మంగళవారం, మార్చి 31, 2020

తిరు తిరు గణనాథ...

హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిణి

తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2)
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2)
సా సనిసగసా సగమా మా
మగమపమా మపనీ పా పమపనిసా సానీ
సాగస నీసని పానిప మాపమ గామగసా
॥సనిసగసా॥

చెవులారా వింటూనే ఎంత పాఠమైనా
ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు
కనులారా చదివింది ఒకసారే ఐనా
కల్లోను మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా ఛాయిస్‌లో పోనివ్వు
ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు పణ్ణివ్వు
ఏ టెన్షన్ దరికిరాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీటుపైన ఆగిపోని పెన్నివ్వు

తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై

తలస్నానం చెయ్యకుండా పూజించానంటూ
నావైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ
వాషైపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే
మా తలరాతలు తారుమారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దెయ్ బంగారూ
పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై 


సోమవారం, మార్చి 30, 2020

యా కుందేందు...

హ్యాపీ డేస్ చిత్రం కోసం ప్రణవి గానం చేసిన సరస్వతి స్తుతిని ఈ రోజు తలచుకుందాం. ఈ శ్లోకం ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనమంతా (2016)
సంగీతం : మిక్కీ జె మేయర్      
సాహిత్యం : సరస్వతి స్తుతి
గానం : ప్రణవి  

యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా 

 

ఆదివారం, మార్చి 29, 2020

టిక్ టిక్ ఆగని...

మనమంతా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనమంతా (2016)
సంగీతం : మహేష్ శంకర్      
సాహిత్యం : వశిష్ట వర్మ
గానం : శ్రియ మాధురి  

టిక్ టిక్ ఆగని సమయం
ఠక్ ఠక్ తడుతూ ఉదయం
కిరణాలతో రోజు ప్రయాణం

టక్ టక్ విశ్వ సంకేతం
చక్ చక్ పెంచుతూ వేగం
రోజు చీకటైపోతూ
రోజూ వేకువై వస్తూ
విరిసే దారులై
మెరిసే అడుగులై
మురిసే పరిచయాలైతే

ఉఫ్ ఉఫ్ ఉసూరు ఒక నిముషం
ఊ ఊ ఉషారు మరునిముషం
ఈ నవ్వు ఈ క్షణం సొంతం
ఈ గాలి ఊపిరై కొంచెం
 
మళ్ళీ పుడుతూ
మళ్ళీ పడుతూ
మళ్ళీ మళ్ళీ లేస్తూ
మళ్ళీ మళ్ళీ పుడుతూ
మళ్ళీ మళ్ళీ పడుతూ
మళ్ళీ మళ్ళీ లేస్తూ 

శనివారం, మార్చి 28, 2020

జూన్ జూలై ఒడిలో పూసే...

కళాశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కళాశాల (2009)
సంగీతం : జాషువా శ్రీధర్    
సాహిత్యం : భువనచంద్ర
గానం : రాహుల్ నంబియార్

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే
మొగ్గే కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా

ఊరేదో పేరేదో చూడమే
కన్నీళ్ళు తుడవడం మరువమే
నీ బాధ చూడలేక మనసు ఆగలేక
కురియు వర్షమే చెలిమిరా
కాలేజీ ఇచ్చే కానుక
కడదాక నిలిచే స్నేహమే
ఇది పాఠాల నిలయమైన
టీచింగే మధురమైన మాటలు
మిగిలేటి బంధమే
ఎన్నెన్నో అల్లరులే చేస్తాం
ఎన్నెన్నో స్వప్నాలే కంటాం
ఎన్నెన్నో గాయాలను చూస్తాం నేస్తమా
ఎన్నెన్నో పాఠాలను చదివి
ఎన్నెన్నో నీతుల్నే నేర్చి
ఎన్నెన్నో గొడవల్నే పడినా
ఎన్నెన్నో నిరసనలే చేసిన
గుండెల్లో స్నేహముండునోయ్

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా

విత్తుల్లో దాగిన మొక్కనీ
వాన మొలకెత్తించెనే
ఎదలో మరుగుపడ్డ
మధుర భావనని
స్నేహమే వెలికి తీయులే
ఈనాటి మనమధ్య చెలిమిని
కాలేజీ నీడలు తెలుపులే
ఈ కాలేజీ బెంచ్ లన్నీ
కాంపౌండు గోడలన్నీ
మరల కథలు వినిపించులే
హాలిడేస్ ఇచ్చేశారంటే
ఇళ్ళల్లో మనసుండదు అంటా
మళ్ళీ కలిసే దాకా ఆగమే
ఒంటరిగా క్షణమే యుగముగా
మిస్సయ్యే ఊహలో నిట్టూర్పులు రాగా
అందరమూ ఒకటయ్యే దాకా
నవ్వుల్నీ చిందించే దాకా
గుండెల్లో బెంగ తగ్గదే

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా  
 

శుక్రవారం, మార్చి 27, 2020

అయ్యా నే సదివి బాగు పడతా...

రేపటి పౌరులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రేపటి పౌరులు (1986)
సంగీతం : చక్రవర్తి    
సాహిత్యం : వంగపండు
గానం : శ్రీనివాస్, శైలజ

అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా
పుస్తకాలు సదువుకొని
మన బతుకులు మారుత్తా 
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా

అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీత్తవేటి
సదువు భూతం పడితే నువ్వు సంకనాకి పోతావు
బి.ఏ ఎం.ఏ చదివినోళ్ళె బికర్లయ్యి తిరుగుతుండ్రు
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురో ఒరేయ్ ఒరేయ్
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురా

ఆ డాకటేరు కొడుకులాగా డాబు డూబుగుంటాను
ప్లీడరు గారి కొడుకు లాగ నెక్కు టై కడతాను
ఎస్ ఐ గారి కొడుకు లాగ సైకిలెక్కి బడికెళ్త
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా

మతి బోయిన్దేటి నీకు మారాజుల బిడ్డలాళ్ళు
ఆళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడుకా
పనీ పాట లేనోల్లకు సదువే ఒక పెద్ద పని
సదువు గిదువు అన్నవంటే సెంప పగల గొడతాను
సదువు గోల మనకొద్దురా కొడుకా
చావు బతుకు మనకోద్దురా ఒరేయ్ 

దండించకు ఓరయ్య దండం బెడతా నీకు
ఈదుల్లో బడులున్నయ్ ఇస్కూలు బడులున్నయ్
పంతుల్లకు కాళ్ళు మొక్కి సదువు బిచ్చ పెట్టమంట
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా

ఈదుల్లో బడుల్లోన పందులు తొంగుటున్నాయి
అందులోన పంతుళ్ళు పేక తురాణాలాడి
ప్రైవేటులు చదివితేనే పాసు చేస్తమంటండ్రు
సదువుకునే రోజులెల్లి సదువులు కొనే రోజులోచ్చే
సదువు గోల మనకొద్దురా కొడుకా
సావు బతుకు మనకోద్దురా ఒరేయ్

డబ్బు గోల నీకెందుకు ఆ బాదలు నేబడత
గవర్నమెంట్ సదువంట గరీబొల్ల సదువంట
అనాదోడి బిడ్డణ్నని హాట్టల్లో జేరత
పుత్తకాలు బట్టలు ఉత్తినే ఇత్తారంట
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా

నమ్మకురా ఆ మాట నంజి కొడక సెడిపోతవ్
అనాదోల్ల పుత్తకాలు అచ్చవలేదంటారు
షాపు లోన పుత్తకాలు సాటు మాటుగమ్ముతుండ్రు
పసి పిల్లల హాస్టల్లో పాసికూడు పెడతండ్రు
కొటాల నాయకులు వాటాలు పంచుకునీ
హాట్టళ్ళ సొమ్ము నంత ఓటర్లకు పంపుతుర్రు
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురో ఒరేయ్

కట్టమైన నట్టమైన కాన్వెంటుకు పంపించు
ఇంగిలీషు సదివి నేను ఇంజినీరునయ్యొత్త
ఈ రిచ్చబతుకు నీకెందుకు కారు నీకు కొనిదెత్త
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా నే సదివి బాగు పడతా

నీ కాన్వెంటు సదువుకి కరుగుతాయి నా కండలు
ఇంజినీరు సదువుకి ఇంకుతాది నా నెత్తురు
నువ్వు కారు గొనేలోపు నేను కాటికెళ్ళి పోతాను
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురా అయ్యా

ఫై సదువులు చదువుకోని పట్టానే పట్టుకొని
మధ్యవర్తి మంతిరికి లంచాలు కట్టుకొని
ఆ దోరకని పనులకు ఆపీసులు తిరిగి తిరిగి
ఇసిగిపోయి చివరకి ఈ కప్పులు కడిగే కంటే
ముందు గానే ఈ పనులు ముచ్చటగా చేసుకోర

సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురో ఒరేయ్ ఒరేయ్
సదువు గోల నీకొద్దురో కొడుకా
సావు బతుకు మనకోద్దురా



గురువారం, మార్చి 26, 2020

భారత మాతకు జేజేలు...

బడిపంతులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

 
చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, బృందం

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి 
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
 
భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ 
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ 
విప్లవ వీరులు వీర మాతలు 
విప్లవ వీరులు వీర మాతలు 
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము 
లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ


బుధవారం, మార్చి 25, 2020

రంగేళీ హోలీ హంగామా కేళీ...

ఉగాది సందర్బంగా మిత్రులందరకు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా లో విషెస్ షేర్ చేస్కుంటూ కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతూ ఉగాది పండగ జరుపుకోండి. కరోనాను తరిమి కొట్టడంలో ప్రభుత్వానికి సహకరించండి. 

ఈ పండగ రోజు అన్ని పండుగల గురించి చెప్పే ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చక్రం (2005)
సంగీతం : చక్రి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్

కృష్ణ కృష్ణ కృష్ణా...
హే రామ రామ రామా
చిన్నా పెద్దా అంతా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్
పండుగ చేయ్యలంటా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్
తీపి చేదు అంతా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్
పంచి పెట్టాలంటా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్

హేయ్ రంగేళి హోలీ హంగామా కేళీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలీ
రవ్వల రించోలీ సిరిదివ్వెల దీవాళీ

ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహుర్తం ఉంటుందా

జీం తరత్తా తకథిమి, జీం తరత్తా (2)

హేయ్ రంగేళి హోలీ హంగామా కేళీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వలరించోలీ సిరిదివ్వెల దీవాళీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలీ


తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే
ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం
నిత్య భాద్రపదమవుతుంది
లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగజేసే జాగరణే... శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా

రంగేళి హోలీ హంగామా కేళీ

తల్లుల జోలపదాలై గొల్లల జానపదాలై
నరుడికి గీత పదమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయ్యింది
మనలో మనమే కలహించే మనలో మహిషిని తలతుంచి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

గొబ్బియలో... గొబ్బియలో (2)

ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉంటామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే 

 

మంగళవారం, మార్చి 24, 2020

మమ్మీ.. మమ్మీ..

అమ్ములు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్ములు (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్  
సాహిత్యం : గుండవరపు సుబ్బారావు
గానం : శృతి, మంజుల

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003
మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003

లెట్ మి ప్లే లెట్ మి సింగ్
లెట్ మి డాన్స్ మమ్మీ
లెట్ మి క్రై లెట్ మీ లాఫ్
లెట్ మి స్లీప్ డాడీ
లెట్ మి ప్లే లెట్ మి సింగ్
లెట్ మి డాన్స్ మమ్మీ
లెట్ మి క్రై లెట్ మీ లాఫ్
లెట్ మి స్లీప్ డాడీ

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003
మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003

ఫైవ్ ఓ క్లాక్ కే లేపేరు మొహాన నీళ్ళే చల్లేరు
ఆ చల్లటి నీళ్ళు మా కన్నీళ్ళతో కలిసిపోతాయి
టిఫెన్ రెడీ అని అంటారూ నోట్లో పెట్టీ కుక్కేరూ
ఆకలి లేదూ అమ్మా అంటే చెంపను ఓటీ ఇచ్చేరూ

రిక్షావాడూ వస్తాడూ బెల్లును ఘల్లున కొడతాడూ
నలుగురు పట్టే రిక్షాలోనా ఇరవై మందిని కుక్కేడూ
టాప్ లేనీ రిక్షాలోనా ట్రాఫిక్కు జాముల్లోనా
బతికాము చాల్లే అంటూ ఆనందంగా బడిలోకి
అడుగులు పెడతామూ

పొల్యూషన్ పీల్చీ మెదడు పాడైపోయింది మమ్మీ
సొల్యూషన్ లేక మాథ్సు ఫెయిలైపోయాను డాడీ
టీచరుకొట్టే దెబ్బలకోసం తయారుగున్నాము

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003

ప్రీకేజీలో వేశారూ ఎల్కేజీలో తోశారూ
బండెడు బుక్సూ వీపున వేసీ యూకేజీకి పంపారు
పుస్తకాలు మోసి మోసీ నడుమే వొంగి పోతుంది
భవిష్యత్తులో గూని వచ్చునని భయమే పుడుతుంది

ఫస్టు రాంకు రాకుంటే పట్టుకోనీ కొడతారు
అరవై మందికి ఫస్టు ర్యాంకును టీచర్ ఎట్లా వేస్తుంది
పప్పుల్ని పిండి చేసే రుబ్బురోలు లాగా మేము
పుస్తకాలు రుబ్బి రుబ్బి ఐదేళ్ళకే బామ్మల్లా
కళ్ళజోడు పెడతామూ

ప్రిన్సిపల్ కి పాటలు అంటే పిచ్చి అలర్జీ డాడీ
కాన్వెంటులో ఆటలు ఆడే గ్రౌండే లేదు మమ్మీ
కాళ్ళకి తాళ్ళు కట్టి పడేసిన నెమళ్ళమయ్యాము

మమ్మీ మమ్మీ... డాడీ డాడీ
విష్ యూ హాపీ న్యూ ఇయర్ 2003
లెట్ మి ప్లే లెట్ మి సింగ్
లెట్ మి డాన్స్ మమ్మీ
లెట్ మి క్రై లెట్ మీ లాఫ్
లెట్ మి స్లీప్ డాడీ 

సోమవారం, మార్చి 23, 2020

ఏ దేశమేగినా...

అమెరికా అబ్బాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమెరికా అబ్బాయి (1986)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సినారె
గానం : సుశీల 

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

రాయప్రోలన్నాడు ఆనాడూ..
అది మరిచిపోవద్దు ఏనాడూ..

పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ..

వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?

గాలికీ నీటికీ లేవు భేధాలూ..
మనుషుల్లో ఎందుకీ తగాదాలు
కులమత విభేదాలూ

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా...
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....

ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...

అందుకే నిరంతరం సాగాలి దీక్షా

 

ఆదివారం, మార్చి 22, 2020

వాణీ పాహిమామ్...

ముంబై ఎక్స్ ప్రెస్ చిత్రంలోని వాణీ పాహిమాం అంటూ స్కూల్ పిల్లల ప్రార్థనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమేవినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముంబై ఎక్స్ ప్రెస్ (2005)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : కోరస్

వాణీ పాహిమామ్..
శ్రీ వాణీ పాహిమామ్..
శ్వేతా కమలీ
స్వరలయ విమలీ
నిరంతర హృదయ నివాసిని
వాణీ పాహిమామ్
ఆ వాణీ పాహిమామ్..
సూర్య ప్రకాశినీ
సుమధుర శోభిని
అమృత భాషిణి
అక్షర మాలిని
కృపా సాగరీ
దీన దయాకరీ
జననీ జన్మ
సౌమ్య కారిణీ

వందేమాతరం..
వందేమాతరం..
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం..
వందేమాతరం..
వందేమాతరం.. 
 

శనివారం, మార్చి 21, 2020

భలే తాత మన బాపూజీ...

దొంగరాముడు చిత్రంలోని ఒక చక్కని మధుర గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : సుశీల

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

కుల మత భేదం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోశాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
 
నడుం బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వారాజ్యం
మనకు లభించెను స్వారాజ్యం

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
 
సత్యాహింసలె శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు

భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ


శుక్రవారం, మార్చి 20, 2020

గురువంటే గుండ్రాయి కాదు...

హైహైనాయక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : హైహై నాయకా (1989)
సంగీతం : సురేశ్‌చంద్ర (మాధవపెద్ది సురేష్)
సాహిత్యం : ముళ్ళపూడి శాస్ర్తి
గానం : బాలు, మంజునాథ్

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులువిరబూసి మధువులు చిందాలి

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
కథలెన్నీ వర్ణించినా హితమెంత బోధించినా
దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని
స్వార్థాన్ని పక్కకునెట్టి మానవతను పెంచమని
ఎలుగెత్తి చాటాయి...
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
వివరించే నీతి ఒక్కటే...
సూచించే సూత్రమొక్కటే...
మంచికి విలువీయకుంటే
వంచన విడనాడకుంటే
మతసహనం మాటమరచి
సమతకు తను సమాధికడితే
నరుడే దానవుడవుతాడు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులు విరబూసి మధువులు చిందాలి

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు 
 

గురువారం, మార్చి 19, 2020

అహో బాలూ ఒహో బాలూ...

దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఓ సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తి పాట యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : రంజిత్, శ్రీచరణ్, కోరస్

ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్
టూ బాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావ్
ఓ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావ్
టూ బ్యాడ్ మిల్లీ గ్రాం బ్రెయినే ఇచ్చావ్
ఓ గాడ్ ఒన్ డే మ్యాచే ఇచ్చావ్
టూ బ్యాడ్ సేం డే ఎక్జాం ఇచ్చావ్
ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్లు గా ఇచ్చావ్
టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్ల గా ఇచ్చావ్
తల తిప్పలేనన్ని అందాల్ ఇచ్చావ్
తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
డబుల్ గేంసేంటి మాతో నీకే
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్ కే

ఊహ్ ఎలా ఎలా ఎలా...
ఊహ్ ఎలా ఎలా ఎలా...
ఊహ్ ఎలా ఎలా ఎలా...
ఊహ్ ఎలా ఎలా ఎలా...

మెమరీ కార్డ్ సైజేమో చోటి
మెమరీ స్టేటస్ కోటి
మిల్లీగ్రాం బ్రెయినైతే ఏంటీ
మిరకిల్స్ చెయ్ దాంతోటి
బాత్రూంలో పాటలకి బదులు
ఫార్ములానే పాడు
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం
స్వాతీ బుక్కే చూడూ

అబ్బబ్బ ఎం చెప్పేడ్రా

అహో బాలూ ఒహో బాలూ
అంకెలు మొత్తం వందలు వేలు
వీడి రాంక్ తోటే మొదలు

అహో బాలూ ఒహో బాలూ
ఎ టు జెడ్ అని చదివే బదులు
బి టు యు అంటే చాలు

బల్బ్ ని కనిపెడదాం అనుకున్నామూ
ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నామూ
ఆ గ్రహంబెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడూ
ఆస్కార్ పని పడదాం అనుకున్నామూ
కాని రెహ్మాన్ దాన్ని ఓడిసి పట్టేసాడు
అట్లీస్ట్ ఫస్ట్ రాంక్ కొడదాం అనుకున్నమూ
కాని బాలుగాడు దాని కోసం పుట్టేసాడు

ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా

బల్బ్ ని కనిపెట్టిన ఎడిసన్ మరి
చదువుకు కనిపెట్టాడా మెడిసిన్
టెలిఫోన్ తో స్టాప్ అని అనుకునుంటే
స్టార్ట్ అయ్యి ఉండేదా సెల్ ఫోన్...
ఇంతే చాలు అనుకుంటూ పొతే
ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటితో సరి పెట్టుకుంటే
నేటికి లేదు టుమారో...

అబ్బబ్బ ఎం చెప్పేడ్రా...

అహో బాలూ ఒహో బాలూ
బాలు కందని లాజిక్ లన్ని
కావా నవ్వుల పాలు

అహో బాలూ ఒహో బాలూ
అనుకోడేపుడూ ఇంతే చాలు 
ఈడి మైండ్ రేసులో గుర్రం కాలు

లక్ ఉన్నోళ్ళకి రాంకులు ఇచ్చావ్
నోట్లున్నోళ్ళకి స్లిప్పులు ఇచ్చావ్
అట్లీస్ట్ అమ్మాయిల కి అందాన్నిచ్చావ్
మమ్మల్నేమో నిండా ముంచావ్
బ్రిల్లియంట్ స్టుడెంట్స్ కి ఎ గ్రేడ్ అంటా
యావెరేజి స్టుడెంట్స్ కి బి గ్రేడ్ అంటా
మమ్మల్నేమో డీ గ్రేడ్ చేస్తావ్
క్యాస్ట్ లు మతాలు వద్దంటూనే
గ్రేడు లతో విడదీస్తుంటావ్

ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా

హే చెట్టుకి పూత కాయ పండని
మూడు రకలుగా చూస్తాం
పూతై పూసి కాయై కాసి
పండైతేనే విలువిస్తాం
గ్రేడ్ అంటె ఏబిసి బళ్ళో
బ్రైనుని కొలిచే స్టిక్కు
కాంపిటిషన్ లేదంటే రేసులో
గెలుపుకు ఉందా కిక్కూ...

అబ్బబ్బ ఏం చెప్పేడ్రా...

అహో బాలూ ఒహో బాలూ
నెంబర్ వన్ను కి రొటీన్ బాలు
చదువు కి ప్రోటీన్ బాలు

అహో బాలూ ఒహో బాలూ
సెటిలేదైనా సెంటర్ బాలు
క్వశ్చనేదైనా ఆన్సర్ బాలు

బాలు చదివిన బుక్ అంటా
వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్స్ అంటా
వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలూ వాడిన పెన్నంటా
ఆయుధ పూజలు చేద్దాం
బాలూ నడిచిన బాటంటా
అందరు ఫాలో అయిపోదాం


బుధవారం, మార్చి 18, 2020

సుందరాకాండకు...

సుందరకాండ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సుందరకాండ (1992)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి...
హో హో హో...
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్......

జాక్సన్ స్టెప్స్ కు..
హో హో హో..
లాఫర్ లిప్స్ కు..
హో హో హో..
జోలీడే పాప్స్ కు
హో హో హో..
Come Come.....
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...

సుబ్బరాజు
వచ్చాను Sir..
ఇబ్రహీం
ఇక్కడ వున్నా...
అశోకుడు చెట్లు నాటించెను
మన నవ్వులే అవి పూయించెను
వనజా
వచ్చగా...
పాకిజా
ఆయి హు...
మహాత్ముడు ఫ్రీడమిప్పించెను
మన పగ్గాలనే అది తెంచేసేను
అరే నిన్నటి లెక్చరు సినిమా
స్కోపుల పిక్చరు కావాలి
అది ఆంధ్ర సీడెడ్ నైజాం
ఎరుగని సిక్సరు కొట్టాలి..
ఇదేరా ఖుషీలా మజాల కిష్కింధకాండ
 
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి...
హో హో హో...
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్...

ఎమ్వీఎస్ 
ఎస్ ఎస్సూ..
ఎస్వీఆర్
ఆ నేనే సారూ...
గులామలీ ఘజలే పాడవోయ్
కథాకళి కసిగ ఆడవోయ్
సక్కుబాయి
సామిరంగా...
సత్యభామ
అమ్మదొంగా..
రాగింగు లో రంభ ఏమన్నదోయ్
జాగింగు లో జత నేనన్నదోయ్
అది వన్ ఇయరాడిన సూపర్
హిట్లర్ సెక్సీ థ్రిల్లర్ లే
అరే మచిలిపట్నపు మ్యాట్నీ
ఆటకు బాక్సులు నిండును లే
ఇదేరా...ఆ హమేషా... ఆ
తమాషా కాలేజీకాండ....
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి...
హో హో హో...
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్......
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...


మంగళవారం, మార్చి 17, 2020

గగనం మనకు బాట...

అంజలి సినిమాలోని మరో చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంజలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : డి.కౌసల్య,ఆర్.సులోచన, బి.పద్మ, ఆర్.సుచిత్ర, లలిత, ఆర్, మహలక్ష్మి, ఎస్.ఎన్.హేమ మాలిని, ఆర్.కల్పన, ఆర్.ప్రసన్న, జమ, శుభశ్రీ, షర్మిల

హే..యా.. పపప పాపా.. పపపాపా పాపాప..
పపప పా పపప పా పా పా
హేయా.. హేయా.. పపపప
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గాలుల్లో తేలుదాం.. సరదాగా సాగుదాం
గగనమేలే లేదెదురిక
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...

ఊరుచుట్టు బాలలకు ఈ మండుటెండ వెన్నెలమ్మ.
పిల్లవాళ్ళ కన్నులకు.. ఈ పగటివేళ రాతిరమ్మా..
ఈనాడు మనమంత జాజిమల్లె పూలే..
ఈ పూట వలదంట పాఠమన్న గోలే
ఈనాడు మనమంత జాజిమల్లె పూలే..
ఈ పూట వలదంట పాఠమన్న గోలే 
మనము పొంగే ఏరులే.. మనకు లేవే హద్దులే..

గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గాలుల్లో తేలుదాం.. సరదాగా సాగుదాం
రగడకేమి లేదెదురిక
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...

పట్టుకోటలోన ఉంది పాటశాలలోన కష్టపడి
పట్టుకోట వీడి వీడి చిన్ని గువ్వలల్ల నింగి తేలి
ఆకాశా వీధిలోన పాటలన్ని పాడే ..
అందాల చిందులాడి తాళమేసి ఆడే
ఆకాశా వీధిలోన పాటలన్ని పాడే ..
అందాల చిందులాడి తాళమేసి ఆడే
మనము పొంగే ఏరులే.. మనకు లేవే హద్దులే..

గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
గాలుల్లో తేలుదాం.. సరదాగా సాగుదాం
రగడకేమి లేదెదురిక
గగనం మనకు బాట.. మేఘం మనకు జంట...
పాపా పపప పాపా.. పాపా.. పపప పాపా... 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.