాకలోన కొన్న గాజులింక వెయ్యలేదే
పెళ్ళి పంచెకంటుకున్న పసుపు వన్నె మాయలేదే
కళ్యాణ బుగ్గ చుక్క కళ్ళార చూసేది ఎప్పుడమ్మా
మల్లెల పక్కమిద బంతులాట ఎప్పుడమ్మ
నీ కంటి కొనసూపు కొసరి రువ్వేది ఎప్పుడమ్మ
సీకటి ఎలుగులోన సిందులాట ఎప్పుడమ్మ
ఎలమావి తోటలోనా ఏకాకి గోరువంక
శృతి మారి కుసేనమ్మ జతకొసం వేచేనమ్మ
 
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట

సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఓ ఓ ఓ ఓ ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే


శనివారం, సెప్టెంబర్ 07, 2019

చెలియ లేదు...

దేవదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవదాసు (1953)
సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, కె. రాణి

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే ..
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే ..
మిగిలిందీ నీవేనే...

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు

చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..
నీ దారే వేరాయే...

చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే

మరపురానీ బాధకన్నా మధురమే లేదూ
మరపురానీ బాధకన్నా మధురమే లేదూ
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ
అందరానీ పొందుకన్నా అందమే లేదూ
ఆనందమే లేదు

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
 
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా
కథ తీరిపోయేనా

చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే..
మిగిలిందీ నీవేనే


శుక్రవారం, సెప్టెంబర్ 06, 2019

ప్రేమ లేదని...

అభినందన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

లాలల లలాలాల
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు ...

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు


మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ

ప్రేమ లేదని లలలాలలాల

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లాలల లలాలాల
లాలల లలాలాల 


గురువారం, సెప్టెంబర్ 05, 2019

అందెల రవమిది...

మిత్రులందరకూ గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ స్వర్ణకమలం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, వాణీ జయరాం

గురు బ్రహ్మః గురు విష్ణుః 
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మః ఆ.. ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మః  ఆ.. ఆ
తస్మై శ్రీ గురవే నమ:

ఓం నమో నమో నమశ్శివాయ

మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ

ఓం నమో నమో నమశ్శివాయ

శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా

అందెల రవమిది పదములదా ఆ.. ఆ

మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై.. ఆ.. ఆ..
వేణి విసురు వాయు వేగమై.. ఆ.. ఆ

అంగ భంగిమలు గంగ పొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల.. రస ఝరులు జాలువారేలా

జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ...

నయన తేజమే నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై

నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం వేదం వకారం
యజ్ఞం యకారం ఓం నమశ్శివాయ

భావమె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా

తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా పరమపధము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా

అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా ఆ.. ఆ.. 
  

బుధవారం, సెప్టెంబర్ 04, 2019

ప్రియతమా.. నా హృదయమా..

ప్రేమ సినిమా కోసం ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతిలయ లాగ జతచేరినావు
నువు లేని నన్ను ఊహించలేనూ
నావేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

నీ పెదవి పైనా వెలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు
పది జన్మలైన ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

 

మంగళవారం, సెప్టెంబర్ 03, 2019

నువ్వే నా శ్వాస...

ఒకరికి ఒకరు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒకరికి ఒకరు (2003)
సంగీతం : కీరవాణి  
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : శ్రేయ ఘోషల్

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష
బ్రతుకైన నీతోనే
చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని
చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...
ఓ ప్రియతమా...!

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష

పూవుల్లో పరిమళాన్ని
పరిచయమే చేశావు
తారల్లో మెరుపులన్ని
దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని
మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని
నా ముందే నిలిపినావుగా
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా
నే మరువలేనని
నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...
ఓ ప్రియతమా!

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష

సూర్యునితో పంపుతున్నా
అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా
ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా
ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా
అలుపెరుగని హృదయ లయలని
ఏ చోట నువ్వున్నా
నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని
వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...
ఓ ప్రియతమా!


సోమవారం, సెప్టెంబర్ 02, 2019

గణ గణమునకు పతియైన...

మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు ఆ గణనాథునికి నమస్కరించుకుంటూ శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గానం చేసిన ఓ చక్కని భజనను తలచుకుందాం. ఈ భజన ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బమ్ : నామార్చన (2008)
సంగీతం, సాహిత్యం, గానం :
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
గణం గణం బీ జగమె గణం
అణువుల జీవుల గణం గణం

మూలాధారము జీవగణం
స్వాధిష్ఠానము సస్యగణం
మణిపూరము సం పదల గణం
అనాహతంబది వాయు గణం

గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
 
విశుద్ధ మనగా విబుధ గణం
ఆజ్ఞా చక్రము శక్తి గణం
సహస్ర పద్మము తత్త్వ గణం
ఇక పై మిగిలిన దేమి గణం

గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
 
గోళాలన్నీ అణు గణము
ఆకాశమంతా లోకగణం
ఈ గణపతిగణ మణి ఘృణిలో
సచిదానందుని గుణమగుణం

గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
 

ఆదివారం, సెప్టెంబర్ 01, 2019

ఎళ్ళిపోకె శ్యామలా...

సెప్టెంబర్ నెలను భగ్న ప్రేమికులకు అంకితం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ రోజు అ.ఆ. చిత్రంలోని ఈ చక్కని ట్యూన్ తో మొదలు పెడదామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : కార్తీక్

నువ్వు పక్కనుంటే బాగుంటాదే,
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట
ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే

ఎళ్ళిపోకె శ్యామలా..
ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల
ఎళ్ళిపోకె శ్యామలా
ఎక్కి ఎక్కి ఏడవ లేదే ఎదవ మగ పుటక
గుండె పెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక

ఎళ్ళిపోకె శ్యామలా..
హే ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల
ఎళ్ళిపోకె శ్యామలా..

హ్మ్.. నరం లేని నాలిక నిన్ను
ఎలిపొమ్మని పంపిందాయె
రథం లేని గుర్రం లాగా
బతుకే చతికిలబడిపోయే
నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే
స్విచ్చేస్తే ఎలిగేదా ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లే నీ ప్రేమె ఉన్నదే
ప్రాణాన్నే పటకారేసీ పట్టేసీ
నీతో పట్టుకు పోమాకే
గెలిచేసి నన్నొదిలేసి
సీకటైన కోటలాగా సెయ్యమాకే

నువ్ ఎళ్ళిపోకే శ్యామలా
నువ్ ఎళ్ళమాకె శ్యామలా
ఏమీ బాగాలేదే లోపల
నువ్ ఎళ్ళిపోకె ఎళ్ళిపోకె
ఎళ్ళిపోకే శ్యామలాఅ..

మనసుకంటుకున్నదో
మల్లెపూల సెంటు మరక
మరిచిపోదమంటె గుర్తుకొస్తఉందా నిప్పు సురక
ఏటి సెయ్యనోరి సైదులు
గుండెలోన గుచ్చిపోయినాది సూదులు
నానేటి సెయ్యనోరి సైదులు
గుండెల్లోన గుచ్చిపోయినాది సూదులు

ఎళ్ళిపోకె శ్యామలా..
అట్ట ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు ఎళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
 

శనివారం, ఆగస్టు 31, 2019

లక్ష్మీ పద్మాలయ...

శ్రావణ మాసపు భక్తి పాటల సిరీస్ ను జగద్గురు ఆదిశంకర చిత్రంలోని ఈ లక్ష్మీ స్తుతి తో ముగిద్దాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : శరత్ సంతోషి

లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియా
ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతాః

నమోస్తు నాళీకనిభావనాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తుసోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణో రురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యైకమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.