శనివారం, డిసెంబర్ 28, 2019

తిరుప్పావై 13 పుళ్ళిన్ వాయ్...

ధనుర్మాసం లోని పదమూడవ రోజు పాశురము "పుళ్ళిన్ వాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
బకుని చంపిన కృష్ణుని
పంక్తికంఠు ప్రాణముల్
యేగొన్న రామునీ పాడుకొనుచు
గమ్యమును చేరుచున్నారు కాంతలెల్ల
 
శుక్రుడుదయించే గురుడును శూన్యుడయ్యే
పక్షులివిగో కూయుచున్నవి పద్మ నయనా
మంచి దినమున నీవిట్లు మాటలేక
నిద్రవోవుచునుండుటా నీతి కాదు


లేవవేమమ్మా నోముకు లేచిరావమ్మా
లేవవేమమ్మా నోముకు లేచిరావమ్మా
   
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదమూడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై,
క్కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైకళెల్లారుమ్ పావైక్కళమ్ పుక్కార్,
వెళ్ళి యెழுన్దు వియాழ ముఱంగిత్తు,
ప్పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్! పోదరిక్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ ! నీ నన్నాళాల్,
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదమూడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


బలమున్న బకాసురుని గళము చీల్చి పొగడినా
అలి వేణులకాప్తుడైన ఆ కృష్ణుని వీడినా
పది తలలా రావణుని పల్లవమ్ముగా దృంచిన
పదుగురు శ్రీరాముని మది పాడుచు వచ్చినా

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


వనితలంత వలపులొలుక
వ్రత క్షేత్రమింపులొలుక
వయ్యారము చిందులాడ
వేయి పేర్లు పెట్టి పిలువ

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


కమలాల కన్న మిన్న కన్నులు గలదానా
రమణీయ హరిణి కన్న రమ్య దృక్కులున్నదాన
తూరుపున శుక్రుడెదిగి పడమట గురువొదిగే
వేరు వేరు రవళులు విహంగములు వినిపించిన

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


నల్లనయ్య ఒడిలో నలిగి అన్ని విస్మరించి
తెల్లవార్లు పాన్పుపైన కేళిలోన పరవశించి
చల్లనైన నీటిలోన జలకమాడి మా వెంట
ఉల్లములో హరిని నిల్పి వ్రతము చేయరమ్మంటే

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


2 comments:

దుష్ట శిక్షకా..శిష్ట రక్షకా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.