మంగళవారం, జూన్ 27, 2017

కలికి చిలక రా...

నాలుగు స్తంభాలాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

హె హె హె హె హె
కలికి చిలక రా.. కలిసి కులక రా
ఉలికి పడకు రా..ఆ ఉడికే వయసు రా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా


చలిలోనా జొరబడక.. చెలితోనా జత పడగా
ఏరా మోమాటమా...లేరా.. రారా.. నీదేలే ఛాన్సురా
కవ్వింత నువ్వడుగా..హహ.. గిలిగింత వెనకడుగా
ఆగే ఆరాటమా... రారా.. కుమారా.. నీదే రొమాన్సురా
యవ్వనమె రివ్వుమనె నవ్వులతో.. ఉలికి.. పడు

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా

లా లా లలలా లాలా లలలా లలలా

ముదిరిందా ప్రేమకథా.. నిదురంటూ రాదుకదా
కొంగే కోలాటమై... ఈడే.. తోడై.. కొకొరకో అందిరా
పెదవులలో మధు పాత్రా.. వెదకడమే నీ పాత్రా
వలపే నీ వాటమై... ఈడో జోడో.. దక్కిందే నీదిరా
మత్తులలో.. ఒత్తిడిగా.. హత్తుకుపో... ఘుమఘుమగా

కలికి చిలక రా రా రా రా
కలికసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా
ఉడికే వయసు రా రా రారా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో

కలికి చిలక రా రా రా రా
కలిసి కులక రా రా హే హో

 

సోమవారం, జూన్ 26, 2017

ఏ దివిలో విరిసిన...

కన్నెవయసు చిత్రంలో జానకి గారు పాడిన ఒక మధుర గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కన్నెవయసు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : జానకి

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

  

ఆదివారం, జూన్ 25, 2017

అంతట నీ రూపం...

పూజ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : దాశరథి
గానం : బాలు

ఆహా...హా...ఏహే..హే...లాలా ...లా...లాలా..లా..
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం

అంతట నీరూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...

నీవే లేని వేళ... ఈ పూచే పూవులేల
వీచే గాలి.. వేసే ఈల.. ఇంకా ఏలనే

కోయిల పాటలతో ..పిలిచే నా చెలీ..
ఆకుల గలగలలో నడిచే కోమలీ..

అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...

నాలో ఉన్న కలలు.. మరి నీలో ఉన్న కలలూ
అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే..

తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా
నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా

అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ..
ఆహా..హా...ఓహో..ఓ..లాలాలా...ఏహే..హే...


శనివారం, జూన్ 24, 2017

ఓ టెల్ మి.. టెల్ మి..

అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, జానకి

ఓ టెల్ మి.. టెల్ మి.. టెల్ మి.. వాట్
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి.. అఫ్ కోస్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్

ఓ.. టెల్ మి.. టెల్ మి.. టెల్ మి.. అస్క్ మి బేబీ
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  సర్టె న్లీ స్వీట్ హార్ట్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్


చాటు చేయ వద్దు నీ అందాలు.. వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు
చాటు చేయ వద్దు నీ అందాలు.. వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు  
చేయి చేయి కలుపు.. నీ హయి ఏమొ తెలుపు..
నీ మానసంతా నా మీదే నిలుపు
కలసి చిందు లేద్దా౦.. కవ్వించి నవ్వుకుందా౦..
ఈ రేయి మనం ఒళ్ళు మరచిపోదాం


ఓ టెల్ మి.. టెల్ మి.. టెల్ మి.. ఊహు
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి.. నో
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్  బేబి.. కమాన్

వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..  ఆపలేవు పడుచుదనం పరువళ్ళు
వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..  ఆపలేవు పడుచుదనం పరువళ్ళు
ఈ సిగ్గు నీకు వాద్దు.. అహ లేదు మనకు హద్దు..
ప్రతి వలపు జంట లోకానికి ముద్దు
ఈ వయసు మరల రాదు.. ఈ సుఖము తప్పుకాదు
ఈ సరదాలకు సరిసాటే లేదు..


ఓ.. టెల్ మి.. టెల్ మి.. టెల్ మి..
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  విత్ ప్లెషర్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి

కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్

ఓ.. టెల్ మి.. టెల్ మి.. టెల్ మి..
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్..
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్ 


శుక్రవారం, జూన్ 23, 2017

వస్తాడే నా రాజు...

తూర్పు వెళ్ళే రైలు చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979)
సంగీతం : బాలు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఎస్. పి. శైలజ

వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు
రావాలసిన వేళకే వస్తాడే తేవలసిందేదో తెస్తాడే
వస్తాడే... కూ... చికుబుకు
చికుబుకు చికుబుకు చికుబుకు

వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు
రావాలసిన వేళకే వస్తాడె తేవలసిందేదో తెస్తాడే

చిలకా చిలకా ఓ రామ చిలకా...
రావాలసిన వేళకే వస్తాడే
తేవలసినదేదో తెస్తాడే.. వస్తాడే...కూ...

నల నల్ల మబ్బులు కమ్ముతుంటే ...
నా మనసు ఉయ్యాల ఊగుతుంటే..
చిటపట చినుకులు కురుస్తుంటే
జిలిబిలి సొగసులు తడుస్తుంటే
మెల్లగా దొంగలాగా వస్తాడే ..
నా కళ్ళు మూసి పేరు చెప్పమంటాడే...

వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు
వస్తాడే... కూ ...

మేళాలు తాళాలు మోగుతుంటే...
బాజాలు బాకాలు రేగుతుంటే..
ఊరంత తోరణాలు కడుతుంటే..
ఊరేగి సంబరం చేస్తుంటే..
తూరుపు బండి లోంచి దిగుతాడే..
నను కోరి కోరి పెళ్ళి చేసుకుంటాడే

వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు
రావాలసిన వేళకే వస్తాడె తేవలసిందేదో తెస్తాడే

 

గురువారం, జూన్ 22, 2017

నవరాగానికి నడకలు...

కళ్యాణి చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : బాలు, సుశీల

నవరాగానికి నడకలు వచ్చెను
మధుమాసానికి మాటలు వచ్చెను
నడకలు కలిపి నడవాలి
మాటలు కలిపి మసలాలి

నవరాగానికి నడకలు వచ్చెను
మధుమాసానికి మాటలు వచ్చెను

సరసాల బాటలో సరాగాల తోటలో
సరసాల బాటలో సరాగాల తోటలో
 అనురాగానికి అంటులు కట్టాలి
 అనురాగానికి అంటులు కట్టాలి
మొలకెత్తిన ఆశకు చిగురించిన ఊసుకు
మొలకెత్తిన ఆశకు చిగురించిన ఊసుకు
 తొలకరి నాటులు నాటాలి
 తొలకరి నాటులు నాటాలి

నవరాగానికి నడకలు వచ్చెను
మధుమాసానికి మాటలు వచ్చెను

కులుకులకు కుదురులు కట్టి
పరువాలకు పందిరి వేయాలి
పున్నమి నాటికి పూవులు పూయించాలి
ఆఆఆఅ..ఆఅ..ఆఆఆ..ఆఆ
కులుకులకు కుదురులు కట్టి
పరువాలకు పందిరి వేయాలి
పున్నమి నాటికి పూవులు పూయించాలి
పూవులు పూయించాలి
పూట పూటకు తోటకు వెళ్లి
పూవుల మాలలు కట్టాలి
అమర కళలకు అర్పణ చేయాలి
ఆఆఅ....ఆఆఆ..ఆఆఆ
పూట పూటకు తోటకు వెళ్లి
పూవుల మాలలు కట్టాలి
అమర కళలకు అర్పణ చేయాలి
అర్పణ చేయాలి..

నవరాగానికి నడకలు వచ్చెను
మధుమాసానికి మాటలు వచ్చెను

నడకలు కలిపి నడవాలి
మాటలు కలిపి మసలాలి

నవరాగానికి నడకలు వచ్చెను
మధుమాసానికి మాటలు వచ్చెను
 

బుధవారం, జూన్ 21, 2017

నేనా .. పాడనా పాటా...

గుప్పెడు మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ
నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ
నువ్వు పాడిందే సంగీతమూ

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఇల్లే సంగీతమూ వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం

ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ నీకు ఎందుకు సందేహమూ
నీకు ఎందుకు సందేహము

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా 
 
ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఉడకని అన్నానికీ మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా

కుత కుత వరి అన్నం తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ నీకా పదునెటు తెలిసిందీ
నీకా పదునెటు తెలిసింది

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ
నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ
నువు పాడిందే సంగీతమూ 


మంగళవారం, జూన్ 20, 2017

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు...

ఇంద్రధనుస్సు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సంగీతం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు
ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన
మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు
ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన
మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

పసిడి పసుపు.. మేని రంగు
సందె ఎరుపు.. బుగ్గ రంగు
నీలి రంగుల..కంటి పాపల
కొసలలో...నారింజ సొగసులు
ఆకు పచ్చని.. పదారేళ్ళకు
ఆశలెన్నో.. రంగులు
ఆ ఆశలన్ని.. ఆకాశానికి
ఎగసి వెలసెను..ఇంద్రధనుసై
ఇంద్రధనుసై..ఇంద్రధనుసై

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు
ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన
మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు

వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా
వాడి వెలుగే ఏడురంగుల ఇంద్రధనుసై నాలో
ఇంద్రధనుసై నాలో

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు
ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన
మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు


సోమవారం, జూన్ 19, 2017

ఇదే ఇదే నేను కోరుకుంది...

అందమె ఆనందం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అందమే ఆనందం (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం: బాలు, సుశీల

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ

బిడియం మానేసి నడుమున చెయ్ వేసి
బిడియం మానేసి నడుమున చెయ్ వేసి
అడుగు అడుగు కలపాలని ఉంది..ఈ..ఈ

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ..

అహ..హా.హ..హ...లలలల..లా..

నాలోన మ్రోగే ఈ వేళలోనా... నీ లేత పరువాల వీణా
ఈనాడు కురిసే నీ కళ్ళలోనా... అనురాగ కిరణాల వానా
తలపుల తెర తీసి.. వలపులు కలబోసి..ఈ..ఈ
తలపుల తెర తీసి.. వలపులు కలబోసి...
ఒదిగి ఒదిగి ఉండాలని ఉంది...ఈ..ఈ..

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ
బొమ్మలు మానేసి.. రంగులు చిమ్మేసి
బొమ్మలు మానేసి.. రంగులు చిమ్మేసి
కనుబొమ్మలు కలపాలని ఉందీ ..ఈ..ఈ

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ..
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ


మాటాడు బొమ్మ.. మనసున్న బొమ్మ..
నీ ముందు నిలిచింది చూడు
మురిపాలు కోరి.. అలవోలే చేరి..
నీ చెంప మీటింది నేడు

కలవరమేలేదా? కదలిక యే లేదా?
కలవరమేలేదా? కదలిక యే లేదా?
కలిసి ఊసులాడాలని ఉందీ...ఈ..ఈ..


ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ

ఎన్నెన్ని విరులో ఈ పాన్పు పైన మన రాకకై వేచెనేమో
ఎన్నెన్ని మరులో ఈ రేయిలోనా మనకోసమే వేచెనేమో

మనసులు శృతి చేసి.. తనువులు జత చేసి..
మనసులు శృతి చేసి..
తనువులు జత చేసి..
పగలు రేయి కలపాలని ఉందీ..ఈ..ఈ..

ఇదే ఇదే నేను కోరుకుంది
ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ...ఈ
ఇదే ఇదే నేను కోరుకుంది
ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ..ఈ 

 

ఆదివారం, జూన్ 18, 2017

ఈ తరుణము...

ఇంటింటి రామాయణం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంటింటి రామాయణం (1979)
సంగీతం : రాజన్ - నాగేంద్ర
సాహిత్యం : కొంపల్లె శివరాం
గానం : బాలు, సుశీల

ఏ..హే..హే హే..ఏ..
ఆ..హా..ఆ..హా..ఆహా..ఆ ఆ

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

అరవిరిసిన పూలలోనే..నీ అందం తూచనా
ఊరించే మోవిలోనే..తేనియలే దోచనా
కలసిన మన చూపుతోనే..కాలాన్నే ఆగనీ
బంధించే చేతులందూ..ఊయలనై ఊగనీ
నీ దోరనవ్వు విరజాజిపూవు
పరువాలు రువ్వు పాలపొంగులో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
 
ఉసిగొలిపే కొండగాలీ..వేడంత పంచనా
కవ్వించే పొంగులన్నీ..రవికై బిగియించనా
చిరుచెమటలు పోయువేళా..గుండెల్లో నిండిపో
గుండెల్లో నిండిపోయీ..ఊపిరివై ఉండిపో
ఈ కొండకోన అందాలలోన..
సుధలొలకబోయు పూలబాటలో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
లలలలా..లలలలా..లలలలా

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail