ధనుంజయ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ధనుంజయ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఫిబ్రవరి 05, 2021

వాటే వాటే వాటే బ్యూటీ...

భీష్మ చిత్రం లోని ఓ సరదాగా సాగే ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భీష్మ (2020)
సంగీతం : మహతి స్వర సాగర్    
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : ధనుంజయ్, అమల చెబొలు 

థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..
 
వాటే వాటే వాటే బ్యూటీ
నువ్ యాడా ఉంటే ఆడ్నే ఊటీ

థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..

వాటే వాటే వాటే బ్యూటీ
నువ్ యాడా ఉంటే ఆడ్నే ఊటీ
తిప్పుతుంటే నడుమే నాటీ
నా కండ్లే చేసే కంత్రీ డ్యూటీ
నువ్ దగ్గరికొస్తాంటే సల్లగ సలి పెడతాందే
దూరమెల్లి పోతాంటే మస్తు ఉడక పోస్తాoదే
టైటు హగ్గిచ్చి టాటూలా అంటుకోరాదే.. రా రాదే..

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు.. అరే.. 
అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.. ఏసేయ్.. 
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు
తెరిచుంచవే పోరి ఫ్రంటు డోరు

థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..

సూడకే సిట్టీ మంటలు పుట్టీ
ఫైరింజన్ తిరుగుతాందె గంటలు కొట్టి
రైలింజన్ లా కూతలు పెట్టీ
టైమంతా గడిపేయ్యకు మాటల తోటీ
ఎండల్లో నువ్ తిరగొద్దే 
సూర్యునికే చెమటట్టుద్దే
ఇంతందాన్నే దాచొద్దే 
ఇన్ కమ్ టాక్స్ రైడైపోద్దే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు.. అరే.. 
అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.. ఏసేయ్.. 
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు
తెరిచుంచేయ్ వే పోరి ఫ్రంటు డోరు

నువ్ కూర్సున్నా ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గ అది ఫ్లైటేనా
ఇన్నాళ్ళుగా సింగిల్ గున్నా
నీ ఫోటోకే నేను ఫ్రేమై పోనా
నువ్ కాలు మోపిన చోటే 
ఈ భూమికి బ్యూటీ స్పాటే
ఫారిన్ లో నువ్ పుట్టుంటే 
తెల్లోళ్ళంతా డక్కౌటే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు.. అరే.. 
అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.. ఏసేయ్.. 
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు
తెరిచుంచేయ్ వే పోరి ఫ్రంటు డోరు
 


బుధవారం, మే 22, 2019

కుష్ కుష్...

గీతా ఛలో చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గీతా...ఛలో (2019)
సంగీతం : జుదా శాండీ
సాహిత్యం :
గానం : ధనుంజయ్, మౌనిక 

క్రీస్తు పూర్వం ద్వాపర కాలం
ఉన్నాడొక వెన్నదొంగ
క్రీస్తు శకం ఈ కలికాలం
ఉన్నాడొక కన్నె దొంగ
గుచ్చే చూపులోడు
పంచు మాటలోడు
చుంచుం మాయలోడు
సురా సుకుమారా
గోల్డెన్నూ స్టారూ..

సాగర తీరనా నులి ఇసుకను కట్టేద్దాం
ఎత్తైన శిఖరం ఎక్కి ఆ నింగిని తాకేద్దాం
ఒక్క చోటే ఉండక ఈ లోకం చుట్టేద్దాం
శృతి మించె వయసు చూపించె దురుసు
నీదేలే రేసూ చిందేసే మనసూ
శృతి మించె వయసు చూపించె దురుసు
నీదేలే రేసూ చిందేసే మనసూ

కుష్ కుష్ వీడు టక్కరోడూ
కుష్ కుష్ వీడు మోజులోడు
కుష్ కుష్ వీడు వేటగాడు
కుష్ కుష్ వీడు ఆటగాడూ
కుష్ కుష్ వీడు సోకులోడు
కుష్ కుష్ వీడు ట్రిక్కులోడు

ఈ గుణ సుందరి సూర్యకమలం
ఈ సిరి కలువే చంద్ర కిరణం
తనకై వేచి ఉంది తులసీ నిత్యం
తన చేయి ముగ్గులేయు రంగోలికందము
సిగ్గుమొగ్గలున్న
గజ్జె కట్తుకున్నా
చిందులేయనున్న
నాట్యమయూరి
కొంటె చూపు మైనా
దివి నుండి దిగినా
బహు చక్కనైన
కన్యాకుమారి


పంచు మాటలోడు
చుంచుం మాయలోడు
సురా సుకుమారా
గోల్డెన్నూ స్టారూ..
కుష్ కుష్ వీడు టక్కరోడూ
కుష్ కుష్ వీడు మోజులోడు
కుష్ కుష్ వీడు వేటగాడు
కుష్ కుష్ వీడు ఆటగాడూ
కుష్ కుష్ వీడు సోకులోడు
కుష్ కుష్ వీడు ట్రిక్కులోడు


గురువారం, మార్చి 03, 2016

నీ నవ్వే హాయిగా వుంది...

మొన్న సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రం "సోగ్గాడే చిన్ని నాయన" చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వర సారధ్యంలో శ్రేయ గానం చేసిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తిపాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : బాలాజి
గానం : శ్రేయ ఘోషల్, ధనుంజయ్

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా 
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు 
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
 
ప్రతిక్షణమూ మనసుపడీ
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా 
ఆలోచిస్తే చాలన్నా

నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే 
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
 
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా

చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేళ్ళిలా నే వుండిపోతాలే
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా 
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ హోహో


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.