శనివారం, జులై 05, 2014

నేను నువ్వంటూ...

ఆరెంజ్ ఆడియో విడుదలైన వెంటనే ఒక రేంజ్ లో ఊపు ఊపేసి సినిమా విడుదలయ్యాక కాస్త జోష్ తగ్గిన పాటలు ఇవి. సినిమా నచ్చిన వాళ్ళకైతే ఈ పాటలు మరింత నచ్చేస్తాయనడంలో ఏ సందేహం లేదు. హరీస్ మ్యూజిక్ వనమాలి లిరిక్స్ పోటీ పడతాయి. ఆధునిక స్టైల్ లోనే ఉంటూ లిరికల్ బ్యూటీని కూడా మిస్ అవకుండా ఉండే ఈ పాటలన్నీ నా ఫేవరెట్సే. వాటిలో ఓ అందమైన పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆరెంజ్ (2010)
సంగీతం : హరీస్ జైరాజ్
సాహిత్యం : వనమాలి
గానం : నరేష్ అయ్యర్, నదీష్

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా 
నాకోసం నేనే వెతికేంతగా ! ఓ గర్ల్..
నువ్వే లేకుంటే లిసన్ గర్ల్.. ఏమౌతానో..ఓఓ..
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా 
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !!

ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా... గాగా..
నా ప్రేమలోతులో మునిగాకా 
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా 

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా !

నిజాయితీ ఉన్నోడినీ 
నిజాలనే అన్నోడినీ
అబద్దమే రుచించనీ అబ్బాయినీ
ఒకే ఒక మంచోడినీ 
రొమాన్సులో పిచ్చోడినీ
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ
ముసుగేసుకోదు ఏనాడూ.. ఓఓ..
నా మనసే ఓ భామా .. ఓఓ..
నను నన్నుగానే చూపిస్తూ 
కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓఓ..!

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా 
నాకోసం నేనే వెతికేంతగా !

తిలోత్తమా తిలోత్తమా  
ప్రతీక్షణం విరోధమా 
ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా  
దివే అలా దిగొచ్చినా  
ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా  
నా ముందూ పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడై  
లోకంలో నిలిచే పేరే నాదేలే...ఓఓఓ.. !

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా ఆఆఅ.. నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా  
నాకోసం నేనే వెతికేంతగా ! 

నువ్వే లేకుంటే ఏమౌతానో
నీ స్నేహాన్నే ఏఏఏఏ.. కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా  
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !!
ఒకసారి చూసి నే వలచానా 
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమలోతులో మునిగాకా 
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా

ఓఓ...ఓఓ... నానానా..నానన్నాన్నా...హో...


2 comments:

ఈ మూవీ లో ప్రతి పాటా మనసుని తాకి హెలో చెపుతుంది..

అవును శాంతి గారు.. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail