బుధవారం, జులై 09, 2014

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు...

కృష్ణశాస్త్రి గారి సాహిత్యం సాలూరి వారి స్వరం సుశీలమ్మ గళం కలగలసిన ఈ గానామృతాన్ని ఆస్వాదించాక దివిలో ఆ అమృతం తాగిన దేవతలేనా మనం కూడా అమరులమే.. అదృష్టవంతులమే అనిపించదూ... ఒకసారి విని మీరే చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.




చిత్రం : ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : పి.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ...
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. 
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...
ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... 
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..

కొలువైతివా దేవి నాకోసము...
కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....
తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... 
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు... 
ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...

ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....

ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...
ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్...


2 comments:

తిరుపతి కొండపై పూచిన పూలని చూసినప్పుడలా ఈ పాటే గుర్తుకొస్తుందండీ..

మధురమైన భావన.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.