శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ముక్కెర ముక్కెర ఎక్కడే...

మామాంగం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మామాంగం (2019)
సంగీతం : ఎమ్.జయచంద్రన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : మృదుల వారియర్

ముక్కెర ముక్కెర ఎక్కడే
ముక్కెర ముక్కెర ఎక్కడే
అటుపక్క ఉన్నావో
ఇటుపక్క ఉన్నావో
ఎటుపక్క ఉన్నావో
నిన్ను పట్టేది ఎట్టాగే

ముక్కెర ముక్కెర ఎక్కడే
ముక్కెర ముక్కెర ఎక్కడే

చల్లంగ నా కళ్ళు కప్పేసి
నువ్వేడ దాగావె ముక్కెర
ఎనలేని బిడియాలతో బాటు
నా ఎదలోనే ఉన్నావే ముక్కెర
వెతికానే నీకోసం
విసిగిందే నా ప్రాణం
ఎచటే నువ్వున్నాదీ
నిన్ను పట్టేది ఎట్టాగే

ముక్కెర ముక్కెర ఎక్కడే
ముక్కెర ముక్కెర ఎక్కడే

ఏమయ్యావో ఎమయ్యావో
ఏమయ్యావో
ఏమయ్యావో ఎమయ్యావో
ఏమయ్యావో
నా లోకమంత నీవే
అనుకున్నా నేను
పరువాల ఒడిలో
తమకాల జడిలో
వెదికానే నీకోసం
చిట్టి ముక్కెర ఎక్కడే

ముక్కెర ముక్కెర ఎక్కడే
ముక్కెర ముక్కెర ఎక్కడే
ముక్కెరా రావే.. 


4 comments:

హాపీ బర్త్ డే వేణూజి..మా నించి మీకు..
https://youtu.be/ubtgaOUVYAo

థ్యాంక్స్ ఫర్ ద విషెస్ శాంతి గారూ...

జన్మదిన శుభాకాంక్షలు వేణు గారూ. Many Happy Returns of the Day 💐.

(సరదాకి ::- ఈరోజు పుట్టినరోజు గలవారి గురించి అయ్యో వీళ్ళ పుట్టినరోజు వేడుకనాడు దేశంలో సెక్షన్ 144 వగైరా ఆంక్షలు ఉంటున్నాయి కదా అనిపిస్తోంది ఓ పాతికేళ్ళ నుండీ)

థ్యాంక్స్ ఫర్ ద విషెస్ నరసింహారావు గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.