గురువారం, ఆగస్టు 31, 2017

చినుకు రాలితే... చిగురు నవ్వదా...

చిట్టెమ్మ మొగుడు చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిట్టెమ్మ మొగుడు (1993)
రచన : రసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : జేసుదాస్, చిత్ర

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా
నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా
నింగిలోని జాబిలి మామ నీటిలోని కలువ భామ
ఎంత దూర తీరమునున్నా ఎందుకంత మనసులు దగ్గర

అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం
కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం

వానజల్లు కిందికిరాగ నేల ఒళ్లు ఒంపులు సాగ
ఎందుకంత తీయని ప్రేమా ఎవరికైన తెలిసేనా

అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

 

బుధవారం, ఆగస్టు 30, 2017

నీవేగా నా ప్రాణం అంటా...

చిత్రం ఓపాపాలాలి చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఓ పాపాలాలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఏసుదాస్, చిత్ర

నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీ నీడగా నే సాగేనులే నీ వెంటా

నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే
ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే
పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోన

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

కంటి వెలుగై నిలిచిపోనా మనసులోన నిండిపోనా
కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా
స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా
నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే
నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
  

మంగళవారం, ఆగస్టు 29, 2017

మిల మిల మెరిసెను తార...

నిర్ణయం చిత్రంలోని ఒక చక్కని మెలోడీ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిర్ణయం (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : మనో, ఎస్. జానకి

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా

వెచ్చనైన గుండె గిన్నెలో
వెన్నలింత దాచి ఉంచకు
పొన్న చెట్టు లేని తోటలో
కన్నె వేణువాలపించకు
ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ
పెదవి తాకితే ఓ పాటలే అదీ
ఆమని ప్రేమని పాడే కోయిలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా

మౌనమైన మాధవీ లత
మావి కొమ్మనల్లుకున్నది
ఎల్లువైన రాగమిప్పుడే
ఏకతాళమందుకున్నది
తోచదాయనే ఓ తోడు లేనిదే
కౌగిలింతలే ఓ కావ్యమాయలే
ఎన్నడు లేనిది ఎందుకో ఇలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా


సోమవారం, ఆగస్టు 28, 2017

పొద్దువాలిపోయే నిదరొచ్చే...

తూర్పు సింధూరం చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తూర్పు సిందూరం (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే
పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే
 
చిరుగాలి పరదాలే గలగలలాడి
చెవిలోన లోలాకూ జతగా పాడి
చిరుగాలి పరదాలే గలగలలాడి
చెవిలోన లోలాకూ జతగా పాడి
 బంగరు దేహం సోలుతుంది పాపం
చల్లనీపూటా కోరుకుంది రాగం
నీవే అన్నావే నే పాడాలంటూ
ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్ 

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్
పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే

ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే
ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే
చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే
మెత్తగా లాలీ నే పాడుతాలే
విరిసే హరివిల్లే ఊరించే వేళా
మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్
పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే

ఆదివారం, ఆగస్టు 27, 2017

సాయంకాలం సాగర తీరం...

ఛాలెంజ్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛాలెంజ్ (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

సాయంకాలం సాగర తీరం
నా చెలి వొళ్ళో చలి సందళ్ళో
రోజూ మోజుగా జల్సా చేయరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

సాయంకాలం సాగర తీరం
వెచ్చని వొళ్ళో వెన్నెల గుళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా

కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథకాస్త నడిపించనా
ఆహహహహ
మరుమల్లె మరి విచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల
మరుమల్లె మరి విచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల
రానంటానా పొదరింటికి పూతకొచ్చి
పండుతున్న పులకరింత వేళకి

హ సాయంకాలం... సాగర తీరం...
 
సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందే లేదంటానా
సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందే లేదంటానా
రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ
తెల్లారిపోనిస్తానా లాలాలలాల

చెలిగాలి మరి చంపితినే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల
చెలిగాలి మరి చంపితినే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల
రమ్మంటావా సందిళ్ళకి
ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి

సాయంకాలం సాగర తీరం
నా చెలివొళ్ళో చలి సందళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

సాయంకాలం సాగర తీరం
సాయంకాలం సాగర తీరం

  

శనివారం, ఆగస్టు 26, 2017

అబ్బబ్బా చందమామ లాంటి...

యుద్ధభూమి చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యుద్ధభూమి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

అబ్బబ్బా చందమామలాంటి పిల్ల 
సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే
ఆహాహా...తకఝం..తకఝం..

అమ్మమ్మో చందమామలాంటి వాడు 
బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే  
ఆహాహా... తకఝం..తకఝం..

తాకుతుంటే ఒళ్ళూ ఒళ్ళూ తకఝం..తకఝం..
తాకిడాయే ఒంపు సొంపు తకఝం..తకఝం..
బుంగమూతి కజ్జికాయ బుజ్జిపండు గిచ్చుడాయె 
అమ్మమ్మో.. అబ్బబ్బా.. 

కోక చాటు అందాలు కొంగుదాటగా 
తకఝం..తకఝం..
వాడి కొంటెచూపు బాణాలు కొంపముంచగా 
తకఝం..తకఝం..
అరె ఎప్పుడెప్పుడంటాది నిప్పులంటుకుంటాది 
నా ఈడు.. అబ్బ నీతోడూ.. 
చప్పు చప్పునొస్తాది చప్పరించమంటాది 
ఓ ముద్దు అబ్బ ఈ పొద్దు 
ఆడబెట్టనా ఈడబెట్టనా యాడబెట్టుకోను 
చెప్పు గుండెచప్పుడూ
అమ్మమ్మో చందమామలాంటి వాడు 
బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే  
ఏహేహే... తకఝం..తకఝం..

మంచమెక్కమంటాడు మంచి చెప్పినా 
తకఝం..తకఝం
సందె చుక్కలేళకంటాది నొక్కి చెప్పినా 
తకఝం..తకఝం
అరె గుట్టు గుప్పుమంటాది గూడుదాటి పోతాది 
నా గువ్వ అబ్బ అవ్వవ్వ 
అరె పక్కపక్కకొస్తాది పండు దాగిపోతాది 
నా రెక్క కొత్త నీ రెక్క  
ఏమిచెప్పినా ఎంత చెప్పినా 
తప్పుచేసి కాని తాను తప్పుకోడమ్మా 

అబ్బబ్బా చందమామలాంటి పిల్ల 
సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే
ఆహాహా...తకఝం..తకఝం..

అమ్మమ్మో చందమామలాంటి వాడు 
బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే  
ఓహోహో... తకఝం..తకఝం..

తాకుతుంటే ఒళ్ళూ ఒళ్ళూ తకఝం..తకఝం..
తాకిడాయే ఒంపు సొంపు తకఝం..తకఝం..
బుంగమూతి కజ్జికాయ బుజ్జిపండు గిచ్చుడాయె 
అమ్మమ్మో.. అబ్బబ్బా.. 

 

శుక్రవారం, ఆగస్టు 25, 2017

వాతాపి గణపతి / ప్రియతమా...

మిత్రులందరకూ వినాయకచవితి శుభాకాంక్షలు. ఈ పండగ రోజు వినాయకచవితి చిత్రం కోసం ఘంటసాల గారు గానం చేసిన వాతాపి గణపతిం భజే పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినాయక చవితి (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
గానం : ఘంటసాల

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే


వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వారణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే..ఏఏ..

భూతాది సంసేవిత చరణం
భూతభౌతికా ప్రపంచభరణం
వీత రాగిణం వినుత యోగినం
వీత రాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం

వాతాపి గణపతిం భజే..ఏఏ..

పురా కుంభసంభవ మునివరా  
ప్రపూజితం త్రిభువన మధ్యగతం  
మురారీ ప్రముఖాద్యుపాస్థితం  
మూలాధారా క్షేత్రార్జితం  
పరాది చత్వారి వాగాత్మజం  
ప్రణవ స్వరూప వక్రతుండం  
నిరంతరం నిఖిల చంద్రఖండమ్  
నిజ వామకర విదృతేక్షు దండం  

కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం  
హంసధ్వని భూషిత హేరంబం  

వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే..ఏఏ..




ఇక ఈ రోజు చిరంజీవి పాటగా జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఒక మంచి మెలోడీని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న
పడుచుతనమే నాలో మురిసే


మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదో వేణువూదిపోయే
శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే
మనసు మమత అన్నీ కలిసి


వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె
కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా

 

గురువారం, ఆగస్టు 24, 2017

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా..

మంత్రిగారి వియ్యంకుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో.. చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా..
దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

కాదురా ఆటబొమ్మ.. ఆడదే నీకు అమ్మ
ఎత్తరా కొత్త జన్మ.. ప్రేమ నీ తాత సొమ్మా
తెలుసుకో తెలివిగా మసలుకో
(ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము)
అలుసుగా ఆడకు మనసుతో

ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
జీవిస్తే ఫలితమేమిటి..
శ్రీరాగమున కీర్తనలు మానరా

దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

ప్రేమకై నీవు పుట్టు..  ప్రేమకై నీవు బ్రతుకు
ప్రేమకై నీవు చచ్చి..  ప్రేమవై తిరిగి పుట్టు
మరణమే లేనిది మనసురా..

క్షణికమే యవ్వనమ్ము.. కల్పనే జీవనమ్ము
నమ్ముకో.. దిక్కుగా ప్రేమనే
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
జీవించే మోక్షమార్గము
శ్రీరస్తననుచు దీవెనగ దొరికిన

దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా


బుధవారం, ఆగస్టు 23, 2017

అరె ఏమైందీ.. ఒక మనసుకు...

ఆరాధన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

అరె ఏమైందీ...
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దుర లేపిందీ.. ఆఆఅ...ఆఆ...
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ...

నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది

పూలు నేను చూడలేదూ - పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవూ - నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు
అది దోచావూ...
లలలల లలలల ల ల ల

బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు

రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడూ...

అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ

కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దుర లేపిందీ
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ..
అది ఏమైందీ... 

 

మంగళవారం, ఆగస్టు 22, 2017

ఝుమ్మనే తుమ్మెద వేట...

మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మెకానిక్ అల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. అప్పుడప్పుడే ఆడియో క్వాలిటీకి అలవాటు పడుతున్న నాకు స్టీరియో ట్రాక్ డివిజన్ ని క్లియర్ గా వినిపించేలా రికార్డ్ చేసిన ఈ పాట వినడం గొప్ప సరదా అప్పట్లో. పై ఆడియో లింక్ లోని పాటను ఇయర్ ఫోన్స్ తో వింటే ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది.


చిత్రం : మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం : రాజ్ - కోటి
సాహిత్యం : భువన చంద్ర
గానం : బాలు, చిత్

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామ అదేలే ప్రేమ
జగదేక వీర శూర తరించైనా 
సరసాల సాగరాలె మధించైనా
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట

మిడిసి మిడిసి పడు
ఉడుకు వయసు కథ వినలేదా..ఆఅ
ఎగసి ఎగసి పడు
తనువు తపన నువు కనలేదా..ఆఆ
పెదవులతొ కలవమని
అందుకే నే ముందుకొచ్చా
అందినంతా ఆరగిస్తా
రారా రారా రాజచంద్రమ

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో భామ అదేలే ప్రేమ
సరసాల సాగరాలె మధించైనా
జగదేక వీర శూర తరించైనా 

నిసరిస నిసరిస నిసరిస నిసరిస 
నిపమప నిసరిస
నిసరిస నిసరిస నిసరిస నిసరిస 
నిపమప నిసరిస

సెగలు రగిలె ఒడి
బిగిసె రవికె ముడి అది ఏమో
చిలిపి వలపు జడి
తగిలి రగిలె ఒడి జవరాలా
వడి వడిగా ముడిపడని
చెప్పలేకే చేరుకున్నా
ఓపలేకే వేడుకున్నా
రావే రావే రాగమంజరి

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామా అదేలే ప్రేమ
శృంగార సార్వభౌమా తరించైనా
సరసాల దీవి చేరి సుఖించెయ్..నా..


సోమవారం, ఆగస్టు 21, 2017

కరిగిపోయాను కర్పూర వీణలా...

రేపు ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా ఒక వారం రోజులపాటు తన పాటలను తలుచుకుందాం. ఈ రోజు మరణ మృదంగం చిత్రంలోని ఒక చక్కనైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మరణ మృదంగం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా

మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో.. ఒకే ధ్యాసగా
ఏ ఊసులో.. ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే
పండించుకోమని తపించగా

కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో శృతే మించగా
ఈ ప్రేమలో ఇలా ముంచగా
అధరాలెందుకో అందాలలో
నీ ప్రేమలేఖలే లిఖించగా

కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా

ఆదివారం, ఆగస్టు 20, 2017

సుయ్ సుయ్ మువ్వల గోపాలా...

జాకీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జాకీ (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

సుయ్ సుయ్ సుయ్ సుయ్
మువ్వల గోపాలా జాజిపువ్వుల జంపాలా
నీ పాలబడ్డాక ఏపాల ముంచేవు నాపాలి గోపాలా
నీ ముంగిట గొబ్బెమ్మనైనా నీ ముద్దుల గోపెమ్మనైనా
దీపాల వేళల్లో భూపాల రాగాలు పాడేటీ గోపాలా

సుయ్ సుయ్ సుయ్ సుయ్
మువ్వల గోపాలా జాజిపువ్వుల జంపాలా
నీ పాలబడ్డాక ఏపాల ముంచేవు నాపాలి గోపాలా
 
వెచ్చగ జారే కన్నీళ్ళే వెన్నెల ముత్యాలూ
చెమ్మలు ఆరిన చెక్కిళ్ళే చారెడు పగడాలూ
మల్లెలు నింపిన దోసిళ్ళే మళ్ళూ మాన్యాలూ
నేలకు నేడే దింపిస్తా తారా ధాన్యాలూ
పిల్లనా గ్రోవి అల్లనా గుండె ఝల్లన చల్లగ ఊదేటి వేళా

హాయ్ హాయ్ హాయ్ హాయ్
ముద్దుల గోపెమ్మా పొన్న పువ్వుల నవ్వమ్మా
ఆపాలు తీయొద్దు తాపాలు పెంచొద్దు రేపల్లె బుల్లెమ్మా

నిన్నటి రైకల మబ్బుల్లో చిక్కిన చంద్రుళ్ళూ
గిచ్చిన గోరుల అచ్చుల్లో చేయని చేవ్రాళ్ళూ
కౌగిలి పట్టిన గుర్తుల్లో కందిన అందాలూ
కంటెలు పట్టిన కంఠంలో ఎర్రని రాగాలూ
గుమ్మరో ముద్దుగుమ్మరో 
గుమ్మపాలను తీసేటి ఈ సందెవేళా

సుయ్ సుయ్ సుయ్ సుయ్
మువ్వల గోపాలా మా నవ్వుల గోపాలా
నీ పాలబడ్డాక ఏపాల ముంచేవు నాపాలి గోపాలా
నీ దాచిన వెన్నలు తిన్నా నీ దాగని వన్నెలు కన్నా
గోధూళి వేళల్లో గోరంత దీపాలు నీ కళ్ళే చాలమ్మా

హాయ్ హాయ్ హాయ్ హాయ్
నీ పాలబడ్డాక ఏపాల ముంచేవు నాపాలి గోపాలా
ముద్దుల గోపెమ్మా పొన్న పువ్వుల నవ్వమ్మా
ఆపాలు తీయొద్దు తాపాలు పెంచొద్దు రేపల్లె బుల్లెమ్మా

శనివారం, ఆగస్టు 19, 2017

మనసే పాడెనులే...

సంకీర్తన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
గానం : బాలు, జానకి

తందన్న తానన్న తననననా నాన
తందన్న తానన్న తననననా నాన...
తందన్న తానన్న తందన్న తానన్న
తందన్న తందన్ననా

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే

ఆ ఆ ఆ...ఆఆఆఆఆఆ..

కోయిలలై పలికే...  తీయని నీ పిలుపే...
కురిసెను కోనల్లో రాగాలేవో
కోయిలలై పలికే...  తీయని నీ పిలుపే
కురిసెను కోనల్లో రాగాలేవో

అందియలై మ్రోగే సందెలోనే.. అంచులు తాకే అందాలేవేవో
జిలుగులొలుకు చెలి చెలువం. లల్లా లల్లా లల్లా లల్లా
కొలను విడని నవ కమలం.. లల్లా లల్లా లల్లా లల్లా
జిలుగులొలుకు చెలి చెలువం.. కొలను విడని నవ కమలం
అది మీటే నాలో ఒదిగిన కవితల

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా.. విరితోట పిలుపులా
ఏటి మలుపులా.. విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే మైమరచి.. మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి.. మనసే పాడెనులే

 

శుక్రవారం, ఆగస్టు 18, 2017

శ్రీదేవిని.. నీదు దేవేరిని..

ఈ ఏడాదికి చివరి శ్రావణ శుక్రవారమైన ఈ రోజు శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : ఎస్.వరలక్ష్మి

శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని


అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని
అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని
నీ హృదయ పీఠాన నివసించుదాన
శ్రీదేవిని నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని


పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పదునాల్గు భువనాలు పరిపాలించు
నీ మది నేలి లాలించు భాగ్యము నాదే

శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని


కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా
కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా
ఎనలేని అనురాగ సంతోషములతో.. ఆ.. ఆ
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఎనలేని అనురాగ సంతోషములతో
యేనాటికీ మనకు ఎడబాటులేదు
యేనాటికీ మనకు ఎడబాటులేదు

శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని

 

గురువారం, ఆగస్టు 17, 2017

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే..

అశోక చక్రవర్తి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అశోక చక్రవర్తి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ

ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎదలా ఎదుటే మెరిసీ.. వలపై.. ఇలపై.. నిలిచే.. వేళ

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము

నీ రాధనేరా.. ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే.. వేసి ఈల

నీకెందుకా దేవి పూజ.. నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల.. ఈ దేవతే కాలుజారి
అందుకో.. మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా.. చాలికా...

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము

నీ కొంగు జారి.. శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే.. నా లేత ప్రాణాలు తీసే

నిన్నంటుకున్నాక రేయి.. కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే.. మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా.. కిమ్మనకా.. పొమ్మనక
ఆపరా.. నా దొర.. తొందరా

ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము

ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము


బుధవారం, ఆగస్టు 16, 2017

స్వాతి చినుకు సందెవేళలో...

ఆఖరి పోరాటం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వణుకు అందగత్తెలో... హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా... హా
భలే కదా గాలి ఇచ్చటా...

స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వలపు అందగాడిలో... హొయ్
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా..హోయ్..
ఇదే కదా చిలిపి ఆపదా

ఈ గాలితో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి

నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన

స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్
లేలేత వణుకు అందగత్తెలో.. హొయ్

మబ్బే కన్ను గీటే మతే పైట దాటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా... హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
భలేగుంది పడుచు ముచ్చటా ...హా
భలే కదా గాలి ఇచ్చటా

యా యా యా యా యా యా....
ఈ వానలా కథేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్
ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా


మంగళవారం, ఆగస్టు 15, 2017

మాదీ స్వతంత్ర దేశం...

మిత్రులందరకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్వరపరచిన ఒక దేశభక్తి గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఆంధ్రకేసరి చిత్రంలోనిది ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఇక్కడ వినవచ్చు.


సంగీతం : బాలాంత్రపు రజనీకాంతరావు
సాహిత్యం : బాలాంత్రపు రజనీకాంతరావు 
గానం : టంగుటూరి సూర్యకుమారి

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి
మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి
భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం
భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం
మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర దేవీ కొనుమా నివాళులు మావి
జననీ ఓ స్వతంత్ర దేవీ కొనుమా నివాళులు మావి

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.