శుక్రవారం, మార్చి 15, 2013

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ

ఇళయరాజా గారి ఇటీవలి హిట్ “ఎటో వెళ్ళిపోయింది మనసు” ఆడియోలో పాటలు కూడా బాగానే ఉన్నాఅందులో ఎక్కువగా ఈతరానికి తగినట్లుగా ఆర్కెస్ట్రేషన్ తో పాటలు కంపోజ్ చేయాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. కానీ ఈ “గుండెల్లో గోదారి” పాటలలో సినిమా కూడా 1985 లో కావడంతో అప్పట్లో తను ఇచ్చిన సంగీతం ఎలా ఉండేదో అలాగే కంపోజ్ చేశారు. నాకు ఈ పాటలు వినేకొద్దీ మరింతగా నచ్చేస్తున్నాయి. నాస్టాల్జిక్ ఎఫెక్ట్ ప్రధమ కారణం అంతగా నచ్చేయడానికి.

ఉదాహరణకి ఈ గుండెల్లో గోదారీ పాటనే తీస్కోండి ప్రారంభంలో ఒక బేస్ రిథమ్ ని తీస్కుని పాటంతా అక్కడక్కడ కొద్ది వేరియేషన్ తప్ప అదే రిధం కంటిన్యూ చేస్తారు. అది పాటకి ఒక కంటిన్యుటినీ ఇచ్చి పాటంతా కూడా మనసుకు అలా హత్తుకు పోయేలా చేస్తుంది. ఇతర సంగీత దర్శకులు చేసినాకూడా ఎక్కువగా ఇళయరాజా గారి పాటలలోనే ఇలాంటి బేస్ రిధమ్ బాగా అకట్టుకునేలా ఉంటుంది.

జాలరుల పాటల్లో వచ్చే పదాల ఆధారంగా కలిపిన హైలెస్సో.. తయ్యారె తయ్యారె లాంటి ప్రయోగాలతో వచ్చే బిట్స్ పాటకి మరింత అందాన్నిచ్చాయి. చంద్రబోస్ గారు కాస్త మనసుపెట్టి రాసినట్లున్నారు ఈ పాట సాహిత్యం. గురువులు నేర్పని పాఠాలను అలలే నేర్పిస్తాయి అంటూ భాగ్యాలను వెదికే వలలు గురించి రాయడమే కాక పడుచు జాలరులు అడుగడుగున ఎదురయ్యే సుడులకు ఎదురు నిలిచి ఎలా పోరాడతారో కళ్ళకు కట్టేసారు.

సాగ(హ)సాలు, నన్న(న్ను)నడుపుతుంది లాటి పదాలు అక్కడక్కడ అడ్డంపడినా ఇళయరాజా గారి స్వరం వైవిధ్యమైన నేపధ్యానికి చక్కగా అమరి మరింత అందాన్నించ్చింది. ఈ చక్కని పాట ఒకనిముషం వీడియో ప్రోమో క్రింది వీడియోలో చూడండి పూర్తిపాట ఆడియో రాగా లో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : గుండెల్లొగోదారి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఇళయరాజా

ఏ.హే...తయ్యారె తయ్యారె తయ్య తయ్యారె తయ్యారె తయ్యా
హొయ్యా హొయ్యా.. హొయ్య హొయ్యా.. హొయ్యా హొయ్యా.. హొయ్య హొయ్యా..
హేఏ.. హేహే.. హేహే.. హేహే.. హే...

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే..
వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే..

ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో 
ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో

ఆ గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..

అడుగడుగు అలజడులు సుడులు తిరుగు ఒడిలో..
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో..
అడుగడుగు అలజడులు సుడులు తిరుగు ఒడిలో..
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో..
తరగలుగ పెరిగెను తెగువే పడుచు వరవడిలో..
నురగలుగ కరిగెను దిగులే ఉరుకు ఉరవడిలో..
పౌరుషం పడవలా సాగువేళలో సాహసాలలో..

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..

హొయ్యారే..హొయ్యర హొయ్యా.. హొయ్యర హొయ్యారే..
ఒయ్యారే..ఒయ్యర ఒయ్యా.. ఒయ్యర ఒయ్యారే..
హొయ్యారే..హొయ్యర హొయ్యా.. హొయ్యర హొయ్యారే..
ఒయ్యారే..ఒయ్యర ఒయ్యా.. ఒయ్యర ఒయ్యారే..

ఏసెయ్యి ఏసెయ్యి ఏసెయ్యి ఏసెయ్యి
వంజరం వాలుగా వంజరం వాలుగా
బురదకొయ్య మట్టగిడస ఇలస సందువ
బురదకొయ్య మట్టగిడస ఇలస సందువ
పట్టెయ్యి పట్టెయ్యి చేపనే వడుపుగా..
ఏ తందాన తందాన తందనా తాననా
ఏటిలోన సాగిపోని బతుకే ఏటగా..
తందాన తందాన తందనా తాననా

ఎదురెవరూ అదుపెవరూ ఎగుడు దిగుడు కథలో
పులసలా ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో
ఎదురెవరూ అదుపెవరూ ఎగుడు దిగుడు కథలో
పులసలా ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో
గలగలల గీతం నాదే గెలుపు రాగంలో..
జలజలల సైన్యం నాదే చిలిపి రాజ్యంలో..
రాజునే నేనుగా నీటి కోటలో గాలి వాటులో..

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే..
వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే..

ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో 
హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ హైలెస్సో

ఆ గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ.

సోమవారం, మార్చి 11, 2013

నను నీతో.. నిను నాతో

మొన్న శుక్రవారం విడుదలైన గుండెల్లో గోదారి సినిమా పాటలు ఎపుడో నాలుగునెలల క్రితమే విడుదలైనా నాకు వినే అవకాశం దొరకలేదు. ఈ మధ్యనే వినడం మొదలు పెట్టిన ఈ పాటలు వింటున్నపుడు కొన్నిటిలో సినిమా సెటప్ కి తగినట్లుగా ఎనభైలలో ఇళయరాజా పాటలు విన్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాట నాకు విన్నవెంటనే బాగా నచ్చేసింది. అనంత శ్రీరాం సాహిత్యం అందించిన ఈ పాటను భవతారిణి చాలా చక్కగా పాడింది. చిత్రీకరణ మంచు లక్ష్మి సందీప్ లపై తీసినట్లున్నారు. అటాచ్ చేసిన వీడియోలో పాటలోని కొంత భాగం చూడవచ్చు. పూర్తిపాట ఆడియో రాగాలో ఇక్కడ వినండి.
 

చిత్రం : గుండెల్లో గోదారి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : భవతారిణి

నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఎమౌతావో నాకు నువ్వు, ఎమౌతానని నీకైనా నేను?
అందించావు ఈ కొలువు, నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను.

నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..

ఆ వరిపైరు పరుపెయ్యాలా గాలులు జోల పాడాల
ఆ హరివిల్లు మన ఉయ్యాలా నిన్నే నేనూ ఊపాలా
ఈ చెమ్మచెక్క చూసి వేగుచుక్కలే ఆ నింగి నుంచి దూకీ..
నా కళ్ళగంతలేసి కంటిలోపలా నీ నవ్వుల్నే చూపాలా
ఊహలు ఎన్నో నాకున్నా
మరిచేనే నన్నేనేను నీ ఊసే వింటే.. నీ ఊసే వింటే..

నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఎమవుతావో నాకు నువ్వు, ఎమౌతానని నీకైనా నేను?
అందించావు ఈ కొలువు, నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను.

నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..

మారిన ప్రాయం కోరినవన్నీ దొరికే తీరం నువ్వేరా
ఏమిటి న్యాయం నేనొక్కదాన్నే ఆశల భారం మోయ్యాలా
నీ వెచ్చనైన సాయం ఇచ్చి చూడమందీ వెన్నెల్లో గోదారి..
ఆ వంద ఏళ్ళ నెయ్యం పుచ్చుకోమందీ గుండెలోన దూరి.
ఆయువు ఉన్నా లేకున్నా..
క్షణమైనా చాలంటాను నీతోడై ఉంటే .. నీతోడై ఉంటే..

నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..
ఎమవుతావో నాకు నువ్వు, ఎమౌతానని నీకైనా నేను?
అందించావు ఈ కొలువు, నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను.

నను నీతో నిను నాతో కలిపింది గోదారి.
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి..

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.